ఇంద్రకంటి ఇందిరాబాల
ఇంద్రకంటి ఇందిరాబాల హరికథ కళాకారిణి.[1] ఆమె ఆల్ ఇండియా రేడియో, టెలివిజన్ లలో ఎ1 గ్రేడ్ ఆర్టిస్టు, తిరుపతి తిరుమల దేవస్థాన నాథనెరజాణ, రాష్ట్ర కళా నిరజాణ పురస్కార గ్రహీత.[2]
జననం - వివాహం
[మార్చు]ఇందిరాబాల 1946, మార్చి 3న ఇంద్రకంటి సత్యనారాయణ, శకుంతలమ్మ దంపతులకు చోడవరం[3]లో జన్మించింది. స్వగ్రామైన విశాఖపట్టణం జిల్లా మాడుగులలో ఎనిమిదవ తరగతి వరకు చదువుకున్నారు.
ఇందిరాబాల మేనమామైన హరినాథ్ బాబాతో వివాహం జరిగింది. హరినాథ్ బాబా కుటింబికులు అభ్యంతరం చెప్పినా, దండకారుణ్య ప్రాజెక్టులో ఉన్న టైపిస్టు ఉద్యోగాన్ని వదిలేసి, తన అక్క ఇంటికి వచ్చి కుటుంబానికి అండగా ఉన్నాడు.
కళారంగం
[మార్చు]ఇందిరాబాల తండ్రి సత్యనారాయణ హరికథా కళాకారుడు. ఆరేళ్ళ వయసులో తండ్రి హరికథలు చెపుతుంటే, మధ్యమధ్యలో వచ్చి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తుండేది. పదేళ్ళ వయసులో శ్రీకృష్ణ జననం హరికథ నేర్చుకొని, పన్నెండేళ్ళ వయసులో వడ్డాది శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో తొలి హరికథా గానం చేసింది.
ఇందిరాబాల పదిహేను సంవత్సరాల వయసులోనే తండ్రి గుండెపోటుతో చనిపోవడంతో, కుంటుబ బాధ్యత ఈవిడపై పడింది. తండ్రి వారసత్వంగా వచ్చిన హరికథగానంతో కుటుంబాన్ని పోషించింది.
1965 నుంచి 25 సంవత్సరాలపాటు రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాలలో ఇందిరాబాల హరికథలను చెప్పింది. కోస్తా ప్రాంతంలో ఎక్కడ పండగలు, ఉత్సవాలు, జాతరలు, శుభకార్యాలైనా ఇందిరాబాల హరికథాగానం ఉండితీరాల్సిందే. తన జీవితకాలంలో 25వేల హరికథా ప్రదర్శనలు ఇచ్చింది.
ఇందిరాబాల హరికథ గానాన్ని హరినాథ్ బాబా, సోదరుడు మూర్తి, చెల్లెలు కళ్యాణిలకు కూడా నేర్పించింది. హరినాథ్ బాబా రెండు దశాబ్ధాలపాటు ఎనమిదివేల ప్రదర్శనలు ఇచ్చాడు. కథా గాన కళా చతుర అనే బిరుదును కూడా పొందాడు.
బిరుదులు - సత్కారాలు
[మార్చు]సత్కారాలు
- సువర్ణ కంకణం (చిత్తూరు నాగయ్య చేతుల మీదుగా)
- కళానీరాజనం పురస్కారం (రాష్ట్ర ప్రభుత్వం)
- స్వర్ణ కంకణం (విజయ త్యాగరాజు సంగీత సభ, విశాఖపట్టణం)
బిరుదులు
- నాథభారతి
- హరికథా చూడామణి (శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాక్ష్మీన కళా పరిషత్, విజయనగరం)
మరణం
[మార్చు]ఇందిరాబాల 2012, ఫిబ్రవరి 12న మరణించారు.
మూలాలు
[మార్చు]- ↑ దామెర, వేంకట సూర్యారావు. విశిష్ట తెలుగు మహిళలు. రీమ్ పబ్లికేషన్స్. p. 201. ISBN 978-81-8351-2824.
- ↑ "A.P. EAST" (PDF). bhagavat vikas parishad. 5 (XXXXI): 35. May 2011. Archived from the original (PDF) on 1 ఏప్రిల్ 2015. Retrieved 24 April 2017.
- ↑ "Memories live on". P. Surya Rao. The HIndu. 17 September 2010. Retrieved 24 April 2017.