ఆడం స్మిత్

వికీపీడియా నుండి
(ఆడంస్మిత్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పాశ్చాత్య తత్త్వము
18వ శతాబ్దపు తత్త్వశాస్త్రము
(ఆధునిక తత్త్వము)
ఆడం స్మిత్
పేరు: ఆడం స్మిత్
జననం: జూన్ 5[1] 1723 (బాప్తిస్మం)
కిర్కాల్డీ, స్కాట్లాండ్
మరణం: 1790 జూలై 17(1790-07-17) (వయసు 67)
ఎడిన్‌బర్గ్, స్కాట్లాండ్
సిద్ధాంతం / సంప్రదాయం: సాంప్రదాయ ఆర్ధికశాస్త్రము
ముఖ్య వ్యాపకాలు: రాజకీయ తత్త్వము, ethics, అర్ధశాస్త్రము
ప్రముఖ తత్వం: సాంప్రదాయిక ఆర్ధికశాస్త్రము, ఆధునిక స్వేఛ్ఛా విఫణి, శ్రమ విభజన, అదృశ్య హస్తము
ప్రభావితం చేసినవారు: అరిస్టాటిల్, హాబ్స్, లాక్, మాండెవిల్ల్, హచ్చి‌సన్, హ్యూమ్, మాంటెస్క్యూ, కేనే
ప్రభావితమైనవారు: మాల్థస్, రికార్డో, మిల్ల్, కీన్స్, ఫ్రీడ్‌మన్, మార్క్స్, ఏంగెల్స్, అమెరికా స్థాపక పితలు, చోమ్‌స్కీ, అగస్టే కోమ్టే

అర్థశాస్త్ర పితామహుడిగా పేరుగాంచిన ఆడంస్మిత్ (Adam Smith) 1723, జూన్ 16న స్కాట్లాండ్ లోని కిర్‌కాల్డిలో జన్మించాడు. ఇతడు బ్రిటన్ దేశానికి చెందిన తత్వవేత్త, ఆర్థికవేత్త. 1776లో రచించిన వెల్త్ ఆప్ నేషన్స్ గ్రంథం వల్ల ప్రసిద్ధి చెందినాడు. సంప్రదాయ ఆర్థికవేత్త అయిన ఆడం స్మిత్ స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడి దారీ విధానం, లిబర్టిలిజం లపై అనేక రచనలు చేసాడు. అరిస్టాటిల్, హాబ్స్, జాన్ లాక్, ఫ్రాంకోయిస్ కేనే మొదలగు వారి వల్ల ప్రభావితుడైనాడు. స్కాటిష్ తత్వవేత్త డేవిడ్ హ్యూమ్‌తో పరిచయం అతని ఆర్థిక సిద్ధాంతాల అభివృద్ధికి దోహదపడింది. 1776లో హ్యూమ్ మరణించేవరకు వారిమధ్య స్నేహం కొనసాగింది. అర్థశాస్త్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడిన ఆడంస్మిత్ 1790లో మరణించాడు.

బాల్యం

[మార్చు]

ఆడంస్మిత్ స్కాంట్లాండ్ లోని కిర్‌కాల్డిలో 1723 జూన్ 5 న జన్మించాడు. ఇతడి తండ్రి కస్టమ్స్ కంట్రోలర్‌గా పనిచేసేవాడు. ఇతని యొక్క సరైన జన్మతేది విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. స్మిత్ నాలుగేళ్ళ ప్రాయంలో ఉన్నప్పుడు జిప్సీలచే కిడ్నాప్‌కు గురైనాడు. అతని మామ వెంటనే ప్రతిస్పందించి తల్లి వద్దకు చేర్చాడు.

విద్యాభ్యాసం

[మార్చు]

15 సంవత్సరాల వయస్సులో ఆడంస్మిత్ గ్లాస్గో విశ్వవిద్యాలయంలో చేరి నైతిక తత్వశాస్త్రం అభ్యసించాడు. ఇక్కడ ఉన్నప్పుడు స్మిత్ స్వేచ్ఛావాదం, తర్కం ప్రసంగాలలో నైపుణ్యం సంపాదించాడు. 1740లో స్మెల్ ఎగ్జిబిషన్ అవార్డు పొందినాడు. ఆ తర్వాత ఆక్స్‌పర్డ్ లోని బాలియోల్ కళాశాలలో చేరినాడు. కాని బ్రిటన్ విశ్వవిద్యాలయాలు అతనికి నచ్చలేవు. వెల్ట్ ఆప్ నేషన్ ఐదో భాగంలో స్మిత్ ఇదే విషయాన్ని చెబుతూ స్కాట్లాండ్ లో పోలిస్తే ఆక్స్‌పర్డ్, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాలలో శిక్షణ నాణ్యత అంతగా లేదని వివరించాడు.

జీవనం

[మార్చు]

1748లో స్మిత్ ఎడంన్‌బర్గ్ లో ప్రసంగాలు ఇవ్వడం ప్రారంభించాడు. 1750 ప్రాంతంలో ప్రముఖ తత్వవేత్త డేవిడ్ హ్యూమ్ను కలుసుకున్నాడు. అప్పటి నుంచి వారిరువురి మధ్య గాఢస్నేహం కొనసాగింది. ఈ స్నేహం స్మిత్ ఆర్థిక సిద్ధాంతాల అభివృద్ధికి కూడా దోహదపడింది. 1751లో స్మిత్ గ్లాస్గో విశ్వవిద్యాలయంలో తర్క పీఠాన్ని అధిష్టించాడు. 1752లో ఒకప్పుడు అతని గురువైన ప్రాన్సిస్ హచిసన్ అధిష్టించిన నైతిక తర్కశాస్త్రం పీఠాన్ని ఆక్రమించాడు. ఆ స్థానంలో తర్కం నుంచి రాజకీయ అర్థశాస్త్రం వరకు ఉపన్యాసాలను ఇచ్చేవాడు. 1762లో గ్లాస్గో విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఆప్ లా (LL.D) ప్రధానం చేసింది. 1773లో విశ్వవిద్యాలయాన్న్ని వదలి హెన్రీ స్కాట్‌కు ట్యూటర్‌గా పనిచేశాడు.అతని వెంబడి 18 మాసాలు ఫ్రాన్సు, స్విట్జర్లాండ్ బయలుదేరాడు. ఆ సమయంలోనే ఫిజియోక్రటిక్ స్కూల్ కు చెందిన అర్థశాస్త్ర మేధావులను కలిసే అవకాశం లభించింది. ఫ్రాన్సుకు చెందిన ఫ్రాంకోయిస్ కేనే, జాక్వెస్ టర్గెట్ ల ప్రభావం అతనిపై పడింది. స్వస్థలం కిర్‌కాల్డి వచ్చిన పిదప లండన్ రాయల్ సొసైటీలో యొక్క ఫెలోగా ఎన్నికయ్యాడు. 1776లో రచన వెల్త్ ఆప్ ది నేషన్స్ రచించాడు. 1778లో స్మిత్ స్కాట్లాండ్‌లో కస్టమ్స్ కమీషనర్‌గా నియమించబడ్డాడు. 1783లో ఎడింబర్గ్ రాయల్ సొసైటీ సంస్థాపక సభ్యులలో ఒకడిగా అవతరించాడు. 1787 నుంచి 1789 వరకు గ్లాస్గో విశ్వవిద్యాలయపు రెక్టార్‌గా కొనసాగినాడు. 1790, జూలై 17న స్మిత్ మరణించాడు.

వెల్త్ ఆప్ నేషన్స్

[మార్చు]
Inquiry into the nature and causes of the wealth of nations, 1922

వెల్త్ ఆప్ నేషన్స్ ఆడంస్మిత్ యొక్క రచనే కాకుండా అర్థశాస్త్రపు రచనగా కూడా కొనసాగుతుంది. 1776లో రచించిన ఈ గ్రంథం పూర్తి పేరు An Inquiry into the Nature and Causes of the Wealth of Nations. అర్థశాస్త్రానికి సంబంధించి అత్యంత విలువైన అభిప్రాయాలను స్మిత్ ఈ గ్రంథంలో వెలుబుచ్చాడు. దానివలననే స్మిత్‌ అర్థశాస్త్ర పితామహుడిగా పేరుగాంచాడు. ఆడంస్మిత్ తోనే అర్థశాస్త్రం ప్రారంభమైందని చెప్పవచ్చు. అంతకు ముందు అర్థశాస్త్ర భావాలున్ననూ అవి ఒక ప్రత్యేక శాస్త్రంగా కాకుండా తర్కశాస్త్రం, నైతికశాస్త్రం, రాజకీయాలు మొదలగు వాటిలో ఇమిడి ఉండేది. ఒక ప్రత్యేక శాస్త్రంగా అర్థశాస్త్రాన్ని తీర్చిదిద్దిన ఘనత ఆడంస్మిత్‌కే దక్కింది.

స్మిత్ వెల్త్ ఆప్ నేషన్స్‌లో ఫిజియోక్రాట్ ఆర్థికవేత్తల భూమే అన్నింటికి సర్వస్వం అనే భావనను తిప్పికొట్టాడు. స్మిత్ అభిప్రాయంలో భూమితో పాటు శ్రమ కూడా ప్రధానమైనది. శ్రమ విభజన వల్ల ఉత్పత్తి అనూహ్యంగా పెరుగుతుందని ఉదాహరణలతో సహా వర్ణించాడు. స్మిత్ తరువాతి ఆర్థికవేత్తలు కూడా అతని అభిప్రాయాలనే బలపర్చారు. ముఖ్యంగా థామస్ రాబర్ట్ మాల్థస్, డేవిడ్ రికార్డోలు స్మిత్ సిద్ధాంతాలనే మెరుగుపర్చారు. స్మిత్ తర్వాతి ఆర్థికవేత్తలు సంప్రదాయ ఆర్థికవేత్తలుగా పేరు పొందినారు. శ్రామికుల వేతనాలు పెంచితే జనాభా పెరుగుతుందని స్మిత్ వెలుబుచ్చిన అభిప్రాయాలు నేటి పరిస్థితులకు కూడా దర్పణం పడుతుంది. అట్లే ఆడంస్మిత్ తన మహా గ్రంథంలో స్వేచ్ఛా ఆర్థిక విధానాన్ని బలపర్చాడు. ఈ విధానం ఉత్పత్తి పెరుగుదలకు సహకరిస్తుందని దీనికి అదృశ్యహస్తం కారణమని పేర్కొన్నాడు.

రచనలు

[మార్చు]

ఆడంస్మిత్ రచించిన రచనలు :

The Theory of Moral Sentiments (1759)
An Inquiry Into the Nature and Causes of the Wealth of Nations (1776)
Essays on Philosophical Subjects (published posthumously 1795)
Lectures on Jurisprudence (published posthumously 1976)
Lectures on Rhetoric and Belle Lettres

మూలాలు

[మార్చు]
  1. Robert Falkner (1997). "Biography of Smith" (in English). Liberal Democrat History Group. Archived from the original on 2008-06-11. Retrieved 2007-12-31.{{cite web}}: CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు

[మార్చు]