Jump to content

ఇన్‌వెర్టెడ్ బకెట్ స్టీము ట్రాప్

వికీపీడియా నుండి
ఇన్‌వెర్టెడ్ బకెట్ స్టీము
ఇన్‌వెర్టెడ్ బకెట్ స్టీము

ఇన్‌వెర్టెడ్ బకెట్ స్టీము ట్రాప్ అనునది ఒక స్టీము ట్రాప్. స్టీము ట్రాప్ అనునది స్టీము ఒక రకమైన యాంత్రిక నిర్మాణ నియంత్రణ కవాటం. స్టీము ట్రాప్ అనునది స్టీము, నీటి మిశ్రమం నుండి కేవలం నీటిని వేరుగా వ్యవస్థ నుండి బయటికి వదలి, స్టీమును నిలువరించును.[1]

స్టీము ట్రాప్

[మార్చు]

స్టీము అధిక పీడనం,, ఉష్ణోగ్రత కల్గి వుండును.అందువలన స్టీము ట్రాప్ లు అన్నియు పోత ఇనుము, ఉక్కు,, స్టెయిన్^లెస్ స్టీల చెయ్యబడి వుండును. సాధారణంగా స్టీము ట్రాప్ బాడీ (body) /బాహ్య ఆకృతి భాగాలు పోత ఇనుము, పోత ఉక్కు ( కాస్ట్ స్టీలు) తో చెయ్యబడి వుండును.లోపలి భాగాలు స్టెయిన్‌లెస్ స్టీలుతో చెయ్యబడి వుండును. ఉపయోగించు స్టీము ఎక్కువ పీడనం కల్గి వుండును,, అధిక ఉష్ణోగ్రత కల్గి ఉన్నందున, వాటిని తట్టుకో గల్గిన విధంగా స్టీము ట్రాపుల నిర్మాణం వుండును. అంతే కాదు ద్రవీకరణ చెందిన స్టీము ఎక్కువ ఆమ్ల గుణాన్ని (pH= 6.౦-6.5) కల్గి వుండటం వలన ఎక్కువ కాలం సంపర్కం వలన లోహాన్ని తిని వేయును.కావున వీటిని అన్నింటిని తట్టు గల్గిన విధంగా స్టీము ట్రాపుల నిర్మాణం వుండును.

స్టీము ట్రాప్ అవసరమేమిటి?

[మార్చు]

స్టీము ద్వారా ఇతర పదార్థాలకు ఉష్ణ మార్పిడి జరిగినపుడు, స్టీముకొంత ఉష్ణ శక్తిని కోల్పోయి, దాని ఉష్ణోగ్రత తగ్గును. ఆమేరకు కొంత స్టీము ద్రవంగా మారును.అనగా స్టీము, వేడి నీరుగా పరివర్తన చెందును.ఆవిధంగా ద్రవీకరణ చెందిన స్టీమును కండేన్సేట్ (condensate) అంటారు.ద్రవీకరణ చెందిన స్టీమును అప్పటికప్పుడు తొలగించనిచొ, హీట్ ఎక్స్చేంజరులో నీరు నిలిచి పోవడం వలన స్టీము ప్రసరణ జరుగదు.కావున ఉష్ణమార్పిడి, వినిమయం జరగదు. అందువలన ఏర్పడిన నీటిని తప్పనిసరిగా క్రమబద్దంగా తొలగిస్తూ వుండాలి.ఒక మామూలు వాల్వును పాక్షికంగా తెరచి వుంచి నీటిని బయటకు వదల వచ్చును.కాని స్టీము వాడకంలో హెచ్చు తగ్గుల వలన వాల్వుపని తీరులో ఇబ్బందులు ఉన్నాయి. వాల్వు తక్కువ తెరచివుంచి ఎక్కువ స్టీము వాడిన, నీరు హీటరులో వుండి పోవును. వాల్వు ఎక్కువ తెరచివుండినచో వాల్వునుండి నీటితోపాటు స్టీము బయటకు వెళ్లి పోవును. అలాకాకుండా కేవలం ద్రవీకరణ చెందిన స్టీమును మాత్రమే బయటకు వదిలి, స్టీమును బయటకు రాకుండా నిలువరించు వాల్వు లేదా కవాటమే స్టీము ట్రాప్.

ఇన్వర్టెడ్ బకెట్ స్టీము ట్రాప్

[మార్చు]

ఈ ట్రాపులో బోర్లించిన బకెట్/బాల్చీ వంటి నిర్మాణం ఉండటం వలన ఈ ట్రాపును ఇన్వర్టెడ్ బకెట్ స్టీము ట్రాప్ అంటారు. ఈ స్టీము ట్రాపును నిలువుగా అనగా క్షితిజలంబంగా హీట్ ఎక్సేంజరు యొక్క డిచార్జీ లైనుకు బిగింపబ డివుండును.

ఇన్వర్టెడ్ బకెట్ స్టీము ట్రాప్‌లోని భాగాలు

[మార్చు]
  • 1.బాడీ లేదా కేసింగు
  • 2.బకెట్
  • 3.కవాటం

బాడీ లేదా కేసింగు

[మార్చు]

ఇది సాధారణంగా పోత ఇనుము/కాస్ట్ ఐరన్ తో తయారుచేయబడి వుండును.ఇది గుల్లగా స్తూపాకారంగా వుండును. నిలువుగా వుండి అడుగు భాగాన లోపలికి వుండేలా ఒక చిన్నగొట్టం వుండును. ట్రాపు బాడీ అడు గు భాగానా సాధారణంగా మరలు వుండును. ఆ మరలకు హీట్ ఎక్సుచెంజరు లేదా హీటరు ద్వారా వచ్చు పైపును జోడించెదరు. కొన్ని ట్రాపులకు మరలకు బదులు ఫ్లాంజి వుండును. బాడీ పైభాగాన ఫ్లాంజి వుండును. ఫ్లాంజికి పైకప్పు బిగించి వుండును.ఈ పైకప్పుకే వేడి నీరు బయటకు వెళ్ళు బెజ్జం, దానికి కింద సన్నని రంధ్రం వుండును. దీనిని కవాట రంధ్రం లేదా బెజ్జం అంటారు. ఈ సన్నని రంధ్రం ద్వారానే ట్రాపులోకి వచ్చి న నీరు బయటకు వెళ్ళును. ఈ కవాట రంధ్రాన్ని నిర్గమ నాళరంధ్రం అనవచ్చును.ఈ రంద్ర భాగంలోపల మరలు వుండును. ఈ మరలకు ఒక పైపు బిగించెదరు. కప్పుకు ఉన్న కింద ఒక చిన్న కొక్కెం వంటిది వుండును. దానికి లివరు ఒక కొన భాగం తగిలించి వుండగా, రెండవ కొనను తిరగేసిన బకెట్ అడుగు భాగం కొక్కేనికి తగిలింఛి వుండును, రంధ్రంకి సరిగా కింద వున్న లివరు పైన చిన్న బొడిపె, రంధ్రానికి సరిపడ పరిమాణంలో వుండును.బకెట్ పైకి లేచిన పుడు లివరు పైకి కదిలిఈ బొడిపె వంటిది ఆరిఫిస్/కవాటమార్గాన్ని పూర్తిగా మూసి వేయును. బకెట్ కిందికి దిగినపుడు లివరు కిందికి దిగి రంధ్రం తెరచు కొనును.బాడీ గోడలు మందంగా వుండటం వలన స్టీము ఎక్కువ పీడనంతో బాడీ గోడలను తాకినను ఎటువంటి ఉబ్బంది ఉండదు.

బకెట్

[మార్చు]

అడుగుభాగం మూసి వుండి, ఒక వైపు తెరచి వున్న గుల్లగా వున్న స్తూపాకరంగా వున్న బకెట్ వంటి భాగం. దీనిని సాధారణంగా స్టెయిన్‌లెస్ స్టీలు/తుప్పు పట్టని ఉక్కుతో చేస్తారు. బకెట్ గోడలు పలుచగా వుండును. బకెట్ అంచులు కొద్దిగా బయటికి వంపు వుండిమందంగా వుండును.బకెట్ అడుగు భాగంలో ఒక కొక్కెం వుండును.దిఇనికి లివరు అను కడ్డి అంచును తగిలించేదరు.అంతే కాకుండా ఒక చిన్న రంధ్రం అడుగున ఉండును. దానిని బ్లిడ్ హోల్ (bleed hole) అంటారు.

పనిచేసే విధానం

[మార్చు]

ట్రాపులోనికి ట్రాపుఅడుగు భాగాన వున్న గొట్టం ద్వారా మొదట నీరు లోనికి వచ్చును. బకెట్‌ను బాడి అడుగు భాగాన నిలువుగా ఉన్న ఇన్లేట్ గొట్టంపై బోర్లించిన విధంగా అమర్చివుండును.బకెట్ లోకి నిండిన నీరు బకెట్ నిండిన తరువాత బాడీ అంత నిండి పోవును. ఈ స్థితిలో బకెట్ బాడీ అడుగు భాగాన్ని తాకి వుండటం వలన, ఆరిఫిస్/సన్నని బెజ్జం తెరచుకుని వుండటం వలన, నీరు బయటికి వెళ్ళు రంధ్రాన్ని/అవుట్ లేట్ హోల్‌కు వెళ్లి అక్కడి నుండి దానికి అమర్చిన గొట్టం ద్వారా బయటికి వెళ్ళును.బాడిలోకి నీరు బదులు స్టీము వచ్చినచో, స్టీము నీటికన్న ఎక్కువ పీడనం, వేగం కల్గి ఉన్నందున, స్టీము వేగంగా వచ్చి బకెట్ అడుగు భాగాన్ని తాకి, పీడనం వలన బెకెట్ మొదటి స్థానం నుండి పైకి లేచును.దానివలన లివరు పైకి కదిలి, దాని బొడిపెమ/వాల్వు సన్నని బెజ్జాన్ని/నిర్గమ మార్గం/కవాట బెజ్జాన్ని మూయును.ఆ విధంగా స్టీము బయటికి వెళ్ళకుండా నిరోధింప బడును.మరల నీరు లోపలి రావడం మొదలవ్వగానే నీరు బకెట్ లోని స్టీమును పైకి నెట్టును. బకెట్ అడుగున ఉన్న సన్నని రంద్రము/బ్లీడ్ హోల్ ద్వారా స్టిము బకెట్ నుండి బయటికి వెళ్ళడం వలన బకెట్ మళ్ళి కిందికి దిగి లివరు కిందికి కదలడం వలన కవాట రంధ్రం తెరచుకొని నీరు బయటికి వెళ్ళడం మొదలగును.[2] [3]

ట్రాపును బిగించునపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు

[మార్చు]

ఇన్‌వెర్టెడ్ బకెట్ స్టీము ట్రాప్ బాడీపైన వున్న బాణం గుర్తు చూపించిన విధంగా బిగించాలి.వ్యతిరేక దిశలో బిగించిన పనిచేయదు. ట్రాప్ ను నిలువుగా బిగించాలి.వాలుగా బిగించిన పని చేయదు.

బయటి లింకుల వీడియోలు

[మార్చు]

ఈవ్యాసాలు కూడా చదవండి

[మార్చు]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. "What is a Steam Trap?". tlv.com. Archived from the original on 2017-08-23. Retrieved 2018-03-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "INVERTED BUCKET STEAM TRAPS". armstronginternational.com. Archived from the original on 2016-05-28. Retrieved 2018-03-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Bear Trap Inverted Bucket Steam Traps". bellgossett.com:80. Archived from the original on 2013-09-09. Retrieved 2018-03-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)