Jump to content

ఆడమ్ బాచెర్

వికీపీడియా నుండి
ఆడమ్ బాచర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఆడమ్ మార్క్ బాచర్
పుట్టిన తేదీ29 October 1973 (1973-10-29) (age 51)
జోహన్నెస్‌బర్గ్, దక్షిణాఫ్రికా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI
మ్యాచ్‌లు 19 13
చేసిన పరుగులు 833 270
బ్యాటింగు సగటు 26.03 20.76
100లు/50లు 0/5 0/1
అత్యధిక స్కోరు 96 56
వేసిన బంతులు 6 108
వికెట్లు 0 3
బౌలింగు సగటు 21.33
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/36
క్యాచ్‌లు/స్టంపింగులు 11/– 4/–
మూలం: ESPNcricinfo, 2006 25 January

ఆడమ్ మార్క్ బాచర్ (జననం 1973, అక్టోబరు 29) దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ ఆటగాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, కుడిచేతి మీడియం-పేస్ బౌలర్ గా రాణించాడు.[1] దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, క్రికెట్ చీఫ్ అలీ బాచర్ మేనల్లుడు.

క్రికెట్ రంగం

[మార్చు]

బచర్ 1995/96లో దక్షిణాఫ్రికా క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. శ్రీలంకలో పర్యటించిన అండర్-24 జట్టులో, మరుసటి సంవత్సరం చివరిలో భారత్‌పై టెస్టు అరంగేట్రం చేశాడు.[2] ఆస్ట్రేలియాలో ఇన్నింగ్స్‌లో 96 పరుగులు చేశాడు. తరువాత ఇంగ్లాండ్, వెస్టిండీస్‌పై పేలవమైన ఫామ్ తర్వాత, ఏడేళ్ళపాటు వన్డే క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. 1996లో భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సచిన్ టెండూల్కర్‌ను ఔట్ చేయడానికి డీప్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఇతను పట్టిన అద్భుతమైన క్యాచ్‌తో బాగా గుర్తుండిపోయాడు.

బాచర్ 2005లో మరోసారి ఇంగ్లీష్ వన్ డే ఇంటర్నేషనల్ కోసం ఎంపికయ్యాడు, కానీ అతను వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఆ తర్వాత తొలగించబడ్డాడు.

మూలాలు

[మార్చు]
  1. "Adam Bacher Profile - Cricket Player South Africa | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-24.
  2. "SA vs IND, India tour of South Africa 1996/97, 1st Test at Durban, December 26 - 28, 1996 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-24.