Coordinates: 18°33′08″N 73°54′05″E / 18.5523°N 73.9015°E / 18.5523; 73.9015

ఆగా ఖాన్ ప్యాలస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆగా ఖాన్ ప్యాలస్
ప్రదేశంపూణే, భారతదేశం
అక్షాంశ,రేఖాంశాలు18°33′08″N 73°54′05″E / 18.5523°N 73.9015°E / 18.5523; 73.9015
విస్తీర్ణం19 acres (77,000 m2)
నిర్మించినది1892
పరిపాలన సంస్థగాంధీ నేషనల్ మెమోరియల్ సొసైటీ
రకంచారిత్రిక గుర్తింపు
నియమించబడినది2003
Designated byఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
ఆగా ఖాన్ ప్యాలస్ is located in Maharashtra
ఆగా ఖాన్ ప్యాలస్
మహరాష్ట్ర లోని ఆగా ఖాన్ ప్యాలస్ ప్రదేశం

అగా ఖాన్ ప్యాలెస్‌ను భారతదేశంలోని పూణేలో సుల్తాన్ ముహమ్మద్ షా అగా ఖాన్ III నిర్మించారు. అతను నిజామి ఇస్మాలీ మతానికి చెందిన 48వ ఇమాం. పూణే కు సమీప ప్రాంతాలలో కరువుతో తీవ్రంగా దెబ్బతిన్న పేదలకు సహాయం చేయాలనుకుని నిజారి ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక నాయకుడిగా అతను స్వచ్ఛంద చట్టంతో ఈ ప్యాలస్ నిర్మించారు. [1]

అగా ఖాన్ ప్యాలెస్ ఒక రాజయోగ్యమైన భవనం. ఈ ప్యాలెస్ భారత స్వాతంత్ర్య ఉద్యమంతో దగ్గరి సంబంధం కలిగి ఉంది. ఎందుకంటే ఇది మహాత్మా గాంధీ, అతని భార్య కస్తూర్బా గాంధీ, అతని కార్యదర్శి మహాదేవ్ దేశాయ్, సరోజిని నాయుడులకు స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో బ్రిటిష్ వారు జైలుశిక్ష విధించేందుకు ఉపయోగపడింది. ఈ ప్యాలస్ లోనే మహదేవ్ దేశాయ్, కస్తూర్బా గాంధీలు మరణించారు.[2] ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఈ స్థలాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా 2003 లో ప్రకటించింది. [3] ఈ ప్యాలస్ కు గల ప్రత్యేక నిర్మాణం, పరిసరాలు పచ్చదనం, ఫోటోగ్రఫీ కోసం పరిపూర్ణ కాంతి ఉండడం వలన దీనిని వివిధ రకాల ఫోటో షూటింగుల కోసం ఫోటోగ్రాఫర్ల ఇక్కడికి వస్తారు. ఇది ఫోటోగ్రఫీకి ప్రధాన ఆకర్షణ అయిన ప్రదేశం. కానీ ఫోటోగ్రఫీ వాణిజ్యపరమైనదైనందున, పర్యాటకులకు, సందర్శకులకు విసుగు కలిగిస్తున్నందున ఈ ప్రాంగణంలో ఫోటోగ్రఫీని అనుమతించడాన్ని నిర్వాహకులు ఆపివేసారు. అగా ఖాన్ ప్యాలెస్ పరిధిలో మొబైల్ ఫోటోగ్రఫీ కూడా నిషేధించబడింది.

చరిత్ర[మార్చు]

ఈ ప్యాలస్ చారిత్రికంగ విశేష ప్రాముఖ్యతను సంతరించుకుంది. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించిన తరువాత మహాత్మా గాంధీ, అతని భార్య కస్తూర్బా గాంధీ. అతని కార్యదర్శి మహాదేవ్ దేశాయ్ 1942 ఆగస్టు 9 నుండి 1944 మే 6 వరకు ప్యాలెస్‌లో ఉంచబడ్డారు. కస్తూర్బా గాంధీ, మహాదేవ్ దేశాయ్ లు ప్యాలెస్ లోని బందిఖానాలో మరణించారు. వారి సమాధులను అక్కడే నిర్మించారు. మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ వారి జ్ఞాపకాలు మూలా నదికి సమీపంలో అదే కాంప్లెక్స్‌లో ఉన్నాయి. [4]

పరిసర ప్రాంతాలలోని కరువుతో బాధపడుతున్న గ్రామస్థులకు ఉద్యోగావకాశాలను కల్పించడానికి సుల్తాన్ ఈ ప్యాలస్ ను నిర్మించినట్లు చారిత్రిక కథనం. అతను సుమారు 1000 మందికి ఉపాధి కల్పించాడు. ఈ ప్యాలస్ ను ఐదు సంవత్సరాలలో నిర్మించారు. దీని నిర్మాణ వ్యయం 12 లక్షలు. మొత్తం 13 ఎకరాల స్థలంలో 7 ఎకరాల విస్తీర్ణంలో ప్యాలస్ ను నిర్మించారు. మిగిలిన స్థలం ఉద్యానవనంగా నిర్వహించబడుతోంది.


ఈ ప్యాలెస్ 1970 ల ప్రారంభం వరకు నేషనల్ మోడల్ స్కూల్‌ను కలిగి ఉంది.

మహాత్మా గాంధీ, అతని వ్యక్తిత్వానికి గౌరవ సూచకంగా 1969 లో అగా ఖాన్ ప్యాలెస్‌ను భారతీయ ప్రజలకు అగా ఖాన్ IV విరాళంగా ఇచ్చాడు. [1] గాంధీజీ మరణానంతరం అతని చితాభస్మాన్ని ఇక్కడ ఉంచడంతో ఈ ప్యాలస్ మహాత్మాగాంధీ స్మారక చిహ్నంగా నిలిచింది. 1974లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఈ ప్యాలస్ ను సందర్శించి దాని నిర్వహణ కోసం ₹ 200,000 (2800 అమెరికన్ డాలర్లు) ప్రతీ సంవత్సరం కేటాయించింది. 1990 ల నాటికి ఈ కేటాయింపు ₹ 1 మిలియన్ (14000 అమెరికన్ డాలర్లు) పెంచబడింది.[5] ఆ తరువాత ఇది భారతదేశం యొక్క జాతీయ స్మారక చిహ్నంగా సరిపోని నిధుల కేటాయింపు కారణంగా చాలా సంవత్సరాలు నిర్లక్ష్యం చేయబడింది. స్మారక చిహ్నం నిర్వహణ దిగజారుతున్న పరిస్థితిని నిరసిస్తూ జూలై 1999 లో పూణే రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన జరిగింది. ప్రస్తుత పరిస్థితి చాలా మెరుగుపడింది. [6]

ప్రాముఖ్యత[మార్చు]

అగా ఖాన్ ప్యాలెస్‌లో ఇటాలియన్ ఆర్చీలు, విశాలమైన పచ్చిక బయళ్ళు ఉన్నాయి. ఈ భవనంలో ఐదు మందిరాలు ఉన్నాయి. ఇది 19 ఎకరాలు (77,000 చ.మీ) విస్తీర్ణం కలిగి అందులో 7 ఎకరాలు (28000 చ.మీ) స్థలంలో ప్యాలస్ ను నిర్మించారు. దాని అద్భుత, సుందరమైన నిర్మాణంతో ఈ ప్యాలస్ ప్రేక్షకులను, సందర్శకులను ఆకర్షిస్తుంది. దీని నిర్మాణానికి 5 సంవత్సరాలు పట్టింది. ఈ ప్యాలస్ నిర్మాణానికి అంచనా బడ్జెట్ ₹ 1.2 మిలియన్.

గ్రౌండ్ ఫ్లోర్ యొక్క వైశాల్యం 1756 మీ 2, మొదటి అంతస్తు వైశాల్యం 1080 మీ 2, రెండవ అంతస్తులో 445 మీ 2 నిర్మాణం ఉంది. ఈ నిర్మాణం యొక్క ప్రత్యేకత మొత్తం భవనం చుట్టూ 2.5 మీటర్ల కారిడార్ ఉండటం. ప్రిన్స్ కరీం అగా ఖాన్ ఈ ప్యాలెస్‌ను 1972 లో గాంధీ స్మారక్ సమితికి విరాళంగా ఇచ్చాడు. అప్పటి నుండి పార్క్స్ అండ్ గార్డెన్స్ సంస్థ దీనిని నిర్వహిస్తోంది.

భారత దేశ జాతిపిత మహాత్మా గాంధీ, భారత స్వాతంత్ర్య పోరాటంలోని ఇతర వ్యక్తుల జీవితం నుండి వచ్చిన సంగ్రహావలోకనాలను చిత్రీకరిస్తూ అనేక చిత్రాలు, పోట్రేయిట్స్ ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి. [7]

గాంధీ నేషనల్ మెమోరియల్ సొసైటీ కి ప్రధాన కార్యస్థానంగా ఈ ప్యాలస్ ఉంది. ఇది ఖాదీ, ఇతర చేతితో తయారుచేసే వస్త్రాలతో కూడిన దుకాణాన్ని కూడా నిర్వహిస్తుంది.[8]

ప్యాలెస్‌లో నిర్వహించిన కార్యక్రమాలు[మార్చు]

గాంధీ మెమోరియల్ సొసైటీ ప్యాలెస్‌లో ఈ క్రింది బహిరంగ కార్యక్రమాలను జరుపుకుంటుంది: ఈ క్రింది దినోత్సవాలను ప్రతీ సంవత్సరం జరుపుకుంటారు.

వార్షిక కార్యక్రమాలు కాకుండా, దశాబ్దాల నుండి ప్రతిరోజూ ఉదయం ప్రార్థన సమావేశాలు సమాధి వద్ద జరుగుతాయి. ఈ ప్రార్థన ప్రతిరోజూ భారీ స్థాయిలో జన సమూహాలను ఆకర్షిస్తుంది. అక్టోబర్ 2 న మహాత్మా గాంధీకి నివాళి అర్పించడానికి ప్రజలు ఈ ప్రదేశాన్ని సందర్శించినప్పుడు ఈ సందర్శకుల సంఖ్య మూడు రెట్లు పెరుగుతుంది. [9]

చిత్రమాలిక[మార్చు]

అగా ఖాన్ ప్యాలెస్ ఎడమ వెనుక వైపు నుండి చూస్తే
Panoramic view Aga Khan Palace
ఆగాఖాన్ ప్యాలస్ పూర్తి చిత్రం

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Suryawanshi, Sudhir (1 February 2012). "State govt to set up special cell to preserve heritage structures". DNA India via HighBeam Research. Archived from the original on 19 October 2017. Retrieved 12 May 2012.
  2. "Respecting our legacy". Deccan Herald. 29 April 2012. Retrieved 10 May 2012.
  3. "On Gandhi Heritage Sites list, Aga Khan Palace, Yerawada jail". The Indian Express. 5 September 2010. Retrieved 10 May 2012.[permanent dead link]
  4. "Aga Khan Palace History". Archived from the original on 4 May 2012. Retrieved 9 May 2012.
  5. Deshmukh, Vinita (16 July 1999). "In Shiv shahi, Aga Khan Palace has no place?". The Indian Express. Pune. Archived from the original on 23 February 2001. Retrieved 10 May 2012.
  6. "Congress flays State Govt for neglect of Aga Khan palace". The Indian Express. Pune. 17 July 1999. Retrieved 10 May 2012.
  7. Times News Network (1 May 2004). "Paint job 'taints' historic photos". The Times of India. Pune. Archived from the original on 8 జూలై 2012. Retrieved 12 May 2012.
  8. "Try these places". India Today. 15 February 2012. Retrieved 22 May 2012.
  9. "Following the Mahatma". The Indian Express. 2 October 2009. Retrieved 10 May 2012.

బాహ్య లింకులు[మార్చు]