అశోక్ మెహతా (ఛాయాగ్రాహకుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అశోక్ మెహతా
Ashok Mehta 2013 stamp of India.jpg
జననం1947
మరణం2012 ఆగస్టు 15 (వయస్సు 64)
వృత్తిఛాయాగ్రహకుడు, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ
క్రియాశీల సంవత్సరాలు1978-2011
సుపరిచితుడుజాతీయ చలనచిత్ర పురస్కారాలు పొందిన ఛాయాగ్రాహకుడు

అశోక్ మెహతా (1947-ఆగస్టు 15, 2012) సుప్రసిద్ధుడైన భారతీయ సినిమా ఛాయాగ్రాహకుడు. అతను జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ ఛాయాగ్రహణం పురస్కారాన్ని అందుకున్నాడు. బాండిట్ క్వీన్, ఉత్సవ్, మండీ, త్రికాల్, రామ్ లఖన్, 36 చౌరంగీ లేన్, గజగామిని వంటి సినిమాల్లో అతని ఛాయాగ్రహణానికి ప్రసిద్ధి చెందాడు. శేఖర్ కపూర్, అపర్ణా సేన్, శశి కపూర్, శ్యాం బెనగళ్, సుభాష్ ఘాయ్ వంటి ప్రతిభావంతులైన దర్శకులు [1]

తొలినాళ్ళు[మార్చు]

అశోక్ 14 సంవత్సరాల వయసులో ఢిల్లీలోని తమ కుటుంబం నుంచి పారిపోయాడు. అలా పారిపోయి బొంబాయి నగరం చేరుకుని పొట్టకూటి కోసం కోడిగుడ్లు అమ్మే చిరువ్యాపారికి సహాయకునిగా చేరాడు. ఆ వ్యాపారి వద్ద కోడిగుడ్లను అమ్మే పనిచేసేవాడు. అతను తర్వాతికాలంలో కోసిన పుచ్చకాయ ముక్కలు అమ్ముకుంటూ జీవితాన్ని గడిపాడు. అలా కొన్నేళ్ళపాటు చిన్న చిన్న పనులు జీవితాన్ని గడిపేందుకు చేసాడు

చలనచిత్ర జీవిత గమనం[మార్చు]

పుచ్చకాయ ముక్కలు అమ్ముకుంటున్న స్థితిలో ఓసారి సెలవురోజున దాద్రాలో జరిగిన సినిమా చిత్రీకరణ చూసి సినిమా తీసే పద్ధతి వైపు ఆకర్షితుడయ్యాడు. ఆపైన చెంబూర్ లోని ఆశా స్టూడియోలో కేంటీన్ బాయ్ గా పనిచేశాడు. క్రమంగా ఆర్కే స్టూడియోలో ప్రొడక్షన్ బాయ్ గా పనిచేసే అవకాశం పొందాడు. సెట్స్, కెమెరా, లైటింగ్ వంటి సినిమా నిర్మాణ వ్యవహారాలను అర్థం చేసుకునేందుకు సెట్స్ పై ఏ చిన్న పనివారు సెలవు పెట్టినా వారి పని తాను చేస్తూ వాటిపై అవగాహన ఏర్పరుచుకోవడం ప్రారంభించాడు.

ఛాయాగ్రహణం[మార్చు]

తర్వాతి అడుగుగా అతను కెమెరా అటెండెంట్ గా పనిచేసి ఛాయాగ్రహణం గురించి, కెమెరా సాంకేతికత గురించి తెలుసుకున్నాడు. శ్రీకృష్ణా స్టూడియోలో కెమెరా అసిస్టెంట్ గా పనిచేయడం ప్రారంభించి, క్రమంగా ఛాయాగ్రాహకుడు అయ్యాడు. రాజ్ మార్బ్రో తీసిన ద విట్ నెస్ సినిమా అతని కెరీర్ లో మలుపుగా నిలిచింది. ఆ సినిమా ఆర్థికంగా విజయవంతం కాకపోయినా, అప్పటి సుప్రఖ్యాత హీరో శశికపూర్ దృష్టిలో పడేట్టు చేసింది.

మూలాలు[మార్చు]

  1. శిద్దారెడ్డి, వెంకట్. "సినిమాటోగ్రాఫర్ అశోక్ మెహతా-నివాళి". నవతరంగం. Archived from the original on 22 ఫిబ్రవరి 2016. Retrieved 25 April 2016. Check date values in: |archive-date= (help)

ఇతర లింకులు[మార్చు]