అల్లాణి శ్రీధర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల్లాణి శ్రీధర్
జననం (1962-06-24) 1962 జూన్ 24 (వయసు 61)
జాతీయతభారతీయుడు
వృత్తితెలుగు సినిమా రచయిత, దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1988–ప్రస్తుతం
జీవిత భాగస్వామిఅల్లాణి నిర్మల

అల్లాణి శ్రీధర్ తెలుగు సినిమా రచయిత, దర్శకుడు.[1] 1988లో కొమరంభీమ్ చిత్రంతో దర్శకత్వ అరంగేట్రం చేశాడు. ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రంగా, ఉత్తమ దర్శకుడుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి 1990లో నంది అవార్డు అందుకున్నాడు.

జననం - విద్యాభ్యాసం[మార్చు]

శ్రీధర్ 1962, జూన్ 24న తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. తన చిన్నతనంలో కుటుంబం హైదరాబాదుకు మారింది. చిక్కడపల్లిలోని ఆంధ్ర విద్యాలయ హైస్కూల్ లో పాఠశాల విద్యను పూర్తిచేసిన శ్రీధర్, పాలిటెక్నిక్ కోర్సులో చేరాడు.

వృత్తి జీవితం[మార్చు]

రచయితగా:
వారపత్రికలో రచయితగా తన వృత్తిని ప్రారంభించిన శ్రీధర్, "క్యాంపస్ క్యాంపస్" అనే ధారావాహికను వ్రాశాడు.

దర్శకుడిగా:
1988లో కొమరంభీమ్ చిత్రంతో దర్శకత్వ అరంగేట్రం చేసిన శ్రీధర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ దర్శకుడి పురస్కారం అందుకున్నాడు. అనేక చిత్రాలకు, ధారావాహికలకు, ప్రచార చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

చిత్రాల జాబితా[మార్చు]

తెలుగు:

  1. కొమరం భీం
  2. రగులుతున్న భారతం
  3. ప్రేమే నా ప్రాణం
  4. ఉత్సాహం
  5. జై శ్రీబాలాజీ
  6. గౌతమ బుద్ధా
  7. హనుమాన్ చాలిసా
  8. హాస్టల్ డేస్
  9. శ్రీ చిలుకూరు బాలాజీ[1]
  10. డూడూ ఢీ ఢీ (హాయిగా ఆడుకుందామా)[2]

హిందీ:

  1. తహి మేరీ గంగా
  2. ఫెస్టివల్ ఆఫ్ ఫెయిత్
  3. తథగతా బుద్ధా
  4. గోస్వామి తులసిదాస్

పురస్కారాలు - అవార్డులు[మార్చు]

  1. నంది ఉత్తమ దర్శకుడు - కొమరంభీమ్ - 1990.
  2. నంది ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత - కమమారాజు కథలు (టీవి ధారావాహిక)
  3. ఉత్తమ టెలివిజన్ దర్శకుడు - యువకళావాహిని
  4. ఉత్తమ దర్శకుడు (ప్రత్యేక బహుమతి) - తుహీ మేరీ గంగా (హిందీ), ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, యు.ఎస్.ఏ
  5. కొమరం భీమ్ స్మారక జాతీయ అవార్డు

నిర్వహించిన పదవులు[మార్చు]

  1. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ అధ్యక్షుడు
  2. తెలంగాణ సినిమా డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
  3. నంది టీవీ అవార్డుల కమిటీ సభ్యుడు (2004)
  4. నంది సినిమా అవార్డుల కమిటీ సభ్యుడు (2006, 2011)

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 నమస్తే తెలంగాణ, సినిమా న్యూస్ (23 June 2017). "అంతర్జాతీయ ప్రమాణాలతో". Retrieved 15 January 2018.
  2. ఆంధ్రప్రభ, సినిమా (17 September 2017). "అల్లాణి శ్రీ‌ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో డూ డూ ఢీఢీ – బాల‌ల చిత్రం". Retrieved 15 January 2018.[permanent dead link]

ఇతర లంకెలు[మార్చు]