అవసరాల రామకృష్ణారావు
Jump to navigation
Jump to search
అవసరాల రామకృష్ణారావు AVASARALA RAMAKRISHNARAO | |
---|---|
జననం | అవసరాల రామకృష్ణారావు డిసెంబర్ 21, 1931 తూర్పు గోదావరి జిల్లా లో తుని[1] |
మరణం | 2011 నవంబరు 28 | (వయసు 79)
నివాస ప్రాంతం | తూర్పు గోదావరి జిల్లా లో తుని |
వృత్తి | ఈయన తుని ఎస్సార్ ఉన్నత పాఠశాల లో ఉపాధ్యాయుడు ఒరిస్సాలో ఇంగ్లీషు రీడర్ విశాఖపట్టణంలో ఇంగ్లీషు లెక్చరర్ |
ప్రసిద్ధి | ప్రముఖ సాహితీవేత్త, నవలా రచయిత |
మతం | హిందూ |
తండ్రి | అవసరాల జగన్నాధరావు పంతులు |
అవసరాల రామకృష్ణారావు (డిసెంబర్ 21, 1931 - నవంబర్ 28, 2011) కథ, నవల రచయిత.
1931, డిసెంబర్ 21న చెన్నైలో జన్మించిన రామకృష్ణారావు రచనా జీవితానికి షష్టిపూర్తి చేశారు. తన కథలు, నవలల ద్వారా ‘స్ర్తీ-విముక్తి’ ఆవశ్యకతను చాటారు. ‘సంపెంగలూ-సన్నజాజులూ’ నవల ఆయనకు మంచి పేరు తెచ్చింది. భారతీయ సాంస్కృతిక రాయబారిగా అభిమానులు ప్రేమగా పిలుచుకునే చందమామ పత్రిక తొలి సంచికకు 1947లో కేవలం పదహారేళ్ల వయస్సులో “పొట్టి పిచిక కథ” అనే కథను రాసి పంపారు.[2]
అవసరాల రామకృష్ణారావు డిప్యూటీ కలెక్టర్ అవసరాల జగన్నాధరావు పంతులు గారి ఆఖరి కుమారుడు. తుని లో, 1940 దశకంలో తాండవనది పొంగి వచ్చిన వరదలలో మరణించిన డా. అవసరాల రామదాసు గారి తమ్ముడు.
మరణం
[మార్చు]2011, నవంబర్ 28 న హైదరాబాదులో స్వర్గస్థులయారు.
జీవితం
[మార్చు]- ఈయన తుని ఎస్సార్ ఉన్నత పాఠశాలలో లెక్కలు, సైన్సు బోధించేవారు.
- తరువాత ఒరిస్సాలో ఇంగ్లీషు రీడర్ గా పనిచేసేరు.
- విశాఖపట్నంలో ఇంగ్లీషు లెక్చరర్ గా పనిచేశారు.
- తెలుగులో నవలలు, కథలు గణనీయంగా రాసి వన్నెకెక్కిన కథా రచయితగా పేరు తెచ్చుకున్నారు.
అందుకున్న కొన్ని పురస్కారాలు
[మార్చు]- 1. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ (1969)
- 2. తెలుగు విశ్వవిద్యాలయం హాశ్యరచయిత పురస్కారం (1994)[3]
- 3. జ్యేష్ఠ లిటరరీ ఎవార్డ్ ( 1998)
- 4. కొలసాని చక్రపాణి ఎవార్డ్ (1999)
- 5. ఢిల్లీ తెలుగు ఎకాడమీ ఉగాది పురస్కారం (2000)
- 6. ఆంధ్రప్రభుత్వం తెలుగు వైభవం పురస్కారం (2004)
ప్రచురించిన కొన్ని పుస్తకాలు
[మార్చు]- 1. మనం మనుష్యులం
- 2. సహజీవన సౌభాగ్యం
- 3. ఇంకానా అంతరాలు?
- 4. అడుగో మావయ్య, ఆ వెనకే మేరీ
- 5. సంపెంగలూ, సన్ంజాజులూ
- 6. మేం చేసిన తప్పు మీరూ చేస్తారా?
- 7. అది ప్రశ్న, ఇది జవాబు
- 8. హెడ్మిస్ట్రెస్ హేమలత
- 9. పేకముక్కలు
- 10. కథావాహిన - 6
- 11. గణిత విశారద[4]
- 12. కేటూ, డూప్లికేటూ
- 13. అర్ధమున్న కథలు
- 14. రామచిలుక
- 15. మోహనరాగం
- 16. మేథమేట్రిక్స్-1
- 17. మేథమేట్రిక్స్-2
- 18. మేథమేట్రిక్స్-3
- 19. అంగ్రేజీ మేడీజీ
- 20-25. కథల సంపుటాలు
సమకాలీన రచయితలు
[మార్చు]ఈయన సమకాలీయులు, తునిలో పెరిగిన తెలుగు రచయితలు మరి కొందరు
మూలాలు
[మార్చు]- ↑ "హెచ్.ఎం.టి.వి. లో కథనం". Archived from the original on 2013-04-30. Retrieved 2013-05-04.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-06. Retrieved 2013-05-04.
- ↑ "Avasarala Ramakrishna Rao - Telugu Author and Writer - SuKatha".[permanent dead link]
- ↑ https://www.sukatha.com/seriesList/series?a=aramakrishna&e=1&n=ganithavisarada&t=1518664033000[permanent dead link]