ఆల్‍ఫ్రెడ్ నోబెల్
ఆల్ఫ్రెడ్ నోబెల్ | |
---|---|
జననం | అక్టోబర్ 21, 1833 స్టాక్‌హోం, స్వీడన్ |
మరణం | డిసెంబర్ 10, 1896 సన్రెమో, ఇటలీ |
విశ్రాంతి ప్రదేశం | 59°21′24.52″N 18°1′9.43″E / 59.3568111°N 18.0192861°E |
వృత్తి | రసాయన శాస్త్రవేత్త ఇంజనీరు ఆవిష్కర్త క్రొత్త వస్తువుల సృష్టికర్త |
ప్రసిద్ధి | డైనమేట్ , నోబెల్ బహుమతి |
సంతకం |
ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ (help·info) ఆల్‌ఫ్రెడ్ బెర్నార్డ్ (అక్టోబర్ 21, 1833, స్టాక్‌హోం, స్వీడన్ – డిసెంబర్ 10, 1896, సన్రీమో, ఇటలీ) స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు, ఆవిష్కర్త, మిలిటరీ ఆయుధాల తయారీదారు, డైనమైట్ ఆవిష్కర్త. ఒక పాత ఇనుము, స్టీల్ మిల్లును తీసుకొని బొఫోర్స్ అనే మిలిటరీ ఆయుధాలను తయారు చేసే కంపెనీ స్థాపించాడు. ఈయన ఆఖరి వీలునామాలో నోబెల్ బహుమతి స్థాపన కొరకు చాలా పెద్ద మొత్తంలో ధనాన్ని కూడగట్టాడు. కృత్రిమ మూలకము నోబెలియం ఇతని పేరు మీదుగా నామకరణం చేసారు.
జీవితం
[మార్చు]ఆల్‌ఫ్రెడ్ నోబెల్, ఇమాన్యువెల్ నోబెల్ (1801-1872), ఆండ్రియాట్ ఆల్సెల్ నోబెల్ (1805-1889) మూడవ సంతానం. ఈయన స్వీడన్ దేశంలోని స్టాక్‌హోంలో అక్టోబర్ 21 1833లో జన్మించాడు. ఆల్ఫ్రెడ్ తండ్రి ఇమాన్యుయెల్ ఇంజనీరు. తరువాత ఇతని కుటుంబంతో 1842లో సెయింట్ పీటర్స్‌బర్గ్ చేరుకున్నాడు. ఆల్ఫ్రెడ్ రసాయన శాస్త్ర అధ్యయనం ప్రొఫెసర్ నికోలాయ్ నికోలవిచ్ జినిన్ వద్ద ప్రారంభించాడు.
నోబెల్ పురస్కారం
[మార్చు]నేడు భౌతిక, రసాయన, వైద్య, శాంతి విభాగం శాస్త్రాలలోనే కాకుండా, సాహిత్యం, శాంతి, ఆర్థిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అందిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ పురస్కారం ఈయన పేరుమీదనే స్థాపించబడింది. ఆల్‌ఫ్రెడ్ నోబెల్ 1895 నాటి వీలునామా ప్రకారం 1901లో ఈ పురస్కారం ప్రారంభించబడింది (నోబెల్ మరణించిన 5 సంవత్సరాల తరువాత). ఆల్‌ఫ్రెడ్ నోబెల్ గౌరవార్ధం ఆర్థిక బహుమతి మటుకు 1969 నుండి బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ద్వారా ఇవ్వడం జరుగుతోంది. నోబెల్ శాంతి బహుమతి ను మాత్రము నార్వే రాజదానీ ఓస్లో లో ప్రదానం చేస్తారు. ఈ ఆరు బహుమతులు అత్యధిక పారితోషికంతో పాటు పేరు ప్రఖ్యాతలకు నిదర్శనం. ప్రతీ సంవత్సరం, ఒక్క శాంతి బహుమానం తప్ప మిగతా ఐదు బహుమతులు నోబెల్ వర్ధంతి అయిన డిసెంబరు 10 నాడు, స్టాక్‌హోంలో ఇవ్వబడతాయి. వివిధ రంగాలలో విశేషమైన కృషి / పరిశోధనలు చేసిన, విప్లవాత్మక విధానాలు / పరికరాలతో శాస్త్రాన్ని ముందంజ వేయించిన, మానవ సమాజానికి ఆ శాస్త్రంతో అత్యంత సహాయాన్ని అందించిన వ్యక్తులకు, సంస్థలకు (శాంతి బహుమతి మాత్రమే) ఇవ్వబడుతుంది.
సూచికలు
[మార్చు]మూలాలు
[మార్చు]యితర లింకులు
[మార్చు]- AC with 16 elements
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with faulty authority control identifiers (SBN)
- Wikipedia articles with SNAC-ID identifiers
- నోబెల్ బహుమతి
- భౌతిక శాస్త్రవేత్తలు
- 1833 జననాలు
- 1896 మరణాలు
- శాస్త్రవేత్తలు
- ప్రపంచ ప్రసిద్ధులు