అల్లరి పిల్లలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల్లరి పిల్లలు
(1978 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం సి.యస్.రావు
తారాగణం జి. రామకృష్ణ,
జయచిత్ర
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ అండాళ్ చిత్ర మూవీస్
భాష తెలుగు

శ్రీనివాసరావు పెద్ద సైకిలు కంపెనీ యజమాని. ఆయన భార్య లక్ష్మి ఎల్లవేళలా పూజలు, పునస్కారాలతో మునిగి తేలుతూ వుంటుంది. ఒక రోజున శ్రీనివాసరావు ఆఫీసులో ఉండగా నిర్మల అనే అమ్మాయి వస్తుంది. తమది తిరుపతి అని, గోవిందరాజస్వామి గుడి వెనుక వీధిలో డాబాపై వుండే పద్మావతి తన తల్లి అని చెబుతుంది. దానితో శ్రీనివాసరావులో కలవరం బయలుదేరుతుంది. మీరే నా తండ్రి అంటుంది ఆ అమ్మాయి. ఆ విషయం బయటకు చెప్పవద్దు అని శ్రీనివాసరావు ఆమెను బతిమాలతాడు. నిర్మలను తన ఇంటికి తీసుకువెళ్ళి ఈమె నా పి.ఎ.అని, మన ఇంట్లోనే ఉంటుంది అని అందరికీ చెబుతాడు. ఇది జరిగిన కొన్ని రోజులకు కుమార్ అనే కుర్రాడు డాడీ! డాడీ! అంటూ వస్తాడు. తిరుపతి గోవిందరాజస్వామి గుడి వెనుక వీధిడాబాపై వుండే పద్మావతి తన తల్లి అని శ్రీనివాసరావే తన తండ్రి అని చెబుతాడు. శ్రీనివాసరావుకు ఏమి చేయాలో పాలుపోక కుమార్‌ను కూడా తన పి.ఎ.గా ఇంట్లో ప్రవేశపెడతాడు. శ్రీనివాసరావు తనకు తండ్రి అంటే తనకు తండ్రి అని ఇద్దరు పి.ఎ.ల మధ్య పోరాటం ప్రారంభమౌతుంది. ఇంతలో సైనికుడి దుస్తుల్లో వున్న యువకుడు వచ్చి తాను శ్రీనివాసరావు కుమారుడు అని చెబుతాడు. తన అమ్మమ్మ, తాతయ్య ఇచ్చిన ఉత్తరం చూపిస్తాడు. చిత్రంలో ఇలా కథ వింత వింత మలుపులు తిరుగుతూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది.[1]

నటీనటులు

[మార్చు]
 • జయచిత్ర
 • రామకృష్ణ
 • నాగభూషణం
 • రాజబాబు
 • చంద్రమోహన్
 • అపర్ణ
 • శరత్‌బాబు
 • ధూళిపాళ
 • సావిత్రి
 • దేవదాస్ కనకాల
 • పి.వరలక్ష్మి
 • మాడా వెంకటేశ్వరరావు

పాటలు

[మార్చు]
వరుస సఖ్య పాట రచన సంగీతం పాడిన వారు
1 ఓ రాజులు ఫోజులు ఈ వెర్రి మొర్రి వేషమెందుకు కొసరాజు సత్యం ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల
2 జుంజుం జుమా ఏదైనా చేస్తా పెత్తనమంతా నాదే కొసరాజు సత్యం ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల
3 నారాశి కన్యరాశి నా రాశి మిధున రాశి కలిసేనా జాతకాలు రాజశ్రీ సత్యం ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల
4 శ్రీచక్ర సుఖ నివాసా స్వామి జగమేలు చిద్విలాసా నా స్వామి శృంగార శ్రీనివాసా సి.ఎస్.రావు సత్యం పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రమణ్యం బృందం

మూలాలు

[మార్చు]
 1. వి.ఆర్ (22 March 1979). "చిత్రసమీక్ష - అల్లరి పిల్లలు". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 65, సంచిక 344. Retrieved 11 December 2017.[permanent dead link]

డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007. ఘంటసాల గళామృతం