ఆగ్రా శిఖరాగ్ర సమావేశం
2001 భారత పాకిస్తాన్‌ల ఆగ్రా శిఖరాగ్ర సమావేశం | |
---|---|
రకం | ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతల స్థాపన కోసం ద్వైపాక్షిక ప్రయత్నాలు |
సందర్భం | ప్రచ్ఛన్న యుద్ధానంతరం |
రాసిన తేదీ | 2001 జూలై 16[1] |
సంతకించిన తేదీ | సంతకాలు కాలేదు; మొత్తం ప్రక్రియ కుప్పకూలింది |
మధ్యవర్తులు | భారత పాకిస్తాన్‌ల విదేశాంగ మత్రిత్వ శాఖలు |
చర్చల్లో పాల్గొన్నవారు |
|
కక్షిదారులు | |
భాషలు |
భారతదేశం, పాకిస్తాన్‌ల మధ్య 2001 జూలై 14 నుండి 16 వరకు జరిగిన చారిత్రాత్మక రెండు రోజుల శిఖరాగ్ర సమావేశమే ఆగ్రా శిఖరాగ్ర సమావేశం. భారత పాకిస్థాన్‌ల మధ్య దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో దీన్ని నిర్వహించారు.[2]
ఈ సమావేశంలో, అణ్వాయుధాలను భారీగా తగ్గించే ప్రతిపాదన పైన, కాశ్మీరు సమస్య, సీమాంతర ఉగ్రవాదానికి సంబంధించిన ఇతర అంశాలపైన చర్చించారు. అయితే, చర్చలు విఫలమై, యావత్తు ప్రక్రియ కుప్పకూలింది. ఒప్పందంపై అసలు సంతకాలే జరగలేదు.[3]
అవలోకనం
[మార్చు]అంతకుముందు, 1999 లో, భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాకిస్థాన్ పర్యటన సందర్భంగా, లాహోర్ ప్రకటనకు ఇరు దేశాలు అంగీకరించి విజయవంతంగా ఆమోదించాయి. దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వాల కోసం ఉమ్మడి ప్రయత్నాలు చేస్తామని ప్రతిజ్ఞ చేశాయి. కార్గిల్ యుద్ధంతో లాహోర్ ఒప్పందానికి పెద్ద దెబ్బ తగిలింది. రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతినడంతో అది ఒప్పందం అమలు నిలిచిపోయింది. కార్గిల్ యుద్ధం వెనుక వ్యూహాత్మక సూత్రధారి, మెదడు జనరల్ ముషారఫేనని విస్తృతంగా భావిస్తారు.
2001 మార్చి 11 న, ఐరాస సెక్రటరీ-జనరల్ కోఫీ అన్నన్ లాహోర్ డిక్లరేషన్ స్ఫూర్తిని నిలుపుకోవాలని భారత పాకిస్తాన్‌లకు పిలుపునిచ్చాడు. దీనికి ఇరువైపుల నుండి సంయమనం, తెలివిడి, నిర్మాణాత్మక చర్యలు అవసరమని చెప్పాడు.[4] చివరగా, 2001 జూలైలో అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్, ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి మధ్య న్యూఢిల్లీలో జరిగిన చర్చల తరువాత ఆగ్రా సమావేశానికి సంబంధించిన చర్చల ఫ్రేమ్‌వర్కు ప్రారంభమైంది[5]
చాలా దౌత్యపరమైన ప్రయత్నాల తర్వాత, ఐదు దశాబ్దాల నాటి కాశ్మీర్ సమస్యతో సహా రెండు దేశాల మధ్య ఉన్న వివిధ వివాదాలను పరిష్కరించాలనే అధిక ఆశల మధ్య ఆగ్రా శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. ఇరుపక్షాలు ఆశాజనకంగా, మంచి సంకల్పంతో శిఖరాగ్ర సమావేశాన్ని ప్రారంభించాయి; ముఖ్యంగా అధ్యక్షుడు ముషారఫ్ శిఖరాగ్ర సమావేశం కోసం తన అభిప్రాయాలను వివరించడానికి "జాగ్రత్తతో కూడిన ఆశాభావం", "వెసులుబాటు", "ఓపెన్ మైండ్" అనే పదబంధాలను ఉపయోగించాడు. భారత రాష్ట్రపతి KR నారాయణన్ కూడా "ధైర్యమైన, వినూత్నమైన" చర్యలు తీసుకుంటామని, రెండు దేశాల మధ్య "ముఖ్యమైన సమస్య" గురించి చర్చిస్తామనీ హామీ ఇచ్చాడు.[5]
అధ్యక్షుడు ముషారఫ్, ప్రధాని వాజ్‌పేయి మధ్య పలు దఫాలుగా ముఖాముఖి చర్చలు జరిగాయి. మొదటి రోజు, 90 నిమిషాల పాటు ఒకరితో ఒకరు చర్చలు జరిపారు. ఇద్దరు నాయకులు కాశ్మీర్ సమస్య, సరిహద్దు ఉగ్రవాదం, అణు ప్రమాదాల తగ్గింపు, యుద్ధ ఖైదీల విడుదల, వాణిజ్య సంబంధాలపై చర్చించారు.[6] ఇరువురు నేతలు చర్చల్లో మునిగిపోవడంతో వారు ఒక అంగీకారానికి వస్తారని, శిఖరాగ్ర సమావేశం ముగిశాక సంయుక్త ప్రకటన గాని, ఒక ఉద్ఘాటన గానీ వెలువడుతుందని పాకిస్థాన్‌లో భారీ ఆశలు నెలకొన్నాయి.[5] భారత ప్రభుత్వం నుండి అభ్యంతరాలు ఉన్నప్పటికీ, అధ్యక్షుడు ముషారఫ్ ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాశ్మీరీ అగ్ర నాయకత్వంతో ముఖాముఖి సమావేశాలు కూడా నిర్వహించాడు.[5]
ఈ భారత-పాక్ సమావేశంలో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి అత్యంత ముఖ్యమైన ఎజెండా కాశ్మీర్ ప్రజల ఆర్థిక మెరుగుదలపై నొక్కిచెప్పడం. దీని కోసం అతను ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్‌తో సంభాషణను ఆహ్వానించాడు.
కోట్:
"కాశ్మీరీ ప్రజల" కోరికలకు అనుగుణంగా పాకిస్తాన్, జమ్మూ కాశ్మీర్‌కు పరిష్కారాన్ని కోరుతోంది. శాంతి, భద్రత, స్వేచ్ఛతో జీవించడం, తద్వారా తాము ఆర్థికంగా పురోగమించగలగడం అనేవి కాశ్మీర్ లోయ, జమ్మూ, లడఖ్, పాక్ ఆక్రమిత కాశ్మీర్, ఉత్తర ప్రాంతాల నుండి వచ్చిన ప్రతి ఒక్క కాశ్మీరీ ప్రాథమిక కోరిక అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కాశ్మీరీలలో చాలా మంది తమ అకాంక్షలను వ్యక్తపరచేందుకు, చట్టబద్ధంగా ఎన్నికైన ప్రతినిధులున్నారు. వారు హింసను విరమించుకున్నంత కాలం వారు ప్రాతినిధ్యం వహిస్తున్న కాశ్మీరీల అభిప్రాయాలన్నింటినీ వినడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ స్ఫూర్తి తోనే ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్సు ప్రతినిధులతో మాట్లాడేందుకు మేం ప్రతిపాదించాం." [7]
కుప్పకూలడం
[మార్చు]అయితే చర్చలు, శాంతి ప్రక్రియలు కుప్పకూలాయి. ఆగ్రా ఒప్పందంపై సంతకాలు జరగలేదు. చర్చలకు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి.[8] భారతీయ పండితుడు గౌరవ్ కంపానీ ప్రకారం, పాకిస్తాన్ హామీలను ముఖ విలువతో అంగీకరించడంలో భారత ప్రభుత్వం విముఖత చూపడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి.[8] మొదటిది, వాజ్‌పేయి ప్రభుత్వం అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ను, అతను ఢిల్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవస్థనూ విశ్వసించలేదు.[8] 1999లో లాహోర్ సమావేశంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిల సంయుక్త శాంతి ప్రయత్నాలను విధ్వంసం చేసింది ముషారఫేనని భారతదేశంలోనే విస్తృతంగా భావించారు.[8] రెండవది, సరిహద్దు చొరబాట్లను అరికట్టడానికి పాకిస్తాన్ చేసిన ప్రతిజ్ఞతో భారతదేశం సంతృప్తి చెందలేదు; మూడవది, భారత ప్రభుత్వం 2002 అక్టోబరులో కాశ్మీర్‌లో ఎన్నికలను నిర్వహించడానికి ప్రణాళికలు వేసింది [8] అదేవిధంగా, కాశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఆపడానికి ముషారఫ్ నిరాకరించడాన్ని కూడా భారత నాయకత్వం పరిగణన లోకి తీసుకుంది. అది కూడా 2001 జూన్‌లో జరిగిన ఆగ్రా సమావేశం విఫలం కావడానికి ఒక కారణం.
చర్చలు విఫలమైనప్పటికీ, జనరల్ పర్వేజ్ ముషారఫ్ వాజ్‌పేయిని కలిసి తమ గతాన్ని మరచిపోబ్వాలని పిలుపునిచ్చాడు.[5] పాకిస్తాన్, భారతదేశం మధ్య సమస్యలు చాలా క్లిష్టమైనవని, హఠాత్తుగా పరిష్కారమయ్యేవి కావని భావించినందున అతను పాకిస్తాన్‌ను సందర్శించాలని భావిస్తూ, భారత ప్రధానిని పాకిస్తాన్ రమ్మని ఆహ్వానించాడు.[5]
2001 ఆగస్టు ఆగ్రా సమావేశం తరువాత, సిమ్లా ఒప్పందాన్ని, లాహోర్ ప్రకటననూ అమలు చేయవలసిన అవసరాన్ని భారతదేశం పునరుద్ఘాటించింది.[9] సిమ్లా ఒప్పందం, లాహోర్ ప్రకటన, సీమాంతర ఉగ్రవాదాన్ని అణచడం వంటి అంశాలకు భారత్ మద్దతు ఇస్తుందని పేర్కొంది.[3]
2015 జూలై 6 న, భారత బాహ్య గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మాజీ చీఫ్ AS దులత్, ఆగ్రా సమావేశం కుప్పకూలడంలో LK అద్వానీ పాత్ర ఉందని వెల్లడించాడు.[10]
మూలాలు
[మార్చు]- ↑ "Agra summit at a glance". BBC News. 17 July 2001. Archived from the original on 3 January 2009. Retrieved 18 October 2012.
- ↑ "Agra summit labours over Kashmir -- Vajpayee, Musharraf yield nothing in verbal match". The Hindu Business Line. 17 July 2001. Retrieved 8 November 2019.
- ↑ 3.0 3.1 NTI. "Lahore Declaration". Lahore Declaration. Retrieved 15 February 2013.
- ↑ NTI. "Lahore Declaration". Lahore Declaration. Retrieved 15 February 2013.NTI.
- ↑ 5.0 5.1 5.2 5.3 5.4 5.5 POP (21 February 2004). "Agra Summit". Story of Pakistan. Story of Pakistan ATeam. Retrieved 15 February 2013.
- ↑ POP (21 February 2004). "Agra Summit". Story of Pakistan. Story of Pakistan ATeam. Retrieved 15 February 2013.POP (21 February 2004).
- ↑ [1]Indo-Pak Summit 2001.
- ↑ 8.0 8.1 8.2 8.3 8.4 Kampani, Gaurav (1 June 2002). "Indo-Pakistani Military Standoff: Why It Isn't Over Yet". Gaurav Kampani Senior Research Associate at Monterey Institute of International Studies. Senior Research Associate at Monterey Institute of International Studies. Retrieved 15 February 2013.
- ↑ NTI. "Lahore Declaration". Lahore Declaration. Retrieved 15 February 2013.NTI.
- ↑ Book Review-AS Dulat’s ‘Kashmir: The Vajpayee Years’