Jump to content

అలేఖ్ పాత్రా

వికీపీడియా నుండి
అలేఖ్ పాత్రా
జననం
అలేఖ్ పాత్రా

(1923-07-01)1923 జూలై 1
పురీ లోని బిషూలిపాదా
మరణం1999 నవంబరు 17(1999-11-17) (వయసు 76)
సంబల్‌పూర్
సమాధి స్థలం20°54′18″N 82°49′08″E / 20.905°N 82.819°E / 20.905; 82.819
విద్యB.A.
విద్యాసంస్థకటక్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భారత స్వాతంత్ర్యోద్యమంలో పాత్ర
ఉద్యమంభారత జాతీయ కాంగ్రెసు, సర్వోదయ
జీవిత భాగస్వామిభగవతీ పాత్రా
పిల్లలు3
పురస్కారాలుతామ్రపత్రం

అలేఖ్ పాత్రా (1923 జూలై 1 - 1999 నవంబరు 17) భారత జాతీయోద్యమ నాయకుడు. [1] శాసనోల్లంఘన ఉద్యమంతో అతను భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నాడు. ఒడిశాలోని వివిధ ప్రాంతాలలో పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు చేసాడు. పౌర హక్కుల ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చాడు. [2]

స్వాతంత్ర్యోద్యమం

[మార్చు]

పాత్రా దాదాపు 18 సంవత్సరాల వయస్సులో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. తన స్నేహితులతో కలిసి, బ్రిటిష్ రాజ్‌కు నిరసనగా నిమపాడా పోలీస్ స్టేషన్‌ను తగలబెట్టాడు. ఈ సందర్భంగా, పోలీసు కాల్పులు జరిగాయి. అతని స్నేహితుడొకరు అక్కడికక్కడే మరణించాడు. పాత్రా ప్రాణాలతో బయటపడి, అరెస్టయ్యాడు. అతన్ని పూరీ జైలులో బంధించారు. వలసవాదానికి వ్యతిరేకంగా పాత్రా తన ప్రచ్ఛన్న పోరాటాన్ని కొనసాగించాడు. తన ప్రచ్ఛన్న కార్యకలాపాలను చేస్తూనే కలకత్తా వెళ్లి అక్కడ కొంతమంది ధనవంతుల ఇళ్ళలో పనిమనిషిగా పనిచేశాడు.

అయితే, అతనక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు. ఆచార్య హరిహర్, గోపబంధు దాస్ తదితరులతో కలిసి బహిరంగంగా పోరాడాలనుకున్నాడు. స్నేహితుల అభ్యర్థన మేరకు ఒడిశాకు తిరిగి వచ్చేసాడు. అతను కోల్‌కతా నుండి తిరిగి వచ్చినప్పుడు పూరి రైల్వే స్టేషన్‌లో బ్రిటిషు పోలీసులకు పట్టుబడ్డాడు. మళ్లీ జైలుకు వెళ్ళాడు.

జైలులో ఉండగా పాత్రా పత్తి వడికేవాడు. పరిశుభ్రమైన పరిసరాల కోసం మరుగుదొడ్లను శుభ్రపరచడం, రోజూ సామూహిక ప్రార్థనలు చేయడం, గాంధీజీ ప్రవచించిన ఇతర సూచనలను పాటించడమూ సాధన చేశాడు. జైలు నుండి విడుదలైన తరువాత, అతను స్వరాజ్ గురించి, స్వయంపాలన, తదితర సర్వోదయ పనులపై శిక్షణ పొందడానికి వార్ధాకు వెళ్లాడు.

మరణం

[మార్చు]

పాత్రా 1999 నవంబరు 17 న సంబల్‌పూర్‌లో మరణించాడు. అతని మొదటి వర్ధంతి సందర్భంగా, ఒరిస్సా లోని ప్రముఖ రచయితలు, ప్రముఖ వ్యక్తుల కథనాలతో మాటి దీపారా అలేఖ్య అనే పుస్తకాన్ని ప్రచురించారు.

పురస్కారాలు, గౌరవాలు

[మార్చు]
  1. భారత ప్రభుత్వం నుండి తామ్రపత్రం
  2. పర్యావరణానికి, గిరిజనులకూ చేసిన సేవలకు గాను సిటీజన్స్ ఫోరమ్ ఆఫ్ కాశిపూర్ నుండి గౌరవ వేతనం
  3. గాంధీజీ నుండి ఖాదీ ఉత్పత్తిలో సర్టిఫికేట్ లెటర్ ఆఫ్ పర్ఫెక్షన్

మూలాలు

[మార్చు]
  1. Bijay Chandra Rath (1994). Quit India movement in Orissa. Arya Prakashan. p. 60. ISBN 9788174120328.
  2. Book named "Maati deepa ra aalekhya" published on first death anniversary of the Late Freedom Fighter on 17 November 2000