ఆపరేషన్ మైత్రి
ఆపరేషన్ మైత్రి | |
---|---|
Part of 2015 నేపాల్ భూకంపం | |
సహాయ కార్యక్రమము | మానవతా సాయము |
అందించినవారు | భారత సైనిక దళం, భాతత జాతీయ విపత్తు నిర్వహణ దళం , భారత ప్రభుత్వ మానవ వనరుల శాఖ |
కార్యక్రమ ఉద్దేశ్యము | Undertaking relief and rescue operations in Nepal, Evacuation of Indian and foreign citizens from Nepal. |
తేదీ | 25 ఏప్రిల్ 2015 | - ongoing
నిర్వహించినవారు | భారత సైనిక దళం, భాతత జాతీయ విపత్తు నిర్వహణ దళం |
తుదకు తేలినది | Rescue and relief operations ongoing, more than 2000 Indian citizens evacuated |
ఆపరేషన్ మైత్రి అనునది 2015 లో నేపాల్ లో సంభవించిన భయంకర భూకంపములో సర్వం కోల్పోయిన నేపాల్ దేశానికి సహాయ సహకారాలు అందించుటకు భారత ప్రభుత్వం ప్రారంభించిన చర్య.
నేపధ్యము
[మార్చు]భారీ భూకంపతో కుదేలైన పొరుగు దేశం నేపాల్‌ను ఆదుకోవడానికి ఆపరేషన్ మైత్రి పేరుతో సహాయక కార్యక్రమాలను భారత్ ముమ్మరంగా చేపట్టింది. 2015 ఏప్రిల్ 26 ఆదివారం రెండు డజన్లకు పైగా విమానాలు, చాపర్లను కఠ్మాండుకు పంపింది. వాటితో పాటు సుశిక్షితులైన 1,000 మంది సిబ్బందిని తరలించింది. అక్కడ చిక్కుకున్న పర్యాటకులను రోడ్డు మార్గం ద్వారా త్వరగా తరలించేందుకు అంబులెన్స్‌లు, బస్సులు ఏర్పాటు చేశారు. 2015 ఏప్రిల్ 25 శనివారం నుంచి 1000 మందిని విమానాల ద్వారా తరలించారు.
మొదటి విడత సహాయంగా పది టన్నుల దుప్పట్లు, 50 టన్నుల నీళ్లు, 22 టన్నుల ఆహార పదార్థాలు, 2 టన్నుల మందులు కాఠ్మండుకు పంపడం జరిగింది. ఆర్మీ, సివిల్ డాక్టర్లను, ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్సును తరలించారు. భారత ప్రభుత్వం నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) ద్వారా భారీ ఎత్తున సహాయక వస్తు సామాగ్రిని చేరవేయడమే కాకుండా అక్కడ ప్రమాదంలో ఉన్న 500 మందికి పైగా భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చింది.[1]
మూలాలు
[మార్చు]- ↑ "Nepal earthquake: Operation Maitri reaches relief to epicentre". timesofindia. 28 April 2015. Retrieved 29 April 2015.