ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం
ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం భారత ప్రభుత్వం దేశంలోని 718 జిల్లాలలో వెనుకబడ్డ 112 జిల్లాలలో నిర్వహించే అభివృద్ధి కార్యక్రమం. దీన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ వివిధ మద్దతుదారుల సహాయంతో చేపడుతుంది.[1][2]
స్థాపన
[మార్చు]ఈ కార్యక్రమాన్ని 2018 జనవరి నెలలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించాడు. ఈ కార్యక్రమాన్ని ఆయా జిల్లాల పరిపాలన అధికారులు నీతి ఆయోగ్ సమన్వయ సంస్థలతో కలిసి చేపడుతున్నారు.
ఆకాంక్ష జిల్లాల జాబితా
[మార్చు]ఆకాంక్ష జిల్లాల కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని 112 జిల్లాలను ఆకాంక్ష జిల్లాలుగా గుర్తించింది. వీటిలో తెలంగాణాలో మూడు, ఆంధ్రప్రదేశ్లో మూడు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఆకాంక్ష జిల్లాలు:
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా
- కొమరంభీం జిల్లా
- విజయనగరం జిల్లా
- విశాఖపట్నం జిల్లా
- వైఎస్‌ఆర్ జిల్లా
ముఖ్య విభాగాలు
[మార్చు]- వైద్యం, పౌష్టికాహారం
- విద్య
- సేద్యం, జల వనరులు
- ఆర్థిక, నైపుణ్యాభివృద్ధి
- మౌలిక సదుపాయాలు
మార్పు విజేతలు
[మార్చు]2018 ఏప్రిల్ నెలలో నీతి ఆయోగ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఆకాంక్ష జిల్లాలలో జరిగే మార్పుల నివేదికలు నిర్వహించటానికి ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ పోర్టల్ను ప్రారంభించింది. పైన సూచించిన అయిదు విభాగాలలో అభివృద్ధి పరంగా జిల్లాలకు డెల్టా ర్యాకింగును కేటాయిస్తుంది. ఈ ర్యాకింగును ప్రతి నెల కేటాయిస్తారు, దీనికి సంబంధించిన జాలస్థలి ప్రజలందరికి అందుబాటులో ఉంటుంది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "India's aspirational districts programme resulted in sectoral growth: UNDP report". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-06-11. Retrieved 2021-06-27.
- ↑ "About the Aspirational Districts Programme | NITI Aayog". niti.gov.in. Retrieved 2021-06-29.
- ↑ "UN body lauds success of Centre's Aspirational Districts Programme". The Indian Express (in ఇంగ్లీష్). 2021-06-12. Retrieved 2021-06-27.