Jump to content

బాల్ ఫ్లోట్ స్టీము ట్రాప్

వికీపీడియా నుండి
బాల్ ఫ్లోట్ స్టీము ట్రాప్
బాల్ ఫ్లోట్ స్టీము ట్రాప్
బాల్ ఫ్లోట్ స్టీము ట్రాప్ రెఖా చిత్రం

బాల్ ఫ్లోట్ స్టీము ట్రాప్ అనునది ఒకస్టీము ట్రాప్.స్టీము ట్రాప్ అనునది స్టీము ఒక రకమైన యాంత్రిక నిర్మాణమున్న కవాటం వంటిది.స్టీము ట్రాప్ స్టీము, నీటి మిశ్రమం నుండి కేవలం నీటిని వేరుగా వ్యవస్థ నుండిబయటికి వదలి, స్టీమును నిలువరించును[1].బాల్ ఫ్లోట్ స్టీము ట్రాప్ ను ఫ్లోట్ స్టీము ట్రాప్ అని కూడా అంటారు.

స్టీము ట్రాప్ అనగా నేమి?

[మార్చు]

స్టీము అధిక పీడనం, ఉష్ణోగ్రత కల్గి వుండును.అందువలన స్టీము ట్రాప్ లు అన్నియు పోత ఇనుము, ఉక్కు, స్టెయిన్‌లెస్ స్టీలుతో చెయ్యబడి వుండును. సాధారణంగా స్టీము ట్రాప్ బాడీ (body) /బాహ్య ఆకృతి భాగాలు పోత ఇనుము, పోత ఉక్కు ( కాస్ట్ స్టీలు) తో చెయ్యబడి వుండును.లోపలి భాగాలు స్టెయిన్ లెస్ స్టీలుతో చెయ్య బడి వుండును.ఉపయోగించు స్టీము ఎక్కువ పీడనం కల్గి వుండును, అధిక ఉష్ణోగ్రత కల్గి ఉన్నందున, వాటిని తట్టుకో గల్గిన విధంగా స్టీము ట్రాపుల నిర్మాణం వుండును. అంతే కాదు ద్రవీకరణ చెందిన స్టీము ఎక్కువ ఆమ్ల గుణాన్ని (pH= 6.౦-6.5) కల్గి వుండటం వలన ఎక్కువ కాలం సంపర్కం వలన లోహాన్ని తినివేయును. కావున వీటిని అన్నింటిని తట్టుకో గల్గిన విధంగా స్టీము ట్రాపుల నిర్మాణం వుండును.

బాల్ ఫ్లోట్ స్టీము ట్రాప్

[మార్చు]

ఈ స్టీము ట్రాప్ లోపల గోళాకారంగా, తేలియాడే బంతి వంటిడి ఉండటం వలన ఈ త్రాపును ఫ్లోట్ స్టీము ట్రాపు అంటారు.ఈ ట్రాప్ బహ్యాకారం కూడా గోళాకారంగా వుండును. గోళాకార బాడీ /ఆకృతి నిర్మాణానికి ఒక కవరు బోల్టుల ద్వారా బిగింపబడి వుండును.బాడి పోత ఇనుముతో చెయ్యబడి వుండును.లోపలి ఫ్లోట్ స్టెయిన్‌లెస్ ఉక్కుతో నిర్మితమై వుండును .కొన్ని ట్రాప్‌లలో సిస్టంలోకి, ట్రాపులో జమ అయిన గాలిని బయటికి పంపించు అమరిక వుండును.అలాగే కొన్ని ట్రాపు లలో బయటికి వెళ్ళు నీటి ప్రమాణాన్ని నియంత్రించుటకు నీడిల్ వంటిమరలు వున్న బోల్టు వంటిది వుండును. దానిని బిగించే కొలది బయటికి వచ్చు పరిమాణం తగ్గును.వదులు చేసే కొలది ప్రవాహ వేగం పెరుగును.

బాల్ ఫ్లోట్ స్టీము ట్రాప్‌లోని ప్రధాన భాగాలు

[మార్చు]
  • 1.బాడీ
  • 2.కవరు/మూత
  • 3.ఫ్లోట్
  • 4.ఆరిఫిస్/కవాట రంధ్రం
  • 5.స్టాప్ నాబ్/కవాటం

బాడీ

[మార్చు]

ఇది ఆకృతి గోళాకారంగా వుండి ఒక చివర మూయబడివుండి, రెండవ వైపు రెండవ వైపు బోల్తులతో బిగించుటకు అనుకూలంగా ఫ్లాంజి వంటి నిర్మాణం కల్గివుండును.బాడీ సాధారణంగా పోత ఇనుము లేదా పోత ఉక్కుతో చెయ్యబడి వుండును.ఇది ఖాళీ (గుల్లగా వున్న) గా బంతి వంటి ఆకృతి వున్న నిర్మాణం దీనిలో వ్యవస్థ (హీట్ ఎక్సేంజరు వంటివి) నుండి వచ్చు వేడి నీరు జమ అగును.

కవరు లేదా మూత

[మార్చు]

ఇది కూడా పోత ఇనుము లేదా ఉక్కుతో తయారై వుండును. దీనికే వేడి నీరు+స్టీము వచ్చు రంధ్రం (inlet port), వేడి నీరు బయటకు వెళ్ళు రంధ్రం (outlet port) వుండును.ఈ రెండు రంధ్రాల లోపలి వైపు మరలు వుండును వీటికి పైపులను బిగించెదరు.అంతేకాదు ఫ్లోట్, దానికాడ, కీలుకాడ వంటివి బిగించబడివుండును.

ఫ్లోట్

[మార్చు]

ఫ్లోట్ అనగా ఏదైనా ద్రవం మీద తేలియాడే వస్తువు.ఈ ట్రాప్‌లో ఫ్లోట్ గుండ్రంగా బంతి లావుండును. లోపల గుల్లగా వుండును. గోళాకార ఉపరితలం పై ఒకచివర కాడ/లివరు వంటి నిర్మాణం బిగింపబడి వుండును.ఈ ఫ్లోట్ దాని కాడతో కవరు/ మూతకు ఒక కీలచీల (pivot) కు బిగింపబడి వుండును.కీలు చీల వలన ఫ్లోట్ సులభంగా అపికి కిందికి చాలించ గలదు.ఫ్లోట్ కాడ (stem) కు వున్న వుబ్బుగా వున్నా చిన్న గోలి వంటి భాగం, ట్రాప్ లో నీరు లేనప్పుడుడు, ట్రాప్ నుండి నిరు బయటికి వెళ్ళు రంధ్రాన్ని మూసి వుంచును.

ఆరిఫిస్/నిర్గమ మార్గ రంధ్రం/కవాట బెజ్జం

[మార్చు]

ఆరిఫిస్ అనగా సన్నని లేదాచిన్న రంధ్రం.దీనిని ద్రవ నిర్గమ మార్గ రంధ్రం/లేదా కవాట రంధ్రం అనవచ్చును. నీరు బయటికి వెళ్ళు మార్గానికి (outletway) ఈ కవాట బెజ్జం బిళ్ల మరలచే బిగించి వుండును. ట్రాప్ లో నీరు లేనప్పుడు ఒక నాబ్/కవాటం ఈనిర్గమ మార్గ రంధ్రాన్ని మూసిఉంచును.

కవాట బొడిపె లేదా నాబ్

[మార్చు]

ఇది ఫ్లోట్ కాడకు వున్నకొక్కెం చివర వున్న ఉబ్బైన బొడిపి ఇది మాములుగా ట్రాప్ లో తగినంత మట్టంలో నీరు లేనప్పుడు ఆరిఫిస్/సన్నని నాళాన్ని మూసిఉంచును.

పనిచేయు విధానం

[మార్చు]

స్టీము ట్రాప్ లో నీరు తగినంత జమ కానప్పుడు, ఫ్లోట్ కిందికి దిగి వుండి.కవాట నాబ్/బొడిపె, కవాత బెజ్జాన్ని/ ఆరిఫిస్ ని/సన్నని నాళాన్ని మూసి వుంచును.ట్రాపులో నీరు చేరుతూ మట్టం పెరిగే కొలది ఫ్లోట్, అది తొలగించిన నీటి భారం కన్న ఫ్లోట్ బరువు తక్కువ కావడం వలన ఫ్లోట్ నీటిలో తెలియాడును.నీటి మట్టం పెరిగి ఫ్లోట్ పైకి లేవడం వలన, ఫ్లోట్ కాడకు బిగించిన కవాట నాబ్ కూడా పైకి లేచి, బయటికి వెళ్ళు రంధ్రం నుండి నీరు ప్రవహించును.అదే సమయంలో నీటిమట్టం మీద ఏర్పడిన ఫ్లాష్ స్టీము కల్గించు వత్తిడి వలన నీరు రంధ్రం ద్వారా బయటకు తోయ బడును.ట్రాపులోని నీరు బయటికి వెళ్ళే కొలది, బాడీలో నీటి మట్టం తగ్గి, ఫ్లోట్ కిందికి దిగటం వలన కవాట బొడిపె మళ్ళి కవాట బెజ్జాన్ని/ముఖద్వారాన్ని మూసి వేయును. ఈ విధంగా ఫ్లోట్ లేచినపుడు బయటికి ప్రవాహం వుండి, ఫ్లోట్ కిందికి దిగినపుడు ఆగిపోవును. ఈ చర్య ఇలా వంతులువారిగా జరుగుతు వుండును.ట్రాపులోకి వచ్చు నీటి పరిమాణానికి అనులోమాను పాతంగా ఫ్లోట్ పైకి లెగడం వలన ఫ్లోట్ నుండి క్రమబద్దంగా నిరంతరంగా బయటికి నీటి ప్రవాహం వుండును.ట్రాపు లోకి వేడి నిరు రావడం ఆగి, మట్టం తగ్గినప్పుడు బాల్ కిందికి దిగి నిర్గమరంద్రం/నిర్గమ మార్గాన్ని మూసి వేయును.కొన్ని ట్రాపులలో థెర్మో స్టాటిక్ ఎయిర్ వెంట్ వుండును.ఇది ట్రాపులోకి వచ్చిన గాలిని బయటికి పంపును[2].కొన్నింటీలో థెర్మో స్టాటిక్ ఎయిర్ వెంట్ వదులు, గోలాకార బాడీ పైన ఎయిర్ కాక్ వుండూను[3]

ట్రాపులోని అనుకూల అంశాలు

[మార్చు]

ట్రాపులో చేరుతున్న నీరు ఎప్పటికప్పుడు నిరంతరం బయటికి వెళ్ళును.ఎక్కువ ఉష్ణ దారణ శక్తి కల్గి ఉంది.

అనానుకుల అంశాలు

[మార్చు]

ఎక్కువ సూపరు హిట్ స్థాయి స్టీము వ్యవస్థలో పనిచెయ్యవు.వాటరు హమరింగు వలన ఫ్లోట్ పాడైపోవును.

బాల్ ఫ్లోట్ స్టీము ట్రాప్ తయారు చేయు కొన్ని ఉత్త్పత్తిదారులు

[మార్చు]
  • 1.స్పిరాక్సు సార్కో ఇండియా[4]
  • 2.ఫోర్బెస్ మార్షల్[5]

బయటి లింకుల వీడియోలు

[మార్చు]

ఈవ్యాసాలు కూడా చదవండి

[మార్చు]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. "What is a Steam Trap?". tlv.com. Archived from the original on 2017-08-23. Retrieved 2018-03-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Types of Steam Trap: Ball Float Steam Trap". piping-engineering.com. Archived from the original on 2017-06-30. Retrieved 2018-03-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Steam and Condensate systems - Types of Steam Traps". wermac.org. Archived from the original on 2017-08-25. Retrieved 2018-03-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "Ball Float Steam Traps". spiraxsarco.com. Archived from the original on 2019-03-11. Retrieved 2018-03-19.
  5. "Single Orifice Float Trap". forbesmarshall.com. Retrieved 2018-03-19.[permanent dead link]