ఆకారపు సుదర్శన్
ఆకారపు సుదర్శన్ | |||
మాజీ శాసన సభ్యుడు
| |||
పదవీ కాలం 1989 - 1999 | |||
నియోజకవర్గం | సూర్యాపేట | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బండరామారం, తుంగతుర్తి మండలం,సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం, | 1954 మార్చి 5||
మరణం | 2011 జూలై 20 | (వయసు 57)||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
సంతానం | ఆకారపు రమేశ్ | ||
నివాసం | సూర్యాపేట |
సుదర్శన్ ఆకారపు, (5 మార్చి 1954 – 20 జూలై 2011)[1] భారతదేశ రాజకీయనాయకుడు. అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు. భారత పార్లమెంటులో రాజ్యసభ సభ్యునిగా పనిచేసాడు. అతని తెలుగుదేశంపార్టీ వైస్ ప్రెసిడెంటుగానూ, శాసన సభ్యులు గానూ తన సేవలనందించాడు.[2] గుండెపోటుతో జూలై 20, 2011 న హైదరాబాదులో మరణించాడు.[3]
ప్రారంభ జీవితం
[మార్చు]సుదర్శన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు చెందిన సూర్యాపేట లో జన్మించాడు. అతనికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు.
రాజకీయ జీవితం
[మార్చు]ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యునిగా రెండు సార్లు ఎన్నికైనాడు. సూర్యాపేట అసెంబ్లీ నియోజక వర్గం నుండి ప్రాతినిధ్యం వహించాడు. 1989, 1994 లలో ఎం.ఎల్.ఎ గా తన సేవలనందించాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చైర్మన్ గా 1997 నుండి 1999 మధ్య కాలంలొ పనిచేసాడు. 2002 నుండి 2008 వరకు రాజ్య సభ సభ్యునిగా తన సేవలనందించాడు. రాజ్యసభ్య సభ్యునిగా తన ఆరేళ్ళ పదవీ కాలంలొ అనేక స్టాండింగ్ కమిటీలలో సభ్యునిగా కొనసాగాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ TDP Leader Sudarshan dies of cardiac arrest Archived 2016-03-04 at the Wayback Machine Indian Express 21 July 2011.
- ↑ "Profile on Rajya Sabha website". Archived from the original on 2007-09-30. Retrieved 2016-11-18.
- ↑ Former TDP MP dead The Hindu 21 July 2011
- ↑ TDP leader Sudarshan Akarapu passes away DNA India 20 July 2011