ఇంటర్నెట్

వికీపీడియా నుండి
(ఇంటర్నెట్టు నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ప్రాంతీయతని కలుపుతు అంతర్జాలంలోకి చేర్చుతున్న చిత్రం

ఇంటర్నెట్ (ఆంగ్లం Internet) అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లను కలిపే ఒక వ్యవస్థ. మరింత వివరంగా చెప్పాలంటే ఇంటర్నెట్ నెట్ వర్క్ లను కలిపే నెట్ వర్క్. ఈ వ్యవస్తలో ఉన్న కంప్యూటర్లు ఒకదానితో ఒకటి సంభాషించుకొనేటందుకు ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనే నియమావళిని ఉపయోగిస్తారు. ఇంటర్నెట్ అన్న మాట తెలుగులో అంతర్జాలం గా వాడుకలోకివచ్చింది .

ఇంటర్నెట్ అంటే ఏమిటో అర్ధం అవటానికి ఒక చిన్న ఉపమానం చెప్పుకోవచ్చు. ఒక పేటలో ఉన్న ఇళ్ళని కలుపుతూ ఒక వీధి ఉంటుంది. ఒక ఇంటి నుండి మరొక ఇంటికి వెళ్ళటానికి ఈ వీధి అవసరం. ఊళ్ళో ఉన్న పేటలన్నిటిని కలుపటానికి అల్లిబిల్లిగా అల్లుకుని ఊరు నిండా పెద్ద రహదారులు(రోడ్లు) ఉంటాయి. ఒక ఊరు నుండి మరొక ఊరుకి వెళ్ళటానికి ప్రాంతీయ రహదారులు ఉంటాయి. ఒక దేశం నుండి మరొక దేశం వెళ్ళటానికి సముద్రంలోనూ, ఆకాశంలోనూ 'అంతర్జాతీయ రహదారులు' ఉంటాయి. ఒక మేపు లో చూస్తే ఈ చిన్నవీధులు, రహదారులూ అన్ని ఒక జాలరివాడి వలలా కనిపిస్తాయి. ఇదే విధంగా ప్రపంచంలో ఉన్న కంప్యూటర్లు అన్నీ కూడ చిన్న చిన్న ప్రాంతీయ వలల లాగా, పెద్ద పెద్ద అంతర్జాతీయంగా అల్లుకుపోయిన వలల లాగా కనిపిస్తాయి కనుక వీటిని అంతర్జాలం అంటారు.

ఇంటర్నెట్ మాతృక[మార్చు]

ఇంటర్నెట్ ద్వారా ఎటువంటి సమాచారాన్ని అయినా క్షణాల్లో సేకరించుకోవచ్చు. ఇంటర్నెట్ కంప్యూటర్లకు సమాచారం చేరవేసే అద్భుతమైన సాధనం. అన్ని కంప్యూటర్లకు అందుబాటులో ఉండే కమ్యూనికేషన్ టెక్నాలజీ సాధనమే ఇంటర్నెట్. ప్రపంచంలోని అన్నిరకాల నెట్ వర్కులన్నింటి వల్ల కమ్యూనికేషన్ ప్రక్రియలో కోట్లాది మంది వ్యక్తులు అనుసం ధానంలో ఉంటారు. 

మెషిన్లు శాటిలైట్లు, సర్వర్లు, కంప్యూటర్లు ఒకదానితో మరొక్కటి అనుసంధానించిన అసంఖ్యాకమైన స్టాప్‌వేర్ ప్రొగ్రాంలు ప్రపంచ వ్యాప్తంగా ఆయా కంప్యూటర్లలో నిక్షిప్తమై ఉన్న బహ్మండమైన నెట్‌వర్క్.. ఇవన్నీ ఇంటర్నెట్‌లో భాగాలే. ప్రతిరోజూ కోట్లాది మంది సమాచారాన్ని తీసుకునే ఆధునాతనమైన కమ్యూనికేషన్ మీడియా ఇంటర్నెట్. వ్యక్తులు, సంస్థలు ప్రభుత్వ పరిపాలనా దాకా ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో మన దశ, దిశ గురించి తెలుసుకోవచ్చు. 

ఇంటర్నెట్ మాతృకను అమెరికాకు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. 1973లో ఇంగ్లాండు-నార్వే మధ్య ప్రపంచ మొట్టమొదటి కమర్షియల్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ప్రారంభమైంది. 1982లో ఇంటర్నెట్ ప్రోటోకాల్ అన్నమాట వాడ కం ప్రారంభమైంది. ప్రతి నిమిషం ఇంటర్నెట్ ద్వారా వేలకోట్ల రూపాయల వ్యాపా ర లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రపంచంలో ఏ రంగానికైనా కావలసిన సమాచారం ఇంటర్నెట్‌లో అవలీలగా లభ్యమవుతుంది. 

ప్రపంచ వ్యాప్తంగా వేలాది టీవీ చానళ్లు, వార్తాపత్రికలు అలాగే విద్యార్థుల చదువులు, ఫలితాలు, కౌన్సిలింగ్, రైతులు, మీ సేవా వంటి సేవలు ఇట్లా ఏ రంగాన్ని నెట్‌తో సంబంధం లేకుండా ఊహించుకోలేము.

చరిత్ర[మార్చు]

ఇంటర్నెట్టు 1969వ సంవత్సరంలో అమెరికా భద్రతా విభాగమయిన "ఎడ్వాన్సెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ ఆర్పా(ARPA)"లో సృష్టించబడినది. తరువాత 1990వ సంవత్సరంలో బ్రిటీషు శాస్త్రవేత్త అయిన "టిం బెర్నెర్స్ లీ" స్విట్జర్ల్యాండ్ లోని సెర్న్(CERN) వద్ద "వరల్డ్ వైడ్ వెబ్(www)"ను సృస్టించాడు. ప్రస్తుతం మనం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్(ISP)లకు కొంత రుసుము చెల్లించి మన కంప్యూటర్లను ఇంటర్నెట్టుకు అనుసంధానించవచ్చు.

కాలమానం (కొన్ని ముఖ్య ఘట్టాలు)[మార్చు]

 • 1969 - అమెరికా సంయుక్త రాష్ట్రాల రక్షణా విభాగం ఆధ్వర్యంలో RAND (రాండ్) అనే పరిశోధనా సంస్థ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో మొదటి సారిగా రెండు నోడలు కలుపబడ్డాయి. ఇదే తర్వాత ARPANET గా ఉద్భవించింది.[1]
 • 1979 - బ్రిటీష్ తపాలా కార్యాలయం మొదటి అంతర్జాతీయ కంప్యూటర్ నెట్వర్క్ టెక్నాలజీ ఉపయోగించడం ప్రారంభించింది .[2]
 • 1980 - బిల్ గేట్స్ IBM (ఐ.బి.ఎం ) కంప్యూటర్లలో మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టం ఉపయోగించడానికి ఒప్పందం కుదురింది
 • 1984 -
 • 1989 -
 • 1996 -
 • 2009 -

ఇంటర్నెట్ ఆడ్రస్[మార్చు]

ఇంటర్నెట్ కు అనుసంధానమైన ప్రతీ కంప్యూటరూ ఒక సంఖ్యను కలిగి ఉంటుంది. దీన్నే ఐపి(ఇంటర్నెట్ ప్రోటో కాల్ ) అడ్రసు అని వ్యవహరిస్తారు. ఇంటర్నెట్ లో ఒక కంప్యూటర్ నుంచి మరొక కంప్యూటర్ కు సందేశాలు ఈ అడ్రసు ఆధారంగానే పంపబడతాయి.

ఐపి అడ్రసుకు ఉదాహరణ:

 • 192.168.0.167
 • 203.178.193.23

తెలుగులోనూ డొమైన్‌ పేరు[మార్చు]

ఇక నుంచి తెలుగులోనూ వెబ్‌సైట్‌ డొమైన్‌ పేరు రాసుకోవచ్చు. విదేశీ డొమైన్లపై లాభాపేక్షలేని సంస్థ 'ద ఇంటర్నెట్‌ కార్పొరేషన్‌ ఫర్‌ ఆసియాన్డ్‌ నేమ్స్‌ అండ్‌ నంబర్స్‌'(ఐసీఏఎన్‌ఎన్‌) భారత్‌కు చెందిన ఏడు భాషలకు ఆమోదం తెలిపింది. ఆంగ్లేతర భాషల్లోనూ డొమైన్ల పేర్లకు ఆహ్వానం పలికిన ఆ సంస్థ తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ, ఉర్దూ, గుజరాతీ, పంజాబీ బాషలనూ అనుమతించింది.(ఈనాడు3.11.2009)

ఇంటర్నెట్ లో మనకు లభించే సేవలు[మార్చు]

రహదారులు ఉండబట్టి మనకి రవాణా సౌకర్యాలు లభించినట్లే, ఇంటర్నెటు ఉండటం వల్ల మనకి అనేకమైన సౌకర్యాలు, సేవలు (services) లభిస్తున్నాయి. రహదారురహదారులు వెంబడి టపాలు బట్వాడా చేసినట్లే అంతర్జాలం మీద బట్వాడా అయే టపాలని ఈ-టపా లేక ఈ-మెయిలు అంటారు. ఇక్కడ ఈ అనే అక్షరం ఇంగ్లీషులో Electronic అనే మాటకి సంక్షిప్తం. కావలిస్తే దీనిని తెలుగులో విద్యుత్-టపా లేదా వి-టపా అనొచ్చు.

రహదారులు ఉండబట్టే మనం ఇరుగు పొరుగులకి వెళ్ళి బాతాఖానీ కొట్టి రాటానికి వీలయింది. అలాగే ఈ విద్యుత్‌ రహదారిని ఉపయోగించి, ఇల్లు వదలి బయటక్లి వెళ్ళకుండా బాతాఖానీ కొట్టొచ్చు. ఈ బాతాఖానీనే ఇంగ్లీషులో చాటింగ్ (Chatting) అంటారు.

రహదారులు ఉండబట్టే ఆ రహదారురహదారులు వెంబడి గ్రంధాలయానికి వెళ్ళి పుస్తకాలు, పత్రికలు చదవటానికి సానుకూలం అయింది. అదే విధంగా ఈ విద్యుత్ రహదారి వెంబడి మనం ప్రపంచం అంతా తిరిగి బహిరంగంగా ఉన్న గ్రంధాలయాలే కాకుండా ఇంటింటా ఉన్న సొంత గ్రంధాలయాలని కూడ దర్శించి విషయ సేకరణ చెయ్యవచ్చు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జ్ఞాన సంపదనే 'వరల్డ్ వైడ్ వెబ్' అంటారు.

వరల్డ్ వైడ్ వెబ్ ఇంటర్నెటులో అత్యధికంగా ఉపయోగించే సేవ. ఇందులో వెబ్ సైట్సు, బ్లాగులు, మొదలయిన ఎన్నో పేజీలు మనకు అందుబాటులో ఉంటాయి. ఈ సమాచారాన్ని మనం వాడుకనేందుకు వాడే సాఫ్టువేర్ అనువర్తనాన్ని బ్రౌజర్ లేదా విహరిణి అంటారు. అంతెందుకు మీరు ఇప్పుడు చదువుతున్న వికీపిడియా కూడా వరల్డ్ వైడ్ వెబ్ లో బాగమే. వరల్డ్ వైడ్ వెబ్ ను పలకటానికి సులువుగా ఉంటుందని వెబ్ అని పిలుస్తుంటారు.

వెబ్ తరువాత ఇంటర్నెటులో ఈ-మెయిల్ అత్యధికంగా ఉపయోగించబడే సేవ. మన పోస్టలు సేవకు మల్లేనే ఇందులో మనము ఉత్తరాలు వాటికి ప్రత్యుత్తరాలు పంపించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకు కాగితం అవసరంలేదు. కేవలం సమాచారం ఉంటే చాలు. చాటింగ్ లేదా ఇన్స్టెంట్ మెసేజింగ్ కూడా ఈ-మెయిల్ వంటిదే, కానీ సమాచారమును మరింత తొందరగా చేరవేస్తుంది, కాకపోతే కొద్ది సమాచారమును మాత్రమే పంపించగలము.

పోర్టల్[మార్చు]

రకరకాలసేవలను అందించే ప్రత్యేక వెబ్సైటులను పోర్టల్ అంటారు. ఇవి తెలుగు భాషలో లభ్యమవుతున్నాయి

భిన్నాభిప్రయాలు[మార్చు]

అయితే కొన్ని దేశాలలో ప్రభుత్వాలు ఇంటర్నెటు ఒక్క చెడ్డ వ్యవస్థ అనే అభిప్రాయం కలిగి ఉన్నాయి. అవి ఇంటర్నెటులోని కొన్ని భాగాలను తమ దేశాలలో ప్రజలు వాడుకోకుండా అడ్డుకుంటున్నాయి. ఉదాహరణకు, చైనాలో ప్రజలు ఎవరు కూడా మీరు చదువుతున్న ఈ వికీపిడియాను చదవలేరు, మార్పులు కూడా చేయలేరు. అంతేకాదు కొంతమంది తల్లితండ్రులు తమ పిల్లలకు ఇంటర్నెటు చాలా కీడు చేస్తుందని భావిస్తుంటారు.

ఇంటర్నెట్ వల్ల కలిగే నష్టాలు[మార్చు]

 • ప్రమాదకరమైన సైట్లకు వెళ్ళినట్లయితే, మీ కంప్యూటరుకు వైరస్ సోకి చెడిపోయే ప్రమాదం ఉంది. '
 • అంతర్జాలంలో ఇంకా సమర్ధమయిన monitoring systems లేవు. కనుక చిన్నపిల్లలు పెద్దలకు మాత్రమె ఉద్దేశించిన సైట్లకు వెళ్ళినట్లయితే వారి మనసులమీద దుష్ప్రభావం పడే అవకాసం ఉంది.

మూలాలు[మార్చు]

 1. ఇంటర్నెట్ సంక్షిప్త చరిత్ర ఆంగ్లంలో
 2. బ్రిటిష్ టెలికాం చరిత్ర ముఖ్య ఘట్టాలు ఆంగ్లములో

బయటి లింకులు[మార్చు]

ప్రచురణలు[మార్చు]

పుస్తకాలు[మార్చు]

ఉపన్యాసాలు[మార్చు]

పురస్కారాలు[మార్చు]

విశేషాలు[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

www.alldigitricks.com

"https://te.wikipedia.org/w/index.php?title=ఇంటర్నెట్&oldid=1541110" నుండి వెలికితీశారు