Jump to content

ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్

వికీపీడియా నుండి
ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్
Small blue "e" letter with a yellow aureola
విండోస్ 10 పై నడపబడతున్న ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్
విండోస్ 10 పై నడపబడతున్న ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్
సాఫ్టువేర్ అభివృద్ధికారుడుథామస్ రియర్డన్
సాఫ్టువేర్ అభివృద్ధికారుడుమైక్రోసాఫ్ట్
ప్రారంభ విడుదలఆగస్టు 16, 1995; 29 సంవత్సరాల క్రితం (1995-08-16)
[dubious ]
Final release(s)
Windows11.0.205 (ఆగస్టు 11, 2020; 4 సంవత్సరాల క్రితం (2020-08-11)[1]) [±]
Mac OS5.2.3 (జూన్ 16, 2003; 21 సంవత్సరాల క్రితం (2003-06-16)) [±]
UNIX5.01 SP1 (2001; 23 సంవత్సరాల క్రితం (2001)) [±]
సాఫ్టువేరు ఇంజను లుTrident, Chakra
ఆపరేటింగ్ సిస్టంవిండోస్ (గతంలో: Mac OS X, Solaris, HP-UX)
ప్లాట్ ఫాంIA-32, x86-64, ARMv7, IA-64 (గతంలో: MIPS, Alpha, PowerPC, 68k, SPARC, PA-RISC)
Included withWindows 95 OSR1 and later
Windows NT 4 and later
Windows Phone 7 through Windows Phone 8.1
Mac OS 8.1 through Mac OS X 10.2
Zune HD
Xbox 360
Xbox One
సాంకేతిక స్టాండర్డ్HTML5, CSS3, WOFF, SVG, RSS, Atom, JPEG XR
అందుబాటులో ఉంది95 భాషలు[2]
రకంవిహరిణి
ఫీడ్ రీడర్
లైసెన్సుహక్కులపై యాజమాన్యం గలది, విండోస్ లైసెన్స్ వుంటే అంతిమ వినియోగదారులు వాడవచ్చు[3]
జాలస్థలిsupport.microsoft.com/products/internet-explorer Edit this on Wikidata

ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ [a] (గతంలో మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ [b], విండోస్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, [c] సాధారణంగా IE లేదా MSIE అని సంక్షిప్తీకరించబడింది) అనేది మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన గ్రాఫికల్ వెబ్ బ్రౌజర్‌ల శ్రేణి. ఇది మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ శ్రేణికొరకు 1995 కాలంలో తొలిగా విడుదలైంది. ఇది మొదట యాడ్-ఆన్ ప్యాకేజీ 'ప్లస్‌ ఫర్ విండోస్ 95'లో భాగంగా విడుదల చేయబడింది. తరువాతి సంస్కరణలు ఉచిత దింపుకోళ్లుగా లేదా సేవా ప్యాక్‌లలో లభించాయి. తరువాత విండోస్ 95 యొక్క అసలు పరికరాల తయారీదారు (OEM) సేవా విడుదలలలో, విండోస్ కొత్త రూపాలలో ఇది అందుబాటులోకి వచ్చింది. దీని అభివృద్ధి 2016 లో నిలిపివేయబడింది,[4] కానీ వాడుకరుల సేవలు ఆగస్టు 2020 వరకు కొనసాగాయి. మైక్రోసాఫ్ట్ ఎడ్జి విహరిణి వున్నందున ఆగస్టు 2021 లో సేవలు నిలిపివేయబడతాయని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది [5][6]

ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఒకప్పుడు ఎక్కువగా ఉపయోగించే వెబ్ బ్రౌజర్. 2003 నాటికి ఇది 95% వినియోగ వాటాను సాధించింది.[7] 1990 లలో ప్రబలమైన బ్రౌజర్‌గా ఉన్న నెట్‌స్కేప్‌కు వ్యతిరేకంగా మొదటి బ్రౌజర్ యుద్ధాన్ని గెలవడానికి మైక్రోసాఫ్ట్ విండోస్ తో జతగా విడుదలచేసిన తరువాత ఇది జరిగింది. ఫైర్‌ఫాక్స్ (2004), గూగుల్ క్రోమ్ (2008) ప్రారంభించడంతో, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు మద్దతు ఇవ్వని ఆండ్రాయిడ్, ఐఓఎస్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్‌లకు పెరుగుతున్న ప్రజాదరణతో దీని వినియోగ వాటా క్షీణించింది. అన్ని ప్లాట్‌ఫారమ్‌లపై ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ యొక్క మార్కెట్ వాటా 2.28% లేదా స్టాట్‌కౌంటర్ సంఖ్యల ద్వారా 7 వ స్థానంలో వుంది. డెస్క్‌టాప్‌లో, మాకోస్ సఫారి తరువాత ఇది 5% వద్ద 4 వ స్థానంలో ఉంది.[8] దీని గణాంకాలను తరువాత విడుదలైన ఎడ్జ్‌తో కలిపినప్పుడు ఇది క్రోమ్ తరువాత రెండవ ర్యాంకును చేరుకుంటుంది (ఇతర అధ్యయనాలలో ఫైర్‌ఫాక్స్ తరువాత, 7.44%తో ఇది 3 వ స్థానంలో ఉన్నట్లు నిర్ణయించారు.[9]) 1990 ల చివరలో మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కోసం సంవత్సరానికి US$10 కోట్లు ఖర్చు చేసింది,[10] 1999 నాటికి ఈ ప్రాజెక్టులో 1,000 మందికి పైగా పాల్గొన్నారు.[11][12]

మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ తన విండోస్ 10 పరికరాల్లో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను అప్రమేయ బ్రౌజర్‌గా మారుస్తుందని 2015 మార్చి 17 న ప్రకటించింది (పాత విండోస్‌కు మద్దతు ప్రకటించినప్పటి నుండి As of 2019 ఎడ్జ్ ఇప్పటికీ IE కంటే తక్కువ వాటాను కలిగి ఉంది). ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 11 ను చివరి విడుదలగా ప్రకటించింది (అయితే IE 8, 9, 10 కూడా 2019 నాటికి భద్రతా నవీకరణలు అందుబా టులో వుంటాయి).[13][14][15] ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ విండోస్ 10, విండోస్ సర్వర్ 2019 లో ప్రధానంగా సంస్థల ఉపయోగార్ధం ఉంది.[16][17] 2016 జనవరి 12 నుండి, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 11 కి మాత్రమే మద్దతు ఉంది.[18][19] ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క సాంకేతిక సామర్థ్యాలు, దాని మద్దతు జీవితచక్రం ఆధారంగా మద్దతు మారుతుంది.[20]

మూడవ పార్టీ సాంకేతిక పరిజ్ఞానం ( స్పైగ్లాస్ మొజాయిక్ యొక్క సోర్స్ కోడ్, ప్రారంభ సంస్కరణల్లో రాయల్టీ లేకుండా ఉపయోగించబడింది) వలన భద్రత, గోప్యతా దుర్బలత్వం అనే విమర్శలు ఎదుర్కొంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు,, యూరోపియన్ సమాఖ్య విండోస్‌తో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ అందచేయటం సముచితమైన విహరిణిల పోటీకి హాని కలిగించాయని పేర్కొన్నాయి.[21]

ఇవి కూడా చూడండి

[మార్చు]

గమనింపులు

[మార్చు]
  1. Since version 10
  2. In version 6 and earlier
  3. In versions 7, 8, and 9

మూలాలు

[మార్చు]
  1. "Cumulative security update for Internet Explorer: August 11, 2020". Support (18 ed.). Microsoft. 11 August 2020.
  2. "Internet Explorer 10 for Windows 7 released in 95 languages – Microsoft Language Portal Blog". blogs.technet.microsoft.com.
  3. "Microsoft Pre-Release Software License Terms: Internet Explorer 11 Developer Preview". microsoft.com. Microsoft. Retrieved July 27, 2013.
  4. 4.0 4.1 "Frequently Asked Questions". Microsoft Edge Development. Microsoft. Archived from the original on 2016-07-16. The latest features and platform updates will only be available in Microsoft Edge. We will continue to deliver security updates to Internet Explorer 11 through its supported lifespan. To ensure consistent behavior across Windows versions, we will evaluate Internet Explorer 11 bugs for servicing on a case by case basis.
  5. "Microsoft Internet Explorer is finally dead". The Independent (in ఇంగ్లీష్). 2020-08-18. Archived from the original on 2020-11-13. Retrieved 2020-08-20.
  6. "Microsoft 365 apps say farewell to Internet Explorer 11 and Windows 10 sunsets Microsoft Edge Legacy". TECHCOMMUNITY.MICROSOFT.COM (in ఇంగ్లీష్). 2020-08-17. Retrieved 2020-08-20.
  7. "Microsoft's Internet Explorer losing browser share". BBC News.
  8. "Desktop Browser Market Share Worldwide | StatCounter Global Stats" (in ఇంగ్లీష్).
  9. "Market share for mobile, browsers, operating systems and search engines | NetMarketShare".
  10. "Victor: Software empire pays high price". Archived from the original on 2021-02-21. Retrieved 2019-09-05.
  11. "The rise, fall, and rehabilitation of Internet Explorer". Archived from the original on 2015-06-26. Retrieved 2019-09-05.
  12. "U.S. Antitrust Case 98-1232".
  13. "Microsoft Update Catalog".
  14. "Microsoft Update Catalog".
  15. "Cumulative security update for Internet Explorer: June 12, 2018: Applies to: Internet Explorer 11, Internet Explorer 10, Internet Explorer 9".
  16. "Microsoft is killing off the Internet Explorer brand".
  17. "What's new in the Windows Server 2019 Insider Preview Builds". Archived from the original on 2019-12-10. Retrieved 2019-09-05.
  18. "What is the Microsoft Lifecycle Support policy for Internet Explorer?".
  19. "Stay up-to-date with Internet Explorer".
  20. "Internet Explorer Support Lifecycle Policy FAQ".
  21. "Internet Explorer". Rotten Websites Wiki (in ఇంగ్లీష్). Archived from the original on 2018-08-12. Retrieved 2018-08-12.