ఆకుల లలిత
ఆకుల లలిత | |||
తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 24 డిసెంబర్ 2021 - ప్రస్తుతం | |||
ముందు | గుండు సుధారాణి | ||
---|---|---|---|
ఎమ్మెల్సీ
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 4 జూన్ 2015 - 3 జూన్ 2021 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 8 డిసెంబరు 1965 మాణిక్ భండార్ గ్రామం, మాక్లూర్ మండలం, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | హన్మంతు, సుగుణ | ||
జీవిత భాగస్వామి | రాఘవేందర్ | ||
బంధువులు | నేతి విద్యాసాగర్ (వియ్యంకుడు) | ||
నివాసం | హైదరాబాద్ |
ఆకుల లలిత తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచింది. ఆకుల లలిత 2015లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే కోటా నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయింది.[1] ఆకుల లలిత 2021 డిసెంబరు 17న తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితురాలై, [2] 2021 డిసెంబరు 24న చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టింది.
జననం, విద్యాభాస్యం
[మార్చు]ఆకుల లలిత 1965 డిసెంబరు 08లో తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, మాక్లూర్ మండలం, మాణిక్ భండార్ గ్రామంలో హన్మంతు, సుగుణ దంపతులకు జన్మించింది. ఆమె ఉస్మానియా యూనివర్సిటీ నుండి బిఎ పూర్తి చేసింది.
రాజకీయ జీవితం
[మార్చు]ఆకుల లలిత కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2001లో జరిగిన ఎన్నికల్లో ఎంపీటిసిగా గెలిచి 2003లో ఎంపీపీగా ఎన్నికయింది. ఆమె కాంగ్రెస్ పార్టీలో జాతీయ మహిళా కాంగ్రెస్ కార్యదర్శిగా, పీసీసీ సభ్యురాలిగా, నిజామాబాదు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా (2005 నుండి 2013) వరకు ఎనిమిది సంవత్సరాలు పనిచేసి, నిజామాబాదు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా, ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వివిధ హోదాల్లో పనిచేసింది. ఆమె 2005లో జెడ్పిటిసిగా పనిచేసింది. ఆకుల లలిత 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో డిచ్‌పల్లి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచింది.[3]
ఆకుల లలిత 2015లో జరిగిన తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే కోటా నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయింది. ఆమె ఎమ్మెల్సీగా 2015 జూన్ 4 - 2021 జూన్ 3వరకు పనిచేసింది.[4] ఆకుల లలిత 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యింది.[5] ఆమె 2018లో కాంగ్రెస్ పార్టీ నుండి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరింది.[6][7] ఆమె 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యురాలిగా ఉంది.[8]
ఆకుల లలిత 2021 డిసెంబరు 17న తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితురాలై, [9][10] 2021 డిసెంబరు 24న చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టింది.[11] 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించిన ఆమె టికెట్ దక్కకపోవడంతో అక్టోబరు 16న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసింది.[12][13] ఆకుల లలిత 2023 అక్టోబరు 27న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[14][15]
మూలాలు
[మార్చు]- ↑ Deccan Chronicle (21 May 2015). "Congress selects Akula Lalitha for MLC election". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 25 June 2021. Retrieved 25 June 2021.
- ↑ Sakshi (17 December 2021). "పలు కార్పొరేషన్‌లకు కొత్త చైర్మన్‌లను నియమించిన కేసీఆర్". Archived from the original on 30 డిసెంబరు 2021. Retrieved 30 December 2021.
- ↑ The Hindu (20 December 2018). "Congress MLCs meets KCR". The Hindu (in Indian English). Archived from the original on 25 June 2021. Retrieved 25 June 2021.
- ↑ Nava Telangana (3 June 2021). "ముగిసిన ఎమ్మెల్సీ ఆకుల లలిత పదవీకాలం". NavaTelangana. Archived from the original on 25 June 2021. Retrieved 25 June 2021.
- ↑ The Hans India (17 November 2018). "Congress candidate Akula Lalitha files nomination". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 25 June 2021. Retrieved 25 June 2021.
- ↑ Sakshi (22 December 2018). "కౌన్సిల్ గులాబీమయం.. కాంగ్రెస్ ఖాళీ!". Sakshi. Archived from the original on 25 June 2021. Retrieved 25 June 2021.
- ↑ Sakshi (1 November 2020). "ఆకుల లలితకు మళ్లీ అవకాశం దక్కేనా..!". Sakshi. Archived from the original on 25 June 2021. Retrieved 25 June 2021.
- ↑ Sakshi (22 September 2019). "తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ". Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
- ↑ Namasthe Telangana (17 December 2021). "పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన సీఎం కేసీఆర్". Archived from the original on 17 December 2021. Retrieved 17 December 2021.
- ↑ Eenadu (17 December 2021). "పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లను ఖరారు చేసిన కేసీఆర్". Archived from the original on 17 December 2021. Retrieved 17 December 2021.
- ↑ Namasthe Telangana (24 December 2021). "బాధ్యతలు స్వీకరించిన ఆకుల లలిత..అభినందించిన ఎమ్మెల్సీ కవిత". Archived from the original on 24 December 2021. Retrieved 24 December 2021.
- ↑ NTV Telugu (17 October 2023). "బీఆర్‌ఎస్‌కు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత రాజీనామా.. సీఎంకు లేఖ..!". Archived from the original on 17 October 2023. Retrieved 17 October 2023.
- ↑ TV9 Telugu (17 October 2023). "బీఆర్ఎస్ కు మహిళార్థికాభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ రాజీనామా". Archived from the original on 17 October 2023. Retrieved 17 October 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Prabha News (27 October 2023). "కాంగ్రెస్ లో చేరిన మోత్కుపల్లి నర్సింహులు". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
- ↑ Sakshi (27 October 2023). "తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ చేరికలు". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.