ఇందుమతి పాటంకర్ (ఇందుతాయ్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇందుమతి బాబూజీ పాటంకర్
ఇందుతాయ్ 2015
జననం(1925-09-15)1925 సెప్టెంబరు 15
ఇందోలి
మరణం2017 జూలై 14(2017-07-14) (వయసు 91) [1][2]
జాతీయతభారతీయురాలు
ఇతర పేర్లుఇందుతాయ్
విద్యఉన్నత విద్య, ఉపాధ్యాయ విద్య
విద్యాసంస్థకాసేగావ్ ఎడ్యుకేషన్ సొసైటీని, ఆజాద్ విద్యాలయ
శ్రామిక్ ముక్తి దళ్
ఉద్యమంభారత స్వాతంత్ర ఉద్యమం, స్త్రీ ముక్తి సంఘర్ష్ చల్వాల్, శ్రామిక్ ముక్తి దళ్
తల్లిదండ్రులుదినకరరావు నికం
సరస్వతీ నికం

ఇందుమతి పాటంకర్ (ఇందుతాయ్) (1925 - 2017) మహారాష్ట్రలోని కాసేగావ్‌కు చెందిన గ్రామీణ భారత స్వాతంత్ర్య సమరయోధురాలు. ఈమె తండ్రి దినకరరావు నికమ్. ఇతను 1930 లో స్వాతంత్ర్య ఉద్యమంలో సత్యాగ్రహం కోసం జైలు పాలయ్యాడు. ఇందుతాయ్ తన 10-12 సంవత్సరాల వయస్సులో వోల్గా తే గంగా వంటి పుస్తకాలను చదవడం ప్రారంభించింది, గ్రామంలో కాంగ్రెస్ నిర్వహించే చిన్న చిన్న కార్యక్రమాలలో పాల్గొంటూ, ఇండోలిలోని స్వాతంత్ర్య ఉద్యమ నాయకుల కుటుంబాలకు మద్దతునిస్తూ, స్వాతంత్ర్యోద్యమం వైపు ఆకర్షితురాలయింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

బాల్యం

[మార్చు]

1942లో, ఇందుతాయ్ 16 సంవత్సరాల వయస్సులో తన తల్లిదండ్రులను విడిచిపెట్టి, బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా 1942 స్వాతంత్ర్య ఉద్యమంలో చేరింది, మహిళలను సంఘటితం చేసి రాష్ట్ర సేవాదళ్‌ను విస్తరించింది. ఆమె క్రమంగా 1943 నాటికి ప్రతి సర్కార్ ఉద్యమంలో పాల్గొనడం మొదలుపెట్టింది, పోరాట యోధులకు ఆయుధాలు (పిస్టల్స్, రివాల్వర్లు) తీసుకువెళ్ళింది.

వివాహం,ఉద్యమ ప్రారంభ జీవితం

[మార్చు]

ఆమె 1948 జనవరి 1 న క్రాంతివీర్ బాబూజీ పటాంకర్‌ని వివాహం చేసుకుంది. ఈ దంపతులిద్దరూ 'ప్రతి సర్కార్'లో, 1940 లలో సతారా జిల్లాలో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భాగమైన ప్రభుత్వ ఉద్యమంలో ప్రముఖ కార్యకర్తలు. ప్రతి సర్కార్ ప్రధాన ఉద్దేశం వంద లేదా అంతకంటే ఎక్కువ మంది కార్యకర్తలు తమ ఇళ్లను విడిచిపెట్టి గ్రామం నుండి గ్రామానికి పూర్తి సమయం పనిచేసేవారినీ, తుపాకులు లేదా ఇతర ఆయుధాలు తీసుకుని, అవసరమైతే పోలీసులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేవారిని తయారుచేయడం. దీనికోసం ప్రతి సర్కార్ కార్యకర్తలు చాలా కార్యకలాపాలకు సమర్థవంతమైన నిర్ణయాధికార కేంద్రాలుగా ఉండే సమూహాలుగా నిర్వహించబడ్డారు. జిల్లా స్థాయిలో అన్ని గ్రూపుల ప్రతినిధులు ఎప్పటికప్పుడు సమావేశమయ్యారు. గ్రామ స్థాయిలో, ఈ కార్యకర్తలు స్వచ్ఛంద బృందాలను కలిగి ఉన్న వివిధ నిర్మాణాలను స్థాపించడానికి, కొంతవరకు గ్రామ కమిటీల ద్వారా ఎంపిక చేయబడిన పంచ కమిటీలను స్థాపించారు. ఈ గ్రామ నిర్మాణం 1944, 1945 చివరిలో జరిగిన ఉద్యమంతో అభివృద్ధి చెందింది.

ప్రత్యేకతలు

[మార్చు]

బాబూజీ, ఇందుమతి పాటంకర్ ఇద్దరూ కలిసి కాసేగావ్ ఎడ్యుకేషన్ సొసైటీని, ఆజాద్ విద్యాలయ అని పిలవబడే కాసేగావ్‌లోని మొదటి ఉన్నత పాఠశాలను స్థాపించారు. కాసేగావ్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించడంలో ఆమె బాబూజీకి మద్దతు ఇచ్చింది, దాని మొదటి మహిళా విద్యార్థులలో ఒకరిగా మారింది, తరువాత ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ రోజూ ఉదయం, సాయంత్రం అత్త, మామలతో కలిసి పొలాలకు వెళ్లి కుటుంబాన్ని పోషించేది. ఆమె పదవీ విరమణ వరకు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూనే, ఉద్యమంలో పాలుపంచుకుంటూ అంతటా కొనసాగింది.

క్రియాశీల పనులు

[మార్చు]

ఇందుతాయ్, బాబూజీ ఇద్దరూ సోషలిస్ట్ పార్టీలో భాగంగా దేశవ్యాప్తంగా అనేక మందితో కలిసిపోయారు. 1949లో సైద్ధాంతిక, రాజకీయ విభేదాల కారణంగా వారు అరుణా అసఫ్ అలీ నాయకత్వంలో సోషలిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్-లెనినిస్ట్)లో భాగమయ్యారు. తర్వాత 1952 లో కమ్యూనిస్టులు అయ్యారు.[3]

బాబూజీ చనిపోయిన తర్వాత ఇందుతాయ్ ఒక యువ వితంతువుగా ఒంటరిగా తన కుటుంబాన్ని పోషించడం కొనసాగించింది, ఈమెకు 1949 సెప్టెంబరు 5న కొడుకు జన్మించాడు ఇతడి పేరు భారత్. ఆమె కమ్యూనిస్ట్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం కొనసాగించింది. ఆమె మహిళా సంస్థలలో నిరంతరం పనిచేసేది, వ్యవసాయ కార్మికుల ఉద్యమం, సామాజిక పనితో సహా ప్రజల ఉద్యమాలను శ్రమించింది. హింసకు వ్యతిరేకంగా, మనుగడ, జీవనోపాధి కోసం పోరాడుతున్న అనేక ఇతర గ్రామీణ మహిళలకు ఆమె ప్రధాన నాయకురాలుగా వ్యవహరించింది.

ఆమె కుమారుడు భరత్ పటాంకర్ ఉద్యమంలో పూర్తి సమయం కార్యకర్తగా మారిన తర్వాత, ఆమె తన కొడుకుకు, భార్య గెయిల్ ఓమ్‌వెడ్‌లకు నైతికంగా, ఆర్థికంగా సహాయం చెంసింది, అలాగే శ్రామిక్ ముత్కీ దళ్ నిర్వహించే ప్రతి కార్యాచరణలో ప్రముఖ పాత్ర పోషించింది.[4] [5]

మూలాలు

[మార్చు]
  1. "Indumati Patankar, freedom fighter dies at 91". Maharashtra Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-07-15. Archived from the original on 2019-12-14. Retrieved 2019-12-14.
  2. "Senior freedom fighter Indumati Patankar passes away". uniindia.com. 14 December 2019. Retrieved 14 December 2019.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. Kulkarni, Seema. "Struggles of the Single and Widowed Women in Sangli District". Archived from the original on 2 April 2015. Retrieved 16 March 2015.
  4. "Life Given to a cause" (PDF). Manushi (20). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2021-10-25.
  5. Gail Omvedt, assisted by Indumati Patankar and Ranjana Kanhere (6–11 April 1981). "Effects of agricultural development on the status of women". International Labour Organization.

బయటి లింకులు

[మార్చు]