ఆహార భద్రత పథకం
ఆహార భద్రత పథకం | |
---|---|
ప్రాంతం | హైదరాబాదు, తెలంగాణ |
ప్రధాన వ్యక్తులు | తెలంగాణ ప్రజలు |
స్థాపన | 2015, జనవరి 1 |
నిర్వాహకులు | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ ప్రభుత్వం |
ఆహార భద్రత పథకం అనేది తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 6 కిలో గ్రాముల బియ్యం అందించడం కోసం ఈ పథకం ప్రవేశపెట్టబడింది. కుటుంబంలో ఎంతమంది ఉన్నా, ప్రతి ఒక్కరికి 6 కిలోల బియ్యం అందుతుంది.[1]
ప్రారంభం
[మార్చు]2015, జనవరి 1న కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ మండలం, చెల్పూరు గ్రామంలో అప్పటి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖామంత్రి ఈటెల రాజేందర్ ఈ పథకాన్ని ప్రారంభించాడు.[2]
వివరాలు
[మార్చు]గతంలో తెల్లకార్డు గల కుటుంబాలలో ఒక్కో వ్యక్తికి నాలుగు కిలోల చొప్పున, గరిష్టంగా 20 కిలోలు ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఆహార భద్రత కార్డుపై ఉన్న లబ్ధిదారులకు కిలోకు రూపాయి చొప్పున ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం, అంత్యోదయ కార్డున్న వారికి కిలోకు రూపాయి చొప్పున ఒక్కో కార్డుపై 35 కిలోల బియ్యం, అన్నపూర్ణ కార్డులున్న వారికి ఒక్కో కార్డుపై 10 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు.[1]
నిధులు
[మార్చు]ఈ పథకం అమలుకోసం 2015-16 రాష్ట్ర బడ్జెట్ లో ఆహార భద్రత, సబ్సిడీకి రూ. 1,105 కోట్లు కేటాయించబడింది.[3] తెలంగాణ చిహ్నంతో కొత్తగా అందజేసే ఆహార భద్రతా కార్డుల ముద్రణకు 10 కోట్ల రూపాయలను కూడా కేటాయించింది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 ABN (2020-11-29). "పేదలకు ఇక నుంచి 6 కిలోల బియ్యం!". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-06-07. Retrieved 2023-06-07.
- ↑ "కొత్త భోజనం". Sakshi. 2015-01-01. Archived from the original on 2023-06-07. Retrieved 2023-06-07.
- ↑ "Telangana Budget 2015: Real estate perspective". The Economic Times. 2015-03-23. Archived from the original on 2022-06-15. Retrieved 2022-06-15.