అల్ఫాల్ఫా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Alfalfa
75 Medicago sativa L.jpg
Medicago sativa
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
Species:
M. sativa
Binomial name
Medicago sativa
Subspecies

Medicago sativa subsp. ambigua (Trautv.) Tutin
Medicago sativa subsp. microcarpa Urban
Medicago sativa subsp. sativa L.
Medicago sativa subsp. varia (T. Martyn) Arcang.

అల్ఫాల్ఫా (మెడికాగో సాటివా L. (Medicago sativa L.) ) గింజల జాతి ఫెబాకే (Faraceae)లోని పుష్పించే మొక్క, ఇది ప్రధానంగా పశుగ్రాసం పంటగా పండించబడుతుంది. UK, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్లలో దీనిని లుసెర్న్ (lucerne) గానూ మరియు దక్షిణాసియాలో లుసెర్న్ గ్రాస్ (lucerne grass) గానూ పిలుస్తారు. ఇది క్లోవర్ (clover) ను పోలి చిన్న వంకాయ రంగు పువ్వుల గుత్తులను కలిగి ఉంటుంది.

ఆవరణశాస్త్రం[మార్చు]

అల్ఫాల్ఫా శీతాకాలపు శాశ్వత లెగ్యూమ్ (legume), ఇది రకం మరియు వాతావరణంబట్టి ఇరవై ఏళ్ళకు పైగా బ్రతుకుతుంది.[2] ఈ మొక్క సుమారు 1 metre (3 ft) ఎత్తు వరకూ పెరుగుతుంది, అంతేకాక లోతైన వ్రేళ్ళవ్యవస్థ కలిగి ఉంటుంది, ఈ వ్యవస్థ కొన్ని సార్లు 15 metres (49 ft)పైగా ఉంటుంది.[2] ఇందువలన ఇది ముఖ్యంగా కరువును తట్టుకోగల సామర్థ్యం కలిగి ఉంటుంది.[2] ఇది టెట్రాప్లాయిడ్ (tetraploid) జెనోం (genome) కలిగి ఉంటుంది.[3]

ఈ మొక్క ఆటో-టాక్సిసిటీ (autotoxicity) గుణాన్ని కలిగి ఉంటుంది, దీని అర్థం ప్రస్తుతం అల్ఫాల్ఫా పండించే చోట్ల అల్ఫాల్ఫా విత్తనం మొలకెత్తడం కష్టం.[4] కాబట్టి, అల్ఫాల్ఫా పొలాలు తిరిగి విత్తనాలు చల్లేముందు ఇతర మార్పిడి పంటలతో పండించడం నిర్దేశిస్తారు (ఉదాహరణకు, మొక్కజొన్న లేదా గోధుమ).[5]

సంస్కృతి[మార్చు]

అల్ఫాల్ఫా ప్రపంచ వ్యాప్తంగా ప్రధానంగా పశువులకు గ్రాసంగా పండించబడుతుంది, మరియు తరచూ గడ్డిగానూ, కానీ తిండిగా, పచ్చగడ్డిగానూ పశువులే తినడమో, లేదా వాటికి తినిపించడమో చేయవచ్చు.[6] అల్ఫాల్ఫా అన్ని గడ్డి పంటలలోనూ అత్యధికంగా గ్రాసంగా వాడతారు, తక్కువగా వ్యవసాయ క్షేత్రంలో వాడతారు.[5] అది సరిపోయే నెలల్లో పండించినపుడు, అల్ఫాల్ఫా అత్యధిక దిగుబడి ఇచ్చే పశుగ్రాసపు పంట.[7]

దీని ప్రాథమిక ఉపయోగం పాల డెయిరీ పశువులకు గ్రాసంగా ఉపయోగించడం—దీనికి కారణం అది ఎక్కువ ప్రోటీన్ మరియు సులభంగా జీర్ణమయే ఫైబర్ కలిగి ఉండడం-రెండవ ఉపయోగం మాంసానికి ఉపయోగ పడే పశువులు, గుర్రాలు, గొర్రెలు మరియు మేకల కొరకు.[8][9] మనుష్యులు సైతం అల్ఫాల్ఫా యొక్క మొలకెత్తిన విత్తనాలను సలాడ్లు మరియు సాండ్విచ్ లలో తింటారు.[10][11] నీరు తీసివేసిన అల్ఫాల్ఫా ఆకు వ్యాపారపరంగా ఆహార ప్రత్యామ్నాయంగా వివిధ రూపాల్లో, మాత్రలు, పౌడర్లు లేదా టీగా దొరుకుతుంది.[12] కొందరి నమ్మకం ప్రకారం అల్ఫాల్ఫా గాలక్టో-గాగ్ (galactagogue), చనుబాల ఉత్పత్తిని పెంచే పదార్థం.[13]

ఇతర లెగ్యూమ్ ల లాగే దీని వేరు భాగాలు సినోరిజోబియం మేల్లోటి (Sinorhizobium meliloti) అనే బాక్టీరియా వలన, నత్రజనిని పుట్టించే గుణం కలిగి, నేల{/2 లోని నత్రజనితో సంబంధం లేకుండా, ఎక్కువ ప్రోటీన్ గల గ్రాసాన్ని ఉత్పత్తి చేస్తాయి.{3/} దీని నత్రజని-ఉత్పాదక సామర్థ్యం (నేలలోని నత్రజనిని పెంచేది) మరియు పశుగ్రాసంగా దీని ఉపయోగం వ్యవసాయ సామర్థ్యాన్ని ఎంతగానో పెంచాయి.[14][15]

అల్ఫాల్ఫాను వసంతం లేదా శిశిరంలోనూ నాటవచ్చు, ఇది pH 6.8 – 7.5 కలిగి ఉంటుంది.[16][17] అల్ఫాల్ఫా సరిగ్గా పెరగడానికి స్థిరమైన పొటాషియం మరియు ఫాస్ఫరస్ స్థాయిలు అవసరం.[18] ఇది నేలలో మరియు పారుదల నీటిలో లవణ స్థాయిలకు కొద్దిగా సున్నితత్వం కనబరుస్తుంది, కానీ తేమలేని నైరుతి సంయుక్త రాష్ట్రాలలో లవణ స్థాయి ఉన్నప్పటికీ పెంచబడుతుంది.[19][20][21] ఫలసాయం తక్కువగా ఉన్న నేలలు పేడ లేదా రసాయన ఫెర్టిలైజర్ ఉపయోగించి సరిచేయాలి, కానీ pH సరిచేయడం అత్యావశ్యకం.[22] సాధారణంగా విత్తనాలు నాటే పరిమాణం 13 – 20 కిలోగ్రాం/హెక్టారు (12 – 25 పౌండ్/ఏకర్) సిఫారసు చేయబడుతుంది, ఇది ప్రాంతం, నేల తరహా, మరియు విత్తనాలు నాటే విధానాన్ని బట్టి మారుతుంది.[23] ఒక మధ్యతరహా పంట కొన్నిసార్లు వాడడం జరుగుతుంది, ముఖ్యంగా వసంతంలో పంటలకు కలుపు సమస్యలను మరియు నేల కోతను నివారించడానికి, కానీ ఇది వెలుతురూ, నీరు మరియు పోషకాల కొరకు పోటీని ఏర్పరచవచ్చు.[24]

చాలా వరకూ వాతావరణాలలో, అల్ఫాల్ఫా సంవత్సరానికి మూడు నుండి నాలుగు సార్లు కోతకు వస్తుంది కానీ దక్షిణ కాలిఫోర్నియాలోని అరిజోనాలో మాత్రం సుమారు 12 సార్లు పండించడం జరుగుతుంది.[25][26] పూర్తి దిగుబడి సాధారణంగా సుమారు హెక్టారుకు 8 టన్నులు (ఎకరానికి 4 చిన్న టన్నులు) ఉండినా, నమోదుల ప్రకారం సుమారు హెక్టారుకు 20 టన్నులు (ఎకరానికి 16 చిన్న టన్నులు) కూడా ఉన్నాయి.[26] దిగుబడి సాధారణంగా ప్రాంతం, వాతావరణం, మరియు కోత సమయానికి పంట యొక్క పరిణతి పై ఆధారపడుతుంది. ఆలస్యంగా కోత దిగుబడిని పెంచినప్పటికీ, పోషక విలువలను తగ్గిస్తుంది.[27]

అల్ఫాల్ఫా లీఫ్కట్టర్ బీ, మెగాకైల్ రోటున్డేట, అనేది అల్ఫల్ఫా పువ్వు పై ఉన్న ఒక పోలినేటర్

అల్ఫాల్ఫాను ఎక్కువ కీటకాలను ఆకర్షించడం వలన కీటక ఆకర్షిణిగా కూడా పిలుస్తారు.[28] అల్ఫాల్ఫా వీవిల్, అఫిడ్స్, ఆర్మీ వర్మ్స్, మరియు బంగాళాదుంప లీఫ్-హాపర్ (leafhopper) వంటి చీడలు అల్ఫాల్ఫా దిగుబడిని గణనీయంగా తగ్గిస్తాయి, ముఖ్యంగా వాతావరణం వేడిగా ఉండే రెండవ కోత సమయానికి.[29] దీనిని నివారించడానికి అప్పుడప్పుడూ రసాయన నియంత్రణ చేపడతారు.[29] అల్ఫాల్ఫా వ్రేళ్ళకు సంక్రమించే మరో బెడద ఫైటోప్తోర (Phytophthora), రైజోక్టానియా (Rhizoctonia), మరియు టెక్సాస్ రూట్ రాట్ (Texas Root Rot) వంటి రోగాలు.[30][31][32]

నూర్పిళ్ళు[మార్చు]

అల్ఫాల్ఫా పువ్వు యొక్క స్తూపాకార కట్ట

అల్ఫాల్ఫాను ఎండు గడ్డిగా ఉపయోగించాల్సినపుడు, సాధారణంగా దానిని కోసి మూట కట్టడం జరుగుతుంది.[33] వదులైన గడ్డి మూటలు కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ వాడుతున్నప్పటికీ, మూట కట్టినవి రవాణా, నిల్వ మరియు మేతకు సులభంగా ఉపయోగించవచ్చు.[34] ఆదర్శవంతంగా, మొదటి కోత మొగ్గ స్థాయిలోనూ తరువాతి కోతలు పుష్పించే సమయానికి, లేదా పదో వంతు పూచినపుడు చేయడం మంచిది, ఎందుకంటే అప్పుడు కార్బో-హైడ్రేట్లు ఆ సమయానికి అధికంగా ఉంటాయి.[35] చేతి కోతల కన్నా వ్యవసాయ యంత్రాలు ఉపయోగించినపుడు, గడ్డికోసే యంత్రం అల్ఫాల్ఫాను కోసి వరుసలుగా పేరుస్తుంది.[36] అల్ఫాల్ఫా స్వయంగా ఎండిపోని ప్రాంతాలలో, గడ్డికోసే-నియంత్రణ యంత్రం ఎండుగడ్డి కోతకు ఉపయోగించబడుతుంది.[33] గడ్డికోసే-నియంత్రం యంత్రానికి రోలర్లు లేదా రోకళ్ల నిర్మాణం ఉండి, గడ్డి కోసే యంత్రం ద్వారా వ్రేళ్ళు కదిలినపుడు నలిపి విరిచేయడం జరిగి, అల్ఫాల్ఫా త్వరగా ఎండిపోవడానికి సహకరిస్తుంది.[37] అల్ఫాల్ఫా ఎండిన తరువాత, ఒక ట్రాక్టర్ బేలర్ను లాగడం ద్వారా ఎండుగడ్డిని మూటలుగా సేకరిస్తుంది.

సాధారణంగా అల్ఫాల్ఫా కొరకు రకరకాల మూటలు వాడతారు. చిన్న జంతువులకు మరియు గుర్రాలకు, అల్ఫాల్ఫా రెండు చిన్న దారాల మూటలను ఉపయోగిస్తారు, సాధారణంగా ఈ పేరు మూటను కట్టడానికి ఉపయోగించే దారాల సంఖ్యను బట్టి పెడతారు, అతి చిన్నదైన రెండు దారాల నుండి, మూడు అంతకు మించినవి చివరికి అర టన్ను కట్టే ఆరు "చతురస్ర" దారాల మూటలు-నిజానికి దీర్ఘ చతురస్రాకారం, మామూలుగా 40 x 45 x 100 సెం.మీ. (14 x 18 x 38 అంగుళాలు) వరకూ ఉంటాయి.[3] చిన్న చతురస్ర మూటలు గాలిలో తేమననుసరించి 25 – 30 కిలోలు (50 – 70 పౌండ్లు) బరువుండి, సులభంగా చేతితో విడివిడి "పొరలు" చేయడానికి వీలుగా ఉంటాయి. గొడ్ల చావిళ్ళలో పెద్ద వృత్తాకార మూటలు, సాధారణంగా 1.4 to 1.8 మీ. (4 నుండి 6 అడుగులు) వ్యాసం కలిగి 500 నుండి 1,000 కిలోల, (1000 నుండి 2000 పౌండ్లు) బరువున్నవి వాడతారు. ఈ మూటలు చావిళ్ళ అమరిక లేదా పెద్ద మేతలలోనూ గుర్రాలగుంపుకి, లేదా పశువులగుంపుకి నేలపై పరచడం చేస్తారు.[3] ఈ మూటలు ఎత్తి అమర్చడం మూట కొడవలిగా పిలువబడే, ఒక ఇనుప కడ్డీ కలిగిన ట్రాక్టర్ ఉపయోగించి, మూట మధ్యలోనికి గ్రుచ్చడం ద్వారా చేయవచ్చు.[38] లేదా వాటిని ట్రాక్టర్ యొక్క ముందు-వైపు ఎత్తే యంత్రంపైని పట్టు (కొక్కెం) ద్వారా చేయవచ్చు. ఇటీవలే కనిపెట్టబడినవి పెద్ద "చతురస్రాకార" మూటలు, సుమారు చిన్న చతురస్రాకార మూటల వంటివైనా, మరింత పెద్దవి. మూటల పరిమాణం పెద్ద చదరపు ట్రక్కు పై భాగంలో అమర్చడానికి అనువుగా చెయ్యబడింది. ఇది పశ్చిమ సంయుక్త రాష్ట్రాలలో మరింత సాధారణం.

డెయిరీ పశువులకు గ్రాసంగా ఉపయోగించేప్పుడు అల్ఫాల్ఫా తరచూ గడ్డివామిగా ఎన్సిలింగ్ (ensiling) ప్రక్రియ ద్వారా చేయబడుతుంది.[8] ఎండు గడ్డిని తయారు చేయడానికి ఎండబెట్టడం కన్నా, అల్ఫాల్ఫాను చిన్న ముక్కలుగా కత్తిరించి గోతులు, కందకాలు, లేదా సంచులలో ఉంచి, కిణ్వ ప్రక్రియను ప్రోత్సహించేలా పరిమిత ప్రాణవాయువు లభించేలా ఉంచి పులియబెడతారు.[39] అల్ఫాల్ఫా యొక్క గాలిలేని కిణ్వ ప్రక్రియ వలన క్రొత్త పశుగ్రాసం లాగా ఎక్కువ పోషక విలువలు కలిగి ఉండడం, మరియు ఎండు గడ్డి కన్నా డెయిరీ పశువులకు తినడానికి సులభంగా ఉంటుంది.[40] ఎన్నో సందర్భాలలో, అల్ఫాల్ఫా గ్రాసానికి వివిధ సూక్ష్మ జీవుల టీకా ఇవ్వడం ద్వారా కిణ్వ ప్రక్రియను వృద్ది చేయడం మరియు గ్రాసం యొక్క వాయు స్థిరతను కాపాడడం జరుగుతుంది.[41]

ప్రపంచ వ్యాప్త ఉత్పత్తి[మార్చు]

ప్రపంచ వ్యాప్తంగా అల్ఫాల్ఫా ఉత్పత్తి

అల్ఫాల్ఫా ప్రపంచంలోనే అత్యధికంగా పండించే లెగ్యూమ్ (legume). 2006 లో ప్రపంచ వ్యాప్త ఉత్పత్తి సుమారు 436 టన్నులు.[42]. అల్ఫాల్ఫా ఉత్పత్తిలో సంయుక్త రాష్ట్రాలు ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నవి, కానీ ఇది అర్జెంటీనా ( ప్రాథమికంగా గ్రాసానికి), ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, మరియు మధ్య పూర్వ ప్రాంతాలలో కూడా కనిపిస్తుంది.

సంయుక్త రాష్ట్రాలలోపల, ముఖ్యంగా అల్ఫాల్ఫా పండించే రాష్ట్రాలు కాలిఫోర్నియా, దక్షిణ డకోటా, మరియు విస్కాన్సిన్. ఊర్ధ్వ మధ్య పశ్చిమ రాష్ట్రాలు సంయుక్త రాష్ట్రాల ఉత్పత్తిలో సుమారు 50%, ఈశాన్య రాష్ట్రాలు 10%, పశ్చిమ రాష్ట్రాలు 40%, మరియు ఆగ్నేయ రాష్ట్రాలు దాదాపు శూన్యం పండిస్తాయి.[ఆధారం చూపాలి] అల్ఫాల్ఫా ఎటువంటి పరిస్థితులకైనా అనువైనది మరియు అతి శీతల ఉత్తర చదును ప్రదేశాల నుండి ఎత్తైన పర్వత లోయలు, అత్యుష్ణ వ్యవసాయ ప్రాంతాల నుండి మెడిటెరేనియన్ వాతావరణం మరియు కాల్చే వేడి ఎడారులలోనూ పండుతుంది.[ఆధారం చూపాలి]

అల్ఫాల్ఫా మరియు తేనెటీగలు[మార్చు]

అల్ఫాల్ఫా విత్తనాల ఉత్పత్తి కొరకు అల్ఫాల్ఫా క్షేత్రాలు పుష్పించేప్పుడు ఫలదీకరణం కారకాలు అవసరమవుతాయి.[3] అల్ఫాల్ఫా ఫలదీకరణం కాస్త సమస్యతో కూడినది, కానీ పశ్చిమ తేనెటీగలు, అత్యంత సాధారణ ఫలదీకరణ కారకాలు, ఇందుకు ఉపయోగపడవు; పుప్పొడి-తీసుకెళ్ళే అల్ఫాల్ఫా పుష్పం యొక్క భాగంపడి, తేనెటీగల తలలపై చిందుతుంది, ఇది పుప్పొడి తిరిగే తేనెటీగద్వారా రవాణా కావడానికి సాయపడుతుంది.[3] పశ్చిమ తేనెటీగలు, తలపై మాటిమాటికీ చిందడం నచ్చక పోవడం వలన, ఈ పువ్వు ప్రక్కనుండే తేనెని సంగ్రహించడంద్వారా ఈ చర్య నుండి తప్పుకుంటాయి. ఈ తేనెటీగలు తేనెని సేకరించినప్పటికీ పుప్పొడిని మోయక పోవడం వలన అవి వెళ్ళే తరువాతి పుష్పాన్ని ఫలదీకరణం చేయవు.[43] పెద్దవి, అనుభవం కలిగిన తేనెటీగలు అల్ఫాల్ఫాను ఫలదీకరణం చేయకపోవడం వలన, చాలా వరకూ ఫలదీకరణం తలపై చిందించే భాగాన్ని తప్పుకుని తేనె సంగ్రహించే ప్రక్రియ నేర్చుకోని చిన్న తేనెటీగల వలన జరుగుతుంది. పశ్చిమ తేనెటీగలు అల్ఫాల్ఫాను ఫలదీకరణం చేసేప్పుడు, తేనెటీగల పెంపకందారుడు క్షేత్రాన్ని ఎక్కువ పరిమాణంలో ఉంచి చిన్న తేనెటీగల సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తాడు.[43]

ఈ సమస్యనుండి తప్పుకోవడానికి ప్రస్తుతం అల్ఫాల్ఫా పత్రచేదన తేనెటీగను ఎక్కువగా వాడుతుంటారు.[44] ఏకాంతంగా ఉండినా గుంపులుగా ఉండడాన్ని ఇష్టపడే తేనెటీగల జాతి కావడం వలన, ఇది సమూహాలు నిర్మించకున్నా, తేనె సేకరించక పోయినా, అల్ఫాల్ఫా పుష్పాల ఫలదీకరణ కారకంగా ఎంతో చక్కగా పనిచేస్తుంది.[44] గూడు కట్టుకోవడం అల్ఫాల్ఫా విత్తనాలు పెంచేవారు ఇచ్చిన చెక్క లేదా ప్లాస్టిక్ పదార్థంలో ప్రత్యేక సొరంగాలలో ఉంటుంది.[43] పత్రచేదన తేనెటీగలు పసిఫిక్ వాయువ్యంలో ఉపయోగిస్తారు, కానీ పశ్చిమ తేనెటీగలు కాలిఫోర్నియాలోని అల్ఫాల్ఫా విత్తనాల ఉత్పత్తిలో సహాయం చేస్తాయి.[43]

విత్తనాల కొరకు ఉత్పత్తి చేసిన కొద్ది అల్ఫాల్ఫా అల్కలి తేనెటీగచే ఫలదీకరణం చెందుతుంది, ఇది చాలా వరకూ వాయువ్య సంయుక్త రాష్ట్రాలలో జరుగుతుంది. ఇది క్షేత్రాల వద్ద ప్రత్యేక స్థలాల్లో పెంచబడుతుంది. ఈ తేనెటీగలకీ వాటి సమస్యలుంటాయి. ఇవి మామూలు తేనెటీగల వలె కదలలేవు; క్రొత్త ప్రదేశాలలో నాటినపుడు, ఈ తేనెటీగలు వృద్ది చెందడానికి కొన్ని ఋతువుల సమయం తీసుకుంటాయి.[43] పుష్పించే సమయానికి తేనెటీగలు ఎన్నో క్షేత్రాలకు రవాణా చేయబడతాయి.

భిన్న రకాలు[మార్చు]

అల్ఫాల్ఫా పువ్వు యొక్క చిన్న చతురస్ర కట్ట

ఈ ముఖ్యమైన మొక్కపై ఎంతో పరిశోధన మరియు అభివృద్ధి జరుపబడింది. 'వసంతం' వంటి పాత పంటలు సంవత్సరాల కొద్దీ ప్రమాణంగా ఉండినా, ఎన్నో అంతకన్నా మంచి పబ్లిక్ మరియు ప్రైవేటు రకాలు ప్రస్తుతం లభిస్తున్నాయి మరియు ప్రత్యేక వాతావరణాలకు మరింత అనువుగా ఉంటున్నాయి.[45] ప్రైవేటు కంపెనీలు సంయుక్త రాష్ట్రాలలో ప్రతి సంవత్సరం ఎన్నో క్రొత్త రకాలను విడుదల చేస్తున్నాయి.[46]

చాలా వరకూ రకాలు శిశిరంలో నిద్రాణంగా ఉంటాయి, దీనికి కారణం తక్కువ ఉష్ణోగ్రతలు మరియు తక్కువ పగటి కాలం.[46] శీతాకాలంలో పెరిగే 'నిద్రాణం కాని' రకాలు మెక్సికో, ఆరిజోనా, మరియు దక్షిణ కాలిఫోర్నియా వంటి ఎక్కువ-కాలం వాతావరణాలలో, మరియు 'నిద్రాణమైన' రకాలు ఊర్ధ్వ మధ్య పశ్చిమం, కెనడా, మరియు ఈశాన్యంలో పండిస్తారు.[46] 'నిద్రాణం కాని' రకాలు అధిక దిగుబడినిస్తాయి, కానీ అవి చల్లని వాతావరణాలలో శీతాకాలపు దాడికి గురవుతాయి మరియు తక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి.[46]

చాలా వరకూ అల్ఫాల్ఫా పంటలు సికిల్ మేదిక్ (Sickle Medick) (M. ఫల్కత (falcata) ) నుండి జన్యు పదార్థం కలిగి ఉంటాయి, ఇది సహజంగా M. సతివ (sativa)తో సంకరం చెంది ఇసుక లుసెర్న్ (sand lucerne) యొక్క వన్యమైన రకం (M. సతివ (sativa) ssp. వేరియా (varia) ). ఈ జాతి అల్ఫాల్ఫా లాగా వంకాయ రంగు పూలు లేదా సికిల్ మేదిక్ (sickle medick) లాగా పసుపు పచ్చని పూలు కలిగి ఉంటుంది అంతేకాక ఇసుక నెలలో సులభంగా ఎదుగుతుంది కాబట్టి అలా పిలువబడుతుంది.[47]

అల్ఫాల్ఫా పొలానికి నీళ్ళు

క్రితం దశాబ్దాలలో అల్ఫాల్ఫాలోని ఎంతో అభివృద్ధి తక్కువ తడి కలిగిన నేలల్లో తడి సంవత్సరాలలో రోగ నిరోధక శక్తి పెంచడం, చల్లని వాతావరణాలలో శీతాకాలాన్ని తట్టుకునే శక్తి, మరియు ఎక్కువ ఆకులు ఉత్పత్తి చేసే సామర్థ్యం వంటి విషయాల్లో జరిగింది. వివిధ-ఆకుల అల్ఫాల్ఫా జాతులు ఒక ఆకుకే మూడు విభాగాలు కలిగి, అంటే కాండంలో మరింత ఆకు పదార్థం ఉండడం కారణంగా బరువులో మరింత పోషక విలువలు కలిగి ఉంటాయి.[ఆధారం చూపాలి].

ది కాలిఫోర్నియా అల్ఫల్ఫా వర్క్ గ్రూప్[1] (UC డేవిస్) లో ఇప్పటి వరకూ గల అల్ఫాల్ఫా జాతి ప్రయోగ అంశాలు[2] ప్రదేశాన్ని బట్టి మరియు ప్రతి సంవత్సరపు క్షేత్ర నిర్వహణ ప్రగతి సమాచారం బట్టి పట్టికలుగా ఉంది.

జన్యు ప్రకారం రూపాంతరం చెందిన అల్ఫాల్ఫా[మార్చు]

రౌండప్ రెడీ అల్ఫాల్ఫా జన్యుప్రకారం రూపాంతరం చెందినరకం, దీని హక్కు మొన్సన్టో కంపెనీవి, ఇది మొన్సన్టో యొక్క గ్లైఫోసేట్ (glyphosate) కు నిరోధక శక్తి కలిగి ఉంటుంది. చాలా వరకూ విశాలమైన ఆకులు కలిగిన మొక్కలు, అల్ఫాల్ఫా సైతం, రౌండప్ కు సున్నితత్వం కనబరచినా, పెంచేవారు రౌండప్ రెడీ అల్ఫాల్ఫా క్షేత్రాలలో రౌండప్ చల్లవచ్చు, దాంతో అల్ఫాల్ఫా పంటకు నష్టం కలగకుండా కలుపును నాశనం చేయవచ్చు.

సంయుక్త రాష్ట్రాలలో చట్ట వివాదాంశాలు[మార్చు]

రౌండప్ రెడీ అల్ఫాల్ఫా సంయుక్త రాష్ట్రాలలో 2005-2007 మధ్య కాలంలో అమ్మబడింది మరియు 300,000 acres (1,200 kమీ2)కన్నా ఎక్కువ మొక్కలు నాటబడ్డాయి, అందులో 21,000,000 acres (85,000 kమీ2). కానీ, 2006 లో సేంద్రియ రైతులు, వారి పంటలపై GM అల్ఫాల్ఫా ప్రభావానికి భయపడి, మొన్సన్టో పై దావా వేసారు (మొన్సన్టో కంపెనీ వర్సస్ గీర్ట్ సన్ సీడ్ ఫార్మ్స్ [48]).[49] దీనికి సమాధానంగా, మే 2007 లో, కాలిఫోర్నియా ఉత్తర జిల్లా కోర్ట్ రైతులు US వ్యవసాయ విభాగం (USDA) జన్యుప్రకారం తయారు చేసిన పంట యొక్క వాతావరణ ఫలితాలను పరిశోధించి నిర్ణయించే వరకూ రైతులను రౌండప్ రెడీ అల్ఫాల్ఫాను వాడకూడదని నిషేధాజ్ఞలు జారీ చేసింది. దీని ఫలితంగా, USDA అటుపై రౌండప్ రెడీ అల్ఫాల్ఫా నాటడంపై నిషేధం విధించింది. ఈ చట్టంలోని ప్రధాన వివాదాంశాలు రౌండప్ నిరోధక శక్తి ఇతర మొక్కలకు పంటలు మరియు కలుపు మొక్కలు రెండింటికీ అంటుకునే అవకాశం, దీని వలన ప్రముఖ చీడ జాతులు ముఖ్యమైన కీటకనాశిని, రౌండప్, నిరోధక శక్తి పెంపొందించుకోవడం; అంతేకాక, మరొక ప్రముఖ సమస్య సేంద్రియ అల్ఫాల్ఫా పంటలు కలుషితమయ్యే అవకాశం.[50] 21 జూన్, 2010, నాడు సంయుక్త రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానం ఈ విషయంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు కొంత అయోమయంగా, ఇరువురూ విజయాన్ని సాధించామని నమ్మేలా ఉన్నాయి.[51] బారీ ఎస్టబ్రూక్ అభిప్రాయం ప్రకారం, 'ది అట్లాంటిక్' వెబ్ సైట్లో,

సాంకేతికంగా మొన్సన్టో గెలిచినప్పటికీ, క్రింది న్యాయస్థానపు నిర్ణయంలో ముఖ్య భాగాలు అలాగే ఉంచబడ్డాయి, దీని అర్థం GM అల్ఫాల్ఫా చట్టబద్ధంగా వ్యాపారపరమైన స్థాయిలో నాటడానికి మరిన్ని క్రమీకరణ అడ్డంకుల్ని దాటాల్సి ఉంది. భవిష్యత్తులో GM కేసులపై తీవ్రమైన ప్రభావం చూపే నిర్ణయంలో భాగంగా, న్యాయమూర్తులు GM పంటలు సంకరమైన-ఫలదీకరణం ద్వారా వాతావరణానికి హాని కలుగజేయవచ్చని భావించారు.[52]

అల్ఫాల్ఫాలో ఫైటో-ఈస్త్రోజన్లు (Phytoestrogens)[మార్చు]

అల్ఫల్ఫా, ఇతర కాయ ధాన్య పంటల లానే, ఫైటో-ఈస్త్రోజన్లు (phytoestrogens) ఉత్పత్తి చేస్తుంది.[53] అల్ఫాల్ఫా తినడం గొర్రెలలో ఉత్పత్తి సామర్థ్యం తగ్గించేదిగా భావింపబడుతుంది.

వైద్య ఉపయోగాలు[మార్చు]

అల్ఫాల్ఫాను మూలికా ఔషధంగా 1,500 ఏళ్ళకు పైగా వాడేవారు. అల్ఫాల్ఫా ప్రోటీన్, కాల్సియం, మరియు ఇతర ఖనిజాలు, B గ్రూప్ లోని విటమిన్లు, C విటమిన్, E విటమిన్, మరియు K విటమిన్లను సమృద్ధిగా కలిగి ఉంటుంది.[54][55]

సాంప్రదాయిక ఉపయోగాలు[మార్చు]

ప్రారంభ చైనీస్ ఔషధాలలో, వైద్యులు అల్ఫాల్ఫా చిగుర్లను జీర్ణ కోశం మరియు మూత్ర పిండాలకు చెందిన రుగ్మతలను సరిచేయడానికి వాడేవారు[ఆధారం చూపాలి]. ఆయుర్వేదవైద్యంలో, వైద్యులు ఈ ఆకులను బలం లేని జీర్ణ వ్యవస్థ సరిచేయడానికి వాడేవారు. వారు చల్లబరిచే పిండిని విత్తనాల నుండి తయారు చేసి పుండ్లకు వాడేవారు. అప్పట్లో అల్ఫాల్ఫా కీళ్ళ నొప్పులు మరియు నీరు చేరడంవంటి వాటికీ పనికొస్తుందని నమ్మేవారు[ఆధారం చూపాలి].

చిత్రశ్రేణి (గ్యాలరీ)[మార్చు]

Medicago sativa 
Medicago sativa 
Medicago sativa 
Medicago sativa 
Flowers 
Yellow flowers 
Light violet flowers 
Seeds 
Lucern field 
Bee on alfalfa flower 

సూచికలు[మార్చు]

 1. "Medicago sativa - ILDIS LegumeWeb". www.ildis.org. Retrieved 2008-03-07. Cite web requires |website= (help)
 2. 2.0 2.1 2.2 http://www.britannica.com/EBchecked/topic/14595/alfalfa
 3. 3.0 3.1 3.2 3.3 3.4 http://ddr.nal.usda.gov/bitstream/10113/22014/1/IND23276500.pdf
 4. http://www.uwex.edu/ces/forage/wfc/proceedings2001/understanding_autotoxicity_in_alfalfa.htm
 5. 5.0 5.1 http://www.kansasruralcenter.org/publications/alfalfa.pdf
 6. http://www.caf.wvu.edu/~forage/library/forglvst/bulletins/salfalfa.pdf
 7. <http://www.uky.edu/Ag/AnimalSciences/pubs/id97.pdf
 8. 8.0 8.1 http://www.uaex.edu/Other_Areas/publications/PDF/FSA-4000.pdf
 9. http://www.hayusa.net/alfalfa.html
 10. http://cookeatshare.com/ingredients/alfalfa-sprouts
 11. <http://alfalfa.ucdavis.edu/IrrigatedAlfalfa/pdfs/UCAlfalfa8305Industrial_free.pdf
 12. http://www.nlm.nih.gov/medlineplus/druginfo/natural/patient-alfalfa.html
 13. http://www.midwiferytoday.com/enews/enews0614.asp
 14. https://portal.sciencesocieties.org/Downloads/pdf/B40724.pdf
 15. http://alfalfa.ucdavis.edu/-files/pdf/alfalfaFactSheet.pdf
 16. http://cestanislaus.ucdavis.edu/files/299.htm
 17. http://forageresearch.tamu.edu/1985/CloverEstablishmentGrowth.pdf
 18. http://www.ces.purdue.edu/extmedia/AY/AY-331-W.pdf
 19. http://extension.missouri.edu/publications/DisplayPub.aspx?P=G4555
 20. http://water.usgs.gov/nawqa/studies/mrb/salinity_briefing_sheet.pdf
 21. http://ag.arizona.edu/pubs/crops/az1129.pdf
 22. http://www.extension.umn.edu/distribution/cropsystems/DC3814.html
 23. http://www.uwex.edu/CES/crops/AlfSeedingRate.htm
 24. http://msuextension.org/publications/AgandNaturalResources/MT200504AG.pdf
 25. http://www.uwex.edu/ces/crops/uwforage/AlfalfaCutHeight.htm
 26. 26.0 26.1 http://www.cfaitc.org/Commodity/pdf/Alfalfa.pdf
 27. http://www.alfalfa.org/pdf/Alfalfa%20for%20Horses%20(low%20res).pdf
 28. http://www.pfspbees.org/Exhibit%203%20to%20PFSP%20Comments%20on%20NRCS%20Conservation%20Practice%20Standards.pdf
 29. 29.0 29.1 http://ohioline.osu.edu/ent-fact/0031.html
 30. http://nu-distance.unl.edu/homer/disease/agron/alfalfa/AlfPhyt.html
 31. http://ohioline.osu.edu/ac-fact/0042.html
 32. http://pods.dasnr.okstate.edu/docushare/dsweb/Get/Document-2321/EPP-7621web.pdf
 33. 33.0 33.1 http://www.uaex.edu/Other_Areas/publications/PDF/FSA-2005.pdf
 34. http://extension.missouri.edu/publications/DisplayPub.aspx?P=G4570
 35. ftp://ftp-fc.sc.egov.usda.gov/ID/programs/technotes/tn8_alfalfaguide3.pdf
 36. http://ucce.ucdavis.edu/files/repositoryfiles/ca1505p2-64859.pdf
 37. http://www.britannica.com/EBchecked/topic/257652/hay-mower-conditioner
 38. http://www.washburncompany.com/
 39. http://ucanr.org/alf_symp/1995/95-55.pdf
 40. http://cals-cf.calsnet.arizona.edu/animsci/ansci/swnmc/papers/2005/Hartnell_SWNMC%20Proceedings%202005.pdf
 41. http://www.extension.iastate.edu/Publications/PM417H.pdf
 42. FAO, 2006. యునైటెడ్ స్టేట్స్ లో ఆహారం మరియు వ్యవసాయ సంస్థ
 43. 43.0 43.1 43.2 43.3 43.4 Milius, Susan (2007). "Most Bees Live Alone: No hives, no honey, but maybe help for crops". Science News. 171 (1): 11–3. doi:10.1002/scin.2007.5591710110. Unknown parameter |month= ignored (help); |access-date= requires |url= (help)
 44. 44.0 44.1 http://www.pollination.com/publications/IPSpub01.cfm
 45. http://ohioline.osu.edu/agf-fact/0014.html
 46. 46.0 46.1 46.2 46.3 http://msuextension.org/publications/AgandNaturalResources/MT199303AG.pdf
 47. జోసెఫ్ ఎల్విన్ వింగ్, అల్ఫల్ఫా ఫామింగ్ ఇన్ ది U.S. 79 ( సాండర్స్ ప్రచురణ Co. 1912).
 48. మొన్సాంటొ కంపెనీ v. గీర్ట్సన్ సీడ్ ఫార్మ్స్ ఏట్ స్కాటస్ వికీ- బ్రీఫ్స్ అండ్ డాకుమెంట్స్, etc.
 49. హొలో విక్టరీ ఫర్ మోన్సాన్టొ ఇన్ అల్ఫల్ఫా కోర్ట్ కేస్ కొత్త శాస్త్రవేత్త, 22 జూన్ 2010 (22 జూన్ 2010 న సంగ్రహింపబడినది )
 50. http://www.aphis.usda.gov/biotechnology/alfalfa.shtml
 51. సుప్రేం కోర్ట్ ఆన్ మోడిఫైడ్ ఫూడ్స్: హో వోన్? బారి ఎస్టాబృక్ చే, ది అట్లాంటిక్. జూన్ 22, 2010 (జూన్ 22, 2010న సంగ్రహింపబడినది )
 52. సుప్రీం కోర్ట్ ఆన్ మోడిఫైడ్ ఫుడ్స్: హు వన్?, బారి ఎస్టాబృక్ చే, ది అట్లాంటిక్. జూన్ 22, 2010 (జూన్ 22, 2010న సంగ్రహింపబడినది )
 53. ఫైటోఎస్ట్రోజెన్ కంటెంట్ అండ్ ఎస్ట్రోజెనిక్ ఎఫ్ఫెక్ట్ అఫ్ లేగ్యుం ఫోడ్దర్. PMID 7892287
 54. Nutrition Research Center, Alfalfa Nutritional Value.
 55. అల్ఫాల్ఫా గురించి వాస్తవాలు, మెలిస్సా కల్పంస్'హెర్బ్ కేర్

బాహ్య లింకులు[మార్చు]