అమోల్ పాలేకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమోల్ పాలేకర్
2009లో పాలేకర్ చిత్రం
జననం (1944-11-24) 1944 నవంబరు 24 (వయసు 79)[1]
ముంబాయి, భారతదెశం
వృత్తినటుడు, దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1971–ప్రస్తుతం
జీవిత భాగస్వామిచిత్ర (మొదటి భార్య), సంద్య గోఖలే
తల్లిదండ్రులు
  • కమలాకర్ పాలేకర్ [2] (తండ్రి)
  • సుహాసినీ పాలేకర్ [2] (తల్లి)
పురస్కారాలుఉత్తమ నటుడు (గోల్‌మాల్ 1980)
వెబ్‌సైటుhttp://www.amolpalekar.com

అమోల్ పాలేకర్ (జ.24 నవంబర్ 1944) హిందీ సినిమా నటుడు, దర్శకుడు. హిందీ, మరాఠీ సినిమా నిర్మాత.[3]

జీవిత విశేషాలు

[మార్చు]

పాలేకర్ ముంబాయిలోని సర్ జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో లలిత కళలను అభ్యసించాడు. అతను చిత్రకారుడిగా తన కళాత్మక వృత్తిని ప్రారంభించాడు.[4] చిత్ర కళాకారునిగా ఏడు చిత్రకళా ప్రదర్శనలు, గ్రూపు ప్రదర్శనలు చేపట్టాడు. నాటక ప్రదర్శనలలో చురుకుగా పాల్గొనే పాలేకర్ మరాఠీ, హిందీలలో 1967 వరకూ అనేక ప్రదర్శనలను రూపొందించి నిర్మాతగా, దర్శకుడిగావ్యవహరించాడు. అనేక ప్రదర్శనలలో పాల్గొన్నాడు. దీని ద్వారా గుర్తింపు పొంది తద్వారా హిందీ చిత్రపరిశ్రమకు ఆహ్వానించబడ్డాడు. నటుడిగా 1970 దశకంలో హిందీ చిత్రరంగంలో గుర్తింపు పొందాడు. అతడి ద్వారా అనేక మంచి చిత్రాలు వచ్చాయి. హిందీ, మరాఠీ, మలయాళం, కన్నడ, బెంగాలీ తదితర భాషా సినిమా రంగాలలో ఆయన నటించాడు. సినీ జీవితంలో ఒక ఫిస్మ్‌పేర్ పురస్కారంతో పాటుగా ఆరు రాష్ట్ర పురస్కారాలను ఉత్తమ నటుడిగా అందుకొన్నాడు.

ఇక దర్శకుడిగా ఆయన అనేక సున్నిత కథాంశాలను తెరక్కెక్కించాడు. భారతీయ సాహిత్యం నుండి అనేక కథలను, మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమాలను అతను తెరకెక్కించాడు, మరాఠీ, హిందీ చిత్రాలతోపాటుగా బుల్లితెర (టెలివిజన్) దారావాహికలను కూడా అతను అందించాడు. అతనికి గుర్తింపు తెచ్చినవాటిలో కొన్ని కాచ్చిదూప్, మృగనయని, నఖాబ్, ఫూల్ ఖునా, కృష్ణ కాళి.

నాటకరంగ జీవితం

[మార్చు]

పాలేకర్ మొదట సత్యదేవ్ దూబే ఎక్స్‌పెరిమెంతల్ థియేటర్ ద్వారా మరాఠీ నాటకరంగంలో పనిచేసాడు. తరువాత అనికేత్ అనే సంస్థను 1972లో స్వంతంగా నిర్మించాడు.

సినిమా ప్రయాణం

[మార్చు]
  • పాలేకర్ తన ప్రస్థానన్ని సత్యదేవ్ దూబే మరాఠీ చిత్రం షంతాత కోర్ట్ చలూ అహే ద్వారా 1971లో ప్రవేశించాడు.[5]
  • 1974 లో బాసు చటర్జీ యొక్క రజనీ గంధ చిత్రంలో నటించాడు. ఈ తక్కువ ఖర్చుతో నిర్మిచిన సినిమా ఆశ్చర్యంగా పెద్ద విజయం సాధించింది. తరువాత హౄషీకేష్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన చోటీసీబాత్ ఇంకా పెద్ద విజయం సాధించిపెట్టింది. తరువాత గోల్‌మాల్, నరం గరం సినిమాల ద్వారా పేరు పొందాడు. గోల్‌మాల్ ద్వారా ఫిల్ంపేర్ పురస్కారాలను పొందాడు.
  • తన సినిమాల ద్వారా అప్పటి వరకూ ఉన్న హీరో ఇమేజిని మార్చి, సినిమాల్లో హీరో అంటే మన పక్కింటి అబ్బాయిలా సాదా సీదాగానే ఉండాలి అనే ఒరవడిని సృష్టించాడు.
  • 1979 లో 16 సంవత్సరాల శ్రీదేవితో కలసి సోల్వా సావన్ అనే హిందీ సినిమాలో అంగవైకల్యం కల మానసిక వికలాంగుడిగా నటించాడు. ఇది శ్రీదేవి మొట్టమొదటి హిందీ సినిమా. అమోల్ పాత్రను తమిళంలో కమల్‌హాసన్ నటించాడు.
  • 1982 లో (ఒలంగాల్) అనే మళాయాళం సినిమాలో రవి అనే పాత్రలో నటించాడు.
  • పాలేకర్ మరాఠీ సినిమా ఆక్రిత్ ద్వారా దర్శకుడిగా మారారు. తరువాత సినిమా తోడాసా రూమాని హో జాయెనాతో తన దర్శకత్వ ప్రతిభను ప్రదర్శించి మంచి విజయం అందుకొన్నాడు. ఈ సినిమా మానవ జీవితంలో ప్రవర్తన అనే దాని ఆధారంగా రూపొందించాడు,[6][6] ఇక మరో సినిమా పహేలి ఆస్కార్ 2006 ఉత్తమ ప్రాంతీయేతర సినిమాగా ఎన్నిక చేసారు. అయితే చివరి రౌండ్‌లో వెనుదిరిగింది.

వ్యక్తిగత జీవిత విశేషాలు

[మార్చు]

అమోల్ బొంబాయిలో జన్మించారు. తల్లిదండ్రులు కమలాకర్, సుహాసిని మద్య దిగువ తరగతికి చెందినవారు. అమోల్‌కు నీలం, రేఖ, ఉన్నతి అనే ముగ్గురు అక్కచెళ్ళెళ్ళు. అతడి తండ్రి జనరల్ పోస్టాఫీస్‌లో పనిచేస్తుండేవాడు. తల్లి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండేది.[7] అమోల్ సినిమాల్లో నటునిగా కావడానికి ముందు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తుండేవాడు. అప్పడే కొన్ని సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండేవాడు. అతడి భార్య రచయిత్రి సంధ్య గోఖలే. మొదటి భార్యతో విడాకుల అనంతరం ఈమెను వివాహం చేసుకొన్నాడు.[2][8][9]

ఇతర విశేషాలు

[మార్చు]
  • టెక్ ఏయిడ్స్ వారు రూపొందించిన అనిమేటెడ్ సాప్ట్‌వేర్ కోసం గాత్రం ఇచ్చారు. ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్.[10]

సినీ ప్రస్థానంలో కొన్ని

[మార్చు]

నటుడిగా

[మార్చు]
సంవత్సరం చిత్రం పాత్ర గమనికలు
1969 బాజీరావ్ చా బేటా మరాఠీ సినిమా
1971 శంతత! కోర్ట్ చాలూ ఆహె మరాఠీ సినిమా
1974 రజనీగంథ సంజయ్
1974 జీవనజ్యోతి (1975 సినిమా) సంజయ్ తెలుగు సినిమా
1975 చోటీసీబాత్ అరుణ్ ప్రదీప్
1976 చిట్‌చోర్ వినోద్
1976 గరోండా సుదీప్
1977 భూమిక కేశవ్ దాల్వి
1977 అగర్ ఇఫ్ అనిల్ అగర్వాల్
1977 టాక్షీ టాక్షీ దేవ్
1977 టచ్ మేరే రాణీ మరాఠీ సినిమా
1977 కన్నేశ్వర్ రామ కన్నడ
1978 దామాద్
1978 సఫేద్ జూట్ అమోల్ రాము పాలేకర్
1979 బాతే బాతే మే టోనీ బర్గాంజా
1979 గోల్ మాల్ రాం ప్రసాద్, లక్ష్మణ్ ప్రసాద్
ఫిలింపేర్ అవార్డ్
1979 దో లడ్కే దోనే కడ్కే హరి
1979 మేరే బీవీకి షాదీ భగవంత్ కుమార్
1979 సోల్వా సావన్
1979 బిన్ బాప్ కా బేటా
1979 మదర్ 1979 సినిమా మరాఠీ
1979 జీనా యహాః దినేష్
1980 ఆంచల్ కిషన్ లాల్
1980 అప్‌నే పరాయా చంద్రనాథ్
1981 నరం గరం రామేశ్వర్ ప్రసాద్
1981 సమీరా
1981 అక్రిత్ ముక్తారావ్ బంగాలీ సినిమా
1981 కళంకిణి బంగాలీ సినిమా
1981 అగ్నిపరీక్ష అలోక్ చౌదరి
1981 చెహరా పె చెహారా పీటర్
1981 ప్లాట్ నెంబర్ 5
1982 జీవన్ ధార ఆనంద్
1982 ఒలంగల్ రవి మలయాళం
1982 రాం నగరి
1982 స్పందన్
1982 శ్రీమాన్ శ్రీమతి మదు గుప్తా
1983 రంగ్ బిరంగి అజయ్ శర్మ
1983 ఆశ్రయ్
1983 ప్యాసి ఆంకేన్
1983 చెనా అచేనా బంగాలీ సినిమా
1984 తరంగ్ రాహుల్
1984 ఆద్మీ ఔర్ ఔరత్ తపన్ TV సినిమా
1984 ప్రార్థన
1984 శృంగార మాస కన్నడ సినిమా
1985 ఖామోష్ అమోల్ పాలేకర్
1985 జూతి కమల్ నాథ్
1985 అంకాహీ దేవికానందన్
1985 అబాషేషే బంగాలీ సినిమా
1986 బాత్ బన్ జాయే యశ్వంత్ రావ్
1987 మిస్టర్ ఎక్స్ అమర్ ఇతర కళాకారులచే డబ్బింగ్
1994 తీస్రా కౌన్? సి.కె.కదన్
2001 అక్స్ మినిష్టర్
2009 సమంతర్ కేశవ్ మరాఠీ సినిమా

దర్శకుడిగా

[మార్చు]
  • ఆకరియత్ -1981
  • ఆంకే - 1985
  • తొడాసా రూమని హోజాయెన – 1990
  • బంగర్వాడి – 1995
  • దాయరాల్ – 1996
  • అహంత్
  • కైరీ – 2001
  • దయాస్ పర్వా [11]
  • పహేలి – 2005
  • క్వెస్ట్ – 2006
  • డుంకటా (2007)
  • సామంతర్ – 2009 షర్మిలా టాగోర్)
  • అండ్ ఒంస్ ఎగైన్ – 2010
  • దూసర్ 2011

ఇతర ప్రాంతీయ భాషలలో చలనచిత్రాలు

[మార్చు]
  • మదర్ (బెంగాలీ )
  • కళంకిని (బెంగాలీ)
  • చెన, అచెన (బెంగాలీ )
  • కన్నేశ్వర రామ (కన్నడ)
  • పేపర్ బోట్స్ (కన్నడ , ఆంగ్లం )
  • ఓలంగై (మలయాళం )

టీవీ రంగంలో

[మార్చు]
  • కచ్చీ ధూప్ – 1987
  • నాకాబ్ – 1988
  • పావూల్కున – 1993
  • మృగ్నయనె – 1991
  • కరీనా కరీనా – 2004
  • ఆ బలి ముఝే మార్ - 1987
  • ఏక్ న్యాల్ ఉమ్మీద్ - రోషిని – 2015

రియాలిటీ టెలివిజన్ కార్యక్రమాలు

[మార్చు]
  • కాలకర్జ్

పురస్కారాలు

[మార్చు]
అవార్డ్ సినిమా పాత్ర సంవత్సరం స్థితి
ఉత్తమనటుడుగా ఫిలింఫేర్ అవార్డ్ చోటీసీ బాత్ అరుణ్ ప్రదీప్ 1977 ప్రతిపాదించబడింది
గోల్‌మాల్ రాం ప్రసాద్ దశరథ్ ప్రసాద్ శర్మ 1980 గెలుపు

మూలాలు

[మార్చు]
  1. ‘आपल्यातीलच एक’ थोडासा रुमानी झाला तेव्हा A correct reference about his birthday from Marathi language newspaper loksatta news,Birthday is confirmed person with him to be 24 November,1944 during Marathi language wikipedia workshop
  2. 2.0 2.1 2.2 Amol Palekar: Baaton Baaton Mein
  3. "'Paheli is a simple, loveable film'". Rediff.com. 21 June 2005.
  4. "Painting is like 'ghar wapsi' for me: Amol Palekar". FilmyKeeday. Retrieved 27 June 2016.
  5. "Chronology of Indian Cinema at upperstall". Archived from the original on 2008-05-16. Retrieved 2016-03-11.
  6. 6.0 6.1 https://kanikahanda.wordpress.com/2012/09/18/thoda-sa-roomani-ho-jaaye-movie-review/
  7. "Amol Palekar: Baaton Baaton Mein - The Times of India". The Times of India.
  8. [1] Archived 2011-09-27 at the Wayback Machine.
  9. "Amol Palekar is back in action, this time with an English language ..." The Indian Express. 2 August 2010. Retrieved 13 August 2010.
  10. మూస:Llenging-447244
  11. "Focus". pib.nic.in. Retrieved 2015-07-26.

బాహ్య లంకెలు

[మార్చు]

http://www.sakshi.com/news/family/indian-cinema-is-only-bollywood-188477