ఆరూరి రమేష్

వికీపీడియా నుండి
(ఆరూరు రమేశ్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అరూరి రమేష్
ఆరూరి రమేష్


పదవీ కాలం
 2014 - 2018, 2018 - ప్రస్తుతం
నియోజకవర్గం వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 4 ఏప్రిల్ 1967
ఉప్పుగల్, జాఫర్ గడ్, జనగామ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు గట్టుమల్లు, వెంకటమ్మ
జీవిత భాగస్వామి కవితా కుమారి
సంతానం కుమారుడు (విశాల్),కుమార్తె (అక్షిత).
వెబ్‌సైటు arooriramesh.com

అరూరి రమేష్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ఉన్నాడు.[1]

జననం[మార్చు]

ఆరూరి రమేష్ 1967, ఏప్రిల్ 4న గట్టుమల్లు, వెంకటమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, జాఫర్ గడ్ మండలంలోని, ఉప్పుగల్ గ్రామంలో జన్మించాడు.[2] 1995, ఏప్రిల్ లో కాకతీయ విశ్వవిద్యాలయం నుండి సోషియాలజీలో ఎంఏ పూర్తిచేశాడు.[3] ఆ తరువాత ఎల్.ఎల్.బి. కూడా చదివాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

రమేష్ కు కవితా కుమారితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

రాజకీయ విశేషాలు[మార్చు]

అరూరి రమేష్ 2009లో ప్రజా రాజ్యం పార్టీతో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి ఆ పార్టీ తరపున ఘన్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాడు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[4] 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండేటి శ్రీధర్ పై 86,349 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2015, జనవరి 10 నుండి 2018, సెప్టెంబరు 6 వరకు తెలంగాణ లెజిస్లేచర్ కో -ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలలో అక్రమాలపై హౌస్ కమిటీ ఛైర్మన్ గా పనిచేశాడు.[5] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప తెలంగాణ జన సమితి పార్టీ అభ్యర్థి పగిడిపాటి దేవయ్యపై 99,240 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6][7]

మూలాలు[మార్చు]

  1. "Aroori Ramesh MLA of WARDHANAPET (SC) Telangana contact address & email". nocorruption.in (in ఇంగ్లీష్). Retrieved 2021-08-22.
  2. admin (2019-01-10). "Wardhannapet MLA Aroori Ramesh". Telangana data (in ఇంగ్లీష్). Retrieved 2021-08-22.
  3. ArooriRamesh.PDF "Aroori Ramesh Affidavits" Check |url= value (help) (PDF). ceotelangana.nic.in. Retrieved 2021-08-22.
  4. "Aroori Ramesh | MLA | Hanmakonda | Wardhannapet | TRS". the Leaders Page (in ఇంగ్లీష్). 2020-04-29. Retrieved 2021-08-22.
  5. "Member's Profile - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-08-22.
  6. "Aroori Ramesh(TRS):Constituency- WARADHANAPET (SC)(WARANGAL URBAN) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-08-22.
  7. "Wardhanapet Election Result 2018 Live Updates: Aroori Ramesh of TRS Wins". News18 (in ఇంగ్లీష్). Retrieved 2021-08-22.