Jump to content

ఆరంబల్

అక్షాంశ రేఖాంశాలు: 15°41′17″N 73°42′43″E / 15.688°N 73.712°E / 15.688; 73.712
వికీపీడియా నుండి
ఆరంబల్
హర్మల్
ఆరంబల్ is located in Goa
ఆరంబల్
ఆరంబల్
గోవాలోని ఆరంబల్
Coordinates: 15°41′17″N 73°42′43″E / 15.688°N 73.712°E / 15.688; 73.712
దేశము భారతదేశం
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగోవా
భారతదేశ జిల్లాలుఉత్తర గోవా జిల్లా
జనాభా
 (2011)
 • Total5,322
భాష
 • వాడుక భాషకొంకణి, మరాఠీ
Time zoneUTC+5:30 (IST)

ఆరంబల్ లేదా హర్మల్ భారతదేశంలోని గోవా రాష్ట్రంలోని ఉత్తర గోవా జిల్లాలోని ఒక పట్టణం. ఇక్కడ ఆరంబల్ బీచ్ చాలా ప్రసిద్ధి చెందింది. ఇది గోవాలో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం.[1][2]

వివరణ

[మార్చు]

ఆరంబల్ సాంప్రదాయకంగా మత్స్యకారుల గ్రామం, ఇది ఉత్తర గోవాలోని పెర్నెమ్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్‌లో ఉంది. గోవా రాజధాని పానాజీ(పంజిమ్) నుండి దీని దూరం దాదాపు 55 కిలోమీటర్లు.[3] దబోలిమ్ విమానాశ్రయం నుండి సుమారు గంట ప్రయాణం. ముఖ్యంగా నవంబర్ నుండి మార్చి నెలలలో ఆరంబల్ బీచ్ కి చాలా మంది అంతర్జాతీయ పర్యాటకులు వస్తారు. దీనికి ఉత్తరాన కెర్రీ బీచ్, దక్షిణాన మాండ్రేమ్ బీచ్ ఉన్నాయి.[4] ఇక్కడ పారాగ్లైడింగ్, కైట్ సర్ఫింగ్ వంటివి కూడా ఉంటాయి.

వసతి సౌకర్యాలు

[మార్చు]

ఇక్కడ స్థానిక ప్రజల నిరసనలు, ఒత్తిళ్ల కారణంగా ఈ ప్రాంతంలో వసతి సౌకర్యాలు అతిథి గృహాలు, గృహాలు లేదా తాత్కాలిక బీచ్ హట్‌లు పర్యాటక సీజన్‌లో నిర్మించి, సీజన్ చివరిలో తొలగిస్తారు.

స్థానిక సంస్కృతి

[మార్చు]

ఇక్కడ ఎక్కువ మంది క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు ఉంటారు. ఇక్కడ మౌంట్ కార్మెల్ అవర్ లేడీ చర్చ్ కాథలిక్ ప్రజల మతపరమైన ప్రదేశం. ఇక్కడ మేరీ మాతను కొంకణి భాషలో సైబిన్ మాయి అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఫుట్‌బాల్, క్రికెట్ ఎక్కువగా ఆడతారు.

వాతావరణం

[మార్చు]
  • వర్షపాతం: 3117 మి.మీ
  • గరిష్ట ఉష్ణోగ్రత: 34 °C
  • కనిష్ట ఉష్ణోగ్రత: 23 °C

చిత్ర మాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "The Rough Guide to Goa," Rough Guides UK, 2010, ISBN 9781405386616
  2. "Goa and Mumbai," Amelia Thomas, Lonely Planet, 2012, ISBN 9781741797787
  3. Arambol Beach Archived 2015-08-13 at the Wayback Machine
  4. Introducing Arambol (Harmal) Archived 2015-09-05 at the Wayback Machine
"https://te.wikipedia.org/w/index.php?title=ఆరంబల్&oldid=3944453" నుండి వెలికితీశారు