Jump to content

అహోబలపండితీయము

వికీపీడియా నుండి
లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, బెజ్జంకి, తెలంగాణ - ప్రతీకాత్మక చిత్రం

అహోబలపండితీయము, ఈ గ్రంథాన్ని రాసినకవి గాలి ఓబళయ్య.ఇతను గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా సంతరాపూరు వాస్తవ్యుడును, ఆగ్రామ కరణములలోవడునై ఉండెను. చిన్నతనమున విద్యావాసనలేక హాలిక వృత్తి (పొలము దున్నువాడు) నుండెను. నియోగి బ్రాహ్మణుడు. భరద్వాజ గోత్రుడు. తండ్రి నరసిమ్హయ్య, తల్లి లక్ష్మీదేవమ్మ. తన ఇంటిపేరు ప్రభంజనవంశ మని అహోబలపండితీయమున ఈతడు వ్రాసుకొనెను. తనతండ్రి మొదలగు కరణములు గ్రామముపై వసూలయిన సర్కారుసొమ్మును హరించి జమీందారుల ఒత్తిడికి పరారుకాగా రాజభటులు ఈతనిని పట్టుకుపోయి ప్రభువు ఆజ్ఞమేరకు కారాగృహమున పెట్టిరి. ఈతడు చదువరి కాకపోయినను పాటలు శ్రావ్యముగా పాడగలవాడైయుండెను. కారాగృహమున ఒకనాడు పాడుచుండగా ప్రభువు మొదలగువారు విని అతనిని పిలిపించి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకొనగా, తనను విడిపించినంచో తన మేనమామాగు పోలూరి మాధవసోమయాజులు గారియొద్దకు బోయెదననియు మనవిచేసి వేడికొనెను. మాధవసోమయాజులు గారు జగద్విదుతులు అగుటచే ప్రభువువిని సంతసించి అతనిని విడిపించెను. అంతనాతడు తనతల్లితోగూడ వినుకొండ తాలూకా గోకనకొండ (గోకర్ఞగిరి) గ్రామమునకు మేనమామ ఇంటికి చేరెను. మామగారింట స్త్రీలతోసహా అందరూ సహజ విద్వాంసులగుటచే వారందరు ఈతనితో పరిహాసమాడుటచే, రోషపడి ఇంటినుండి దేశాటనకేగుదనని మామంగారికి చెప్పగా వారు వలదని వారించి "నీకొక మంత్రము చెప్పెదను" దానిని జపించుకొను. మని నృసింహ మంత్రమునుపదేశించెను. అంతట నీతడచటగల ఒక కొండ గుహయందు చేరి తపము సేయగా స్వామియొక్క మనుజాకృతిని వచ్చి యేమో నాలుకపై రాసి ఇంటికి బోదమురమ్మని ఒకరాత్రికి ఆతనిని తీసుకువచ్చి, ఇంటివారు తలుపు తీయగా ఆతడు అదృశ్యమాయెను. ఓబళయ్య నాటినుంచి కుశాగ్రబుద్ధికలిగి మామగారి వద్ద విద్యనభ్యసించి పండితుడై నవద్వీపము మొదలగు చోట్ల మిక్కిలి విద్యాభ్యాసము చేసెను. మేనమామనే తనగురువని అహోబలపండితీయములో పేర్కొనెను. శ్రీరామ భక్తుడై "అహోబలపండితీయము" , ' "కవిశిరోభూషణము" అనుపేర నన్నయ భట్టీయం నకు వ్యాఖ్యానం "అభినవ నన్నయసూరి" అని బిరిదుగాంచెను. పిదప ' "కాళిందీపరిణయము" అను ఆరూశ్వాసముల పద్యకావ్యమును వ్రాసెను. ఇది ఆంధ్రసాహిత్యపరిషత్ పత్రికయందు ప్రకటింపబడింది. కాని గ్రంథ అన్యగతహస్తమై గ్రంథపాతమేరపడి మొదటి భాగము పెల్లగింపబడి మగుటంచేసి పీఠిక వృత్తాంతములు తెలియకున్నవి. ' "కాళిందీపరిణయము" మొకటి పద్యకావ్యము 1895 సం. శ్రీ రా.బ.పనప్పాకం అనంతాచార్యులు గారి వలన వైజయంతీ పత్రిక యందు ప్రచురితమయినది.

ఈ కవి తరువాత రాజాశ్రయమున మైదవోలు, నారాయణపురం అను అగ్రహారములు సంపాదించినట్లు తెలియుచున్నది. ఇందు నారాయణపురము వినుకొండ తాలూకా గోకనకొండ సమీపమున గుండ్లకమ్మ ఒడ్డుననుండి ఏటిపోటునకు కొట్టుకుపోయినట్లు చెప్పెదరు. ఈరెండు గ్రామములగూర్చి ఈ కవి తన కావ్యములలో ఉదహరించెను. ఈతడు గోకనకొండ కొండగుహయందు తాను తపస్సు చేసినచోట నృసింహాలయము కట్టించి ప్రతిష్ఠించెను. ఇది ఇప్పటికి ఉంది.

కాలం

[మార్చు]

ఈ కవి కాలమును నిర్ణయించుటకు సరైన ఆధారములు లభించలేదు. కాని ఈతని కుమారుడు రామభద్రప్పశాస్త్రులు శా.శ 1670 శుక్లనామ సం. శ్రావణ శు. 15లున శ్రీ రాజా మల్రాజు రామారాయుణుడు గారి వలన వినుకొండ తాలూక ముమ్మడివరము అగ్రహారమును పొందెను. ఇందును బట్టి అహోబిలపండితుడు రమారమి 300 క్రిందటి వాడయి ఉండవచ్చును. ఈ కవి వంశస్థులు ఇప్పటికిని ముమ్మడివరము అగ్రహారమందునారు. ఈ వంశమువారు ముమ్మడివరము, నర్సరావుపేట తాలూక కొణిదెనమజరా మర్లాయపాలెము సంతరావూరు గ్రామమందుకలరు.

వంశవృక్షం

[మార్చు]

అహోబలపండితుడు-రామభద్రప్పశాస్త్రి-రామచంద్రశాస్త్రి-నరసింహశాస్త్రి-చినపిచ్చయ్యశాస్త్రి -సుబ్రహ్మణ్యం -సాంబయ్య.