అమ్ము స్వామినాథన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమ్ము స్వామినాథన్

పార్లమెంట్ సభ్యులు
పదవీ కాలము
1951 – 1957
ప్రధాన మంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ.
ముందు None
నియోజకవర్గం దిండిగల్ లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1894
మరణం 1978
పాల్‌ఘాట్ జిల్లా
జాతీయత భారతీయులు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి డా. సుబ్బరామ స్వామినాథన్
వృత్తి రాజకీత వేత్త
మతం హిందూ

అమ్ము స్వామినాథన్ లేదా అమ్ముకుట్టి స్వామినాథన్ (1894–1978) భారతీయ రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త. ఆమె భారత స్వాంతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. ఆమె భారతదేశం యొక్క రాజ్యాంగ సభ సభ్యులు.

ప్రారంభ జీవితం[మార్చు]

అమ్ముకుట్టి స్వామినాథన్ కేరళ రాష్ట్రంలోని పాల్‌ఘాట్ జిల్లా లోని అనక్కర యొక్క వదక్కాత్ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి గోవింద మీనన్. ఆయన స్థానిక అధికారి. అమ్ముకుట్టి యొక్క తల్లిదండ్రులు నాయిర్ కులానికి చెందినవారు. వారికి గల సంతానంలో ఈమె కనిష్ఠ పుత్రిక. 13 వ యేట ఆమె వివాహం డా. సుబ్బరామ స్వామినాథన్ తో సాంప్రదాయ పద్ధతులలో జరిగింది. ఆయన బ్రాహ్మణ కుటుంబీకుడు. ఆమె భర్త మద్రాసులో బారిష్టరుగా యున్నారు. ఆయన లండన్ విశ్వవిద్యాలయంలో బారిష్టరు చదివారు. ఆయన హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ ను న్యాయశాస్త్రంలో చేశారు.

కెరీర్[మార్చు]

అమ్ము జీవితం డా.స్వామినాథన్ తో వివాహం చేసుకున్న తరువాత అనేక మార్పులకు గురైంది.ఆయన ఆమె కన్న 20 సంవత్సరాలు పెద్దవాడు. ఆయన ఆమె ప్రతిభను గుర్తించి ఆమె అభివృద్ధికి ప్రోత్సహించాడు. ఆయన ప్రభావంతో ఆమె మహాత్మా గాంధీ అనుచరురాలిగా, శిష్యురాలిగా మారి భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత ఆమె భారతదేశం యొక్క రాజ్యాంగ సభలో సభ్యురాలిగా యున్నారు.

బయటి లింకులు[మార్చు]