ఆకిబ్ జావేద్
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పుట్టిన తేదీ | 1972 ఆగస్టు 5 షేక్‌పురా, పంజాబ్, పాకిస్తాన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| మారుపేరు | ఆకిబ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ఎత్తు | 6 ft (183 cm) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | కుడిచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి టెస్టు (క్యాప్ 109) | 1989 ఫిబ్రవరి 10 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి టెస్టు | 1998 నవంబరు 27 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి వన్‌డే (క్యాప్ 67) | 1988 డిసెంబరు 10 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి వన్‌డే | 1998 నవంబరు 24 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 1984/85–1986/87 | లాహోర్ డివిజను | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 1989/90–1991/92 | పాక్ ఆటోమొబైల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 1991 | హాంప్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 1993/94–1996/97 | ఇస్లామాబాదు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 1994/95–2002/03 | అల్లైడ్ బ్యాంక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2000/01 | షేఖ్‌పురా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ప్రధాన కోచ్‌గా | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Years | జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2012–2016 | United Arab Emirates | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2010 మే 9 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఆకిబ్ జావేద్ (జననం 1972, ఆగస్టు 5) పాకిస్తాన్ క్రికెట్ కోచ్, మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం కలిగిన ఫాస్ట్-మీడియం పేస్ బౌలర్ గా రాణించాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. 1988 - 1998 మధ్యకాలంలో పాకిస్తాన్ తరపున 22 టెస్టులు, 163 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[1][2] 1992 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన పాకిస్తాన్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.[3]
ప్రస్తుతం క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా, పాకిస్తాన్ సూపర్ లీగ్ జట్టు లాహోర్ ఖలాండర్స్‌కు ప్రధాన కోచ్‌గా పనిచేస్తున్నాడు.[4]
అంతర్జాతీయ కెరీర్
[మార్చు]అంతర్జాతీయ మ్యాచ్‌లలో భారత్‌పైనే అత్యుత్తమ ఆటతీరు కనబరచాడు. తన కెరీర్ వన్డే సగటు కంటే 24.64 - 6.79 పరుగుల సగటుతో భారత్ జరిగిన తన 39 వన్డేలలో 54 వికెట్లు తీశాడు. ఆరు వన్డే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులలో భారతదేశంపైనే నాలుగు అవార్డులు ఉన్నాయి.
1991 అక్టోబరు 25న 19 ఏళ్ళ 81 రోజుల వయస్సులో భారత్‌తో జరిగిన వన్డేలో హ్యాట్రిక్ సాధించాడు. వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. 1992 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన పాకిస్తాన్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఆకిబ్ జావేద్ అంతర్జాతీయ క్రికెట్ Archived 2023-09-27 at the Wayback Machine కెరీర్ 26 ఏళ్ళ వయసులో అకాల ముగింపుకు చేరుకుంది.
కోచింగ్ కెరీర్
[మార్చు]గతంలో లాహోర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీకి చీఫ్ కోచ్‌గా ఉన్నాడు.[5] పాకిస్తాన్ కంప్యూటర్ హార్డ్‌వేర్ కంపెనీ అయిన ది కంప్యూటర్ హౌస్‌తో కూడా అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. 2004 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ అండర్-19 జట్టుకు శిక్షణ ఇచ్చాడు.[6] గతంలో, ఆఫ్ఘనిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు అభివృద్ధికి కూడా సహాయం చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా కూడా పనిచేశాడు. వకార్ యూనిస్‌తో ప్రధాన కోచ్, ఇంతిఖాబ్ ఆలం మేనేజర్, కానీ 2012 ఫిబ్రవరి 10న పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ క్రికెట్ జట్టుకు బౌలింగ్, ప్రధాన కోచ్‌గా మారాడు, ఈ పదవిలో 2016 వరకు కొనసాగాడు.
2016 నుండి, పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ క్వాలండర్స్‌కు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్, బౌలింగ్ కన్సల్టెంట్‌గా ఉన్నారు. 2017 డిసెంబరులో, జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు.[7][8]
మూలాలు
[మార్చు]- ↑ "Aaqib Javed profile and biography, stats, records, averages, photos and videos" (in ఇంగ్లీష్). ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-02-02.
- ↑ "Pakistan Cricket – 'our cricket' website". pcboard.com.pk. the original నుండి 2022-02-02 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-02-02.
- ↑ "Pakistan cricket stars recall 1992 World Cup glory". Daily Times (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-03-26. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-02-02.
- ↑ "Team – Lahore Qalandars" (in అమెరికన్ ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-02-02.[permanent dead link]
- ↑ "Aaqib Javed steps down as UAE coach" (in ఇంగ్లీష్). ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-02-02.
- ↑ "The Daily Star Web Edition Vol. 4 Num 274". archive.thedailystar.net. the original నుండి 2022-02-02 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-02-02.
- ↑ "Aqib Javed appointed head coach, Fakhar Zaman vice captain of Lahore Qalandars". geo.tv (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-02-02.
- ↑ "Lahore Qalandar appoints Aqib Javed as head coach". The Frontier Post (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-12-27. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-02-02.