ఇగురం (కథా సంపుటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇగురం (కథా సంపుటి) పద్నాలుగు కథలతో ప్రచురితమైన పుస్తకం. ఈ పుస్తకంలోని ప్రతీ కథ తెలంగాణ ప్రాంత నెటివిటీని ప్రతిభింబిస్తూనే విశ్వజనీనమైన సామాన్య మధ్యతరగతి మనుషుల వ్యథల్ని ఆవిష్కరిస్తాయి. ఇగురం కథా సంపుటిని గంగాడి సుధీర్ రచించాడు.

34వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనలో ఇగురం పుస్తకావిష్కరణ

ఆవిష్కరణ[మార్చు]

ఇగురం (కథా సంపుటి) పుస్తకాన్ని 34వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనలో 26 డిసెంబర్ 2021న చిందు ఎల్లమ్మ వేదికపై నందిని సిధారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కె. రామచంద్ర మూర్తి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాడు. ఈ పుస్కవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్, టి.సాట్ సి.ఈ.ఓ శైలేష్ రెడ్డి, కవి సిద్ధార్థ, బీసీ కమిసన్ సభ్యుడు సిహెచ్ ఉపేంద్ర, టీడీఎఫ్ అధ్యక్షురాలు కవిత చల్ల పాల్గొన్నారు.[1]

అభినందనలు[మార్చు]

ఇగురం (కథా సంపుటి) పుస్తక రచయిత గంగాడి సుధీర్ రెడ్డి ప్రగతి భవన్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును 27 జనవరి 2022న మర్యాద పూర్వకంగా కలిసాడు. ఈ సందర్బంగా కేసీఆర్ పుస్తక రచయిత గంగాడి సుధీర్ రెడ్డిని అభినందించాడు.[2][3]ఈ పుస్తక రచయితను మంత్రి కేటీఆర్,[4] సబితా ఇంద్రారెడ్డి అభినందించారు.[5]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (26 December 2021). "నిత్యస్ఫూర్తి.. చైతన్య దీప్తి.. హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శన". Archived from the original on 26 December 2021. Retrieved 26 December 2021.
  2. Namasthe Telangana (27 January 2022). "'ఇగురం' రచయిత గంగాడి సుధీర్ రెడ్డిని అభినందించిన సీఎం కేసీఆర్". Archived from the original on 28 జనవరి 2022. Retrieved 28 January 2022. 'ఇగురం' రచయిత గంగాడి సుధీర్ రెడ్డిని అభినందించిన సీఎం కేసీఆర్
  3. Andhrajyothy (21 January 2022). "ఇగురం రచయిత గంగాడి సుధీర్ రెడ్డిని అభినందించిన సీఎం కేసీఆర్". Archived from the original on 28 జనవరి 2022. Retrieved 28 January 2022.
  4. నవతెలంగాణ (8 January 2022). "రచయిత గంగాడి సుధీర్‌ను అభినందించిన మంత్రి కేటీఆర్". Archived from the original on 28 జనవరి 2022. Retrieved 28 January 2022.
  5. Dishadaily (దిశ) (19 January 2022). "ఇగురం కథా రచయితను అభినందించిన మంత్రి సబిత". Archived from the original on 28 జనవరి 2022. Retrieved 28 January 2022.