Jump to content

అశోక్ కుమార్ యాదవ్

వికీపీడియా నుండి
అశోక్ కుమార్ యాదవ్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 మే2019
ముందు హుక్మ్‌దేవ్ నారాయణ్ యాదవ్
నియోజకవర్గం మధుబని

వ్యక్తిగత వివరాలు

జననం (1970-06-21) 1970 జూన్ 21 (వయసు 54)
బిజు, దర్భంగా, బీహార్, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు హుకుందేవ్ నారాయణ్ యాదవ్, ఆశాదేవి
జీవిత భాగస్వామి సీతా దేవి
సంతానం 3
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

అశోక్ కుమార్ యాదవ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మధుబని లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

అశోక్ కుమార్ యాదవ్ తన తండ్రి హుకుమ్‌దేవ్ నారాయణ్ యాదవ్ రాజకీయ వారసత్వంగా రాజకీయాలలోకి వచ్చి 2005లో జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికలలో కెయోటి నియోజకవర్గం నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 2005 అక్టోబర్‌లో జరిగిన ఎన్నికలలో రెండోసారి, తిరిగి 2010లో బీహార్ శాసనసభ ఎన్నికలలో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యే ఎన్నికయ్యాడు.

అశోక్ కుమార్ యాదవ్ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మధుబని లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆర్జేసీ అభ్యర్థి అబ్దుల్ బారీ సిద్ధిఖీపై 20,535 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో ఇతర వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ సభ్యుడిగా, మానవ వనరుల అభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, అధికార భాషలపై పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా, టేబుల్‌పై వేసిన పేపర్లపై కమిటీ సభ్యుడిగా, సెంట్రల్ సిల్క్ బోర్డు సభ్యుడిగా, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడిగా, విద్య, మహిళలు, పిల్లలు, యువత & క్రీడల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, బొగ్గు, గనులు & ఉక్కుపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.

అశోక్ కుమార్ యాదవ్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మధుబని లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీయూ అభ్యర్థి మహ్మద్ అలీ అష్రఫ్ ఫాతిమీపై 1,51,945 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. TV9 Bharatvarsh (7 June 2024). "मधुबनी लोकसभा सीट से जीतने वाले बीजेपी के अशोक कुमार यादव कौन हैं, जानिए अपने सांसद को". Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Madhubani". Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024.