ఆరవీటి గోపాలరాజు
ఆరవీటి గోపాలరాజు, కందెనవోలు (కర్నూలు) యొక్క చివరి హిందూ పాలకుడు. విజయనగర సామ్రాజ్యపు అమరనాయకుడు. గోపాలరాజు అళియ రామరాయల చిన తమ్ముడైన వెంకటాద్రి రాయలు యొక్క మనవడు, ఆరవీటి శ్రీరంగరాయలు యొక్క మునిమనవడు.
1619-20 లో బీజాపూర్ సుల్తానుల గవర్నర్ అయిన అబ్దుల్ వహాబ్ ఖాన్, విజయనగర సామ్రాజ్యపు సామంత రాజైన ఆరవీటి గోపాలరాజు మధ్య యుద్ధం జరిగినది.[1] గోపాలరాజు తన బంధువులైన ఆనెగొంది, గండికోట, అవుకు, పెనుగొండ రాజుల సహాయంతో వహాబ్ ఖాన్ ను తిప్పి కొట్టాడు.[2] వహాబ్ ఖాన్ కర్నూలు కోటను ఆక్రమించే తొలి ప్రయత్నంలో విఫలుడైనాడు. వహాబ్ ఖాన్ 1624లో రెండవసారి దండయాత్ర చేశాడు. ఈసారి గోపాలరాజు తన బంధువుల నుండి ఏ సహాయాన్ని పొందలేకపోయాడు. ఒంటరిగా పోరాడి పరాజయం పాలయ్యాడు. వహాబ్ ఖాన్ కర్నూలును వశపరచుకున్నాడు. బీజాపూరు సుల్తాను, రెండవ ఇబ్రహీం ఆదిల్ షా, ఈ విజయానికి కానుకగా వహాబ్ ఖాన్ ను కర్నూలు నవాబుగా ప్రకటించాడు.
గోపాలరాజుకు సంతానం లేనందున, అళియ రామరాయల మనవడు పిన వెంకటరాయలు యొక్క కుమారుడైన శ్రీరంగరాయలను దత్తతు తీసుకున్నాడు. ఈ శ్రీరంగ రాయలే విజయనగర సామ్రాజ్యపు చివరి రాజు.
మూలాలు
[మార్చు]- ↑ K. A., Nilakanta Sastri (1966). A History of South India: From Prehistoric Times to the Fall of Vijayanagar (Third ed.). Oxford University Press. p. 302.
- ↑ "Gopal Darwaza stands as a witness to history". The Hindu. No. April 22, 2014. Retrieved 6 December 2014.