ఇంటర్నెట్ చరిత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇంటర్నెట్ చరిత్ర 1950ల్లో ఎలక్ట్రానిక్ కంప్యూటర్ల అభివృద్ధితో మొదలైంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లోని పలు కంప్యూటర్ సైన్స్ లాబొరేటరీల్లో వైడ్ ఏరియా నెట్‌వర్కింగ్ ఆరంభ అంశాలు ప్రారంభమయ్యాయి.[1] 1960ల్లోనే రాబర్ట్ టేలర్ మార్గదర్శనంలో, లారెన్స్ రాబర్ట్స్ నిర్వహణలో ఆర్పానెట్ వంటి ప్రాజెక్టుల అభివృద్ధికి, సంబంధిత పరిశోధనలకు అమెరికన్ రక్షణశాఖ కాంట్రాక్టులు ఇచ్చింది. 1969లో లాస్ ఏంజెల్స్‌లోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని కంప్యూటర్ సైన్స్ ఆచార్యుడు లియోనార్డ్ క్లైన్‌రాక్ లాబొరేటరీ నుంచి స్టాన్‌ఫర్డ్ పరిశోధన సంస్థలోని నెట్‌వర్క్ నాడ్‌కు మొట్టమొదటి ఆర్పానెట్ మెసేజి పంపించారు.

మూలాలు[మార్చు]

  1. Kim, Byung-Keun (2005). Internationalising the Internet the Co-evolution of Influence and Technology. Edward Elgar. pp. 51–55. ISBN 1845426754.