అలత్తూర్ శ్రీనివాస అయ్యర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అలత్తూర్ శ్రీనివాస అయ్యర్
వ్యక్తిగత సమాచారం
జననం(1912-01-21)1912 జనవరి 21
మూలంఅరియలూర్, తిరుచిరాపల్లి జిల్లా,మద్రాసు ప్రెసిడెన్సీ
మరణం1980
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తిభారతీయ శాస్త్రీయ సంగీతం గాత్ర విద్వాంసుడు
వాయిద్యాలుగాత్రం

అలత్తూర్ శ్రీనివాస అయ్యర్ (1912–1980), తమిళనాడులో జన్మించిన భారతీయ శాస్త్రీయ గాత్ర విద్వాంసుడు.

విశేషాలు[మార్చు]

ఇతడు అంగారై శంకర శ్రౌదిగళ్, లక్ష్మీ అమ్మాళ్ దంపతుల 12 మంది సంతానంలో ఒకడిగా 1912, జనవరి 21వ తేదీన తమిళనాడు రాష్ట్రం, తిరుచిరాపల్లి జిలా అరియాలూర్‌లో జన్మించాడు.[1] ఇతని సోదరులలో ఎ.ఎస్.పంచాపుకేశ అయ్యర్ సంగీత విద్వాంసునిగా, గురువుగా, రచయితగా, అంగారై విశ్వనాథ భాగవతార్ హరికథకునిగా, తిరుచ్చి రాఘవన్ మృదంగ విద్వాంసునిగా వెలుగొందారు. శ్రీనివాస అయ్యర్ "అలత్తూర్ వెంకటేశ అయ్యర్" వద్ద సంగీతం నేర్చుకున్నాడు. తన గురుపుత్రుడు అలత్తూర్ శివసుబ్రహ్మణ్య అయ్యర్‌ (సుబ్బయ్యర్) (1916-1965)తో కలిసి జంటగా "అలత్తూర్ బ్రదర్స్" పేరుతో (నిజానికి ఇద్దరూ సోదరులు కానప్పటికీ) కచేరీలు చేశాడు. ఆ సమయంలో బృంద-ముక్త ద్వయం అగ్రస్థాయిలో ఉండేది. వారికి దీటుగా ఈ జంట పేరు తెచ్చుకుంది.[2] ఇతడు తన మొదటి కచేరీ పదేళ్ళ చిన్న వయసులోనే ఇచ్చాడు. ఇతడు 1944 నుండి 1968ల మధ్య తిరువాంకూరు సంస్థానంలో ఆస్థాన విద్వాంసుడిగా ఉన్నాడు. ఇతడు తన సహగాయకుడు అలత్తూర్ సుబ్బయ్యర్ మరణానంతరం ఒక్కడే 16 సంవత్సరాలు సంగీత ప్రదర్శనలు ఇచ్చాడు. ఇతనికి 1965లో మద్రాసు సంగీత అకాడమీ సంగీత కళానిధి పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఇతనికి 1968లో కేంద్ర సంగీత నాటక అకాడమీ కర్ణాటక గాత్ర సంగీత విభాగంలో అవార్డును ఇచ్చింది. ఇతని శిష్యులలో చెంగల్పట్టు రంగనాథన్, తిరుప్పంతురుత్తి వెంకటేశన్, బెంగళూరు విజయలక్ష్మి, ఒంగోలు ఎన్.రంగయ్య మొదలైన వారు ముఖ్యులు.

మూలాలు[మార్చు]

  1. V Ramnarayan (11 April 2013). "Who's who in Indian classical music - Alathur Srinivasa Iyer". Sruti Magazine. Retrieved 13 February 2021.
  2. SRIRAM VENKATAKRISHNAN (23 February 2012). "The voice of vidwat". The Hindu. Retrieved 13 February 2021.