ఇమామ్-ఉల్-హక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇమామ్-ఉల్-హక్
ఇమామ్-ఉల్-హక్ (2017)
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1995-12-22) 1995 డిసెంబరు 22 (వయసు 28)[1]
ముల్తాన్,[2] పంజాబ్, పాకిస్తాన్
మారుపేరుఇమామ్
ఎత్తు5 ft 9 in (175 cm)[3]
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్ బ్రేక్
పాత్రటాప్-ఆర్డర్ బ్యాటర్
బంధువులుఇంజమామ్-ఉల్-హక్ (మామ)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 231)2018 మే 11 - ఐర్లాండ్ తో
చివరి టెస్టు2023 24 జులై - శ్రీలంక తో
తొలి వన్‌డే (క్యాప్ 215)2017 18 అక్టోబర్ - శ్రీలంక తో
చివరి వన్‌డే2023 10 సెప్టెంబర్ - ఇండియా తో
తొలి T20I (క్యాప్ 81)2019 మే 5 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2019 8 నవంబర్ - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2012/13Lahore Shalimar
2014/15–2015/16ఖాన్ ల్యాబ్స్
2016/17–2017/18హబీబ్ బ్యాంక్
2019–2022పెషావర్ జాల్మి (స్క్వాడ్ నం. 26)
2019–2023బలూచిస్తాన్
2022సోమర్సెట్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 22 65 73 97
చేసిన పరుగులు 1,474 2,967 4,527 4,089
బ్యాటింగు సగటు 38.78 51.15 41.53 45.43
100లు/50లు 3/8 9/19 11/23 10/27
అత్యుత్తమ స్కోరు 157 151 202* 151
వేసిన బంతులు 12 120 28
వికెట్లు 0 1 0
బౌలింగు సగటు 74.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/4
క్యాచ్‌లు/స్టంపింగులు 18/– 14/– 45/– 22/–
మూలం: Cricinfo, 7 సెప్టెంబర్ 2023

ఇమామ్-ఉల్-హక్ (జననం 1995, డిసెంబరు 22) పాకిస్తానీ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు.[4] శ్రీలంకతో జరిగిన మొదటి వన్డే ఇంటర్నేషనల్ లో, పాకిస్తాన్ తరపున రెండవ బ్యాట్స్‌మన్‌గా,అరంగేట్రంలోనే సెంచరీ చేసిన మొత్తం మీద పదమూడవ బ్యాట్స్‌మన్ గా నిలిచాడు.[5][6] 2018 ఆగస్టులో, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ద్వారా 2018–19 సీజన్ కోసం సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన 33 మంది ఆటగాళ్ళలో ఇతను ఒకడు.[7][8]

దేశీయ క్రికెట్[మార్చు]

2016–17 క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీ ఫైనల్‌లో, హబీబ్ బ్యాంక్ లిమిటెడ్ తరపున బ్యాటింగ్ చేస్తూ 200 పరుగులు చేశాడు.[9] 2017–18 నేషనల్ టీ20 కప్ ఫైనల్‌లో, లాహోర్ బ్లూస్ తరపున 59 నాటౌట్ బ్యాటింగ్ చేశాడు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.[10]

2022 జూలైలో, ఇంగ్లాండ్‌లోని కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో తమ చివరి నాలుగు మ్యాచ్‌లలో ఆడేందుకు సోమర్‌సెట్‌తో సంతకం చేశాడు.[11]

అంతర్జాతీయ క్రికెట్[మార్చు]

2017 అక్టోబరులో, శ్రీలంకతో జరిగిన సిరీస్ కోసం పాకిస్తాన్ వన్డే జట్టులో అతను ఎంపికయ్యాడు.[12] 2017 అక్టోబరు 18న శ్రీలంకతో జరిగిన వన్డే అరంగేట్రంలో, తన వన్డే సెంచరీని సాధించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.[13] సలీమ్ ఇలాహి తర్వాత అరంగేట్రంలోనే వన్డే సెంచరీ చేసిన రెండో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.[14]

2018 మే జరిగిన ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం 2018 ఏప్రిల్ లో పాకిస్తాన్ టెస్టు జట్టులో ఎంపికయ్యాడు. 2018 మే 1న ఐర్లాండ్‌తో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు.[15] [16] మ్యాచ్ చివరి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.[17]

2018 జూలై 20న, జింబాబ్వేతో జరిగిన నాల్గవ వన్డేలో ఫఖర్ జమాన్ తో కలిసి304 పరుగులతో వన్డేలలో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.[18] పాకిస్థాన్ ఒక వికెట్ నష్టానికి 399 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించింది, ఇది వన్డేల్లో శ్రీలంక అత్యధిక స్కోరు.[19] జమాన్, ఇమామ్ సిరీస్‌లో కలిసి 705 పరుగులు చేశారు.[20]

2019 జనవరిలో, దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డే సమయంలో, ఇమామ్ తన 19వ ఇన్నింగ్స్‌లో వన్డేలలో 1,000 పరుగులు చేసిన రెండవ అత్యంత వేగంగా బ్యాట్స్‌మెన్ అయ్యాడు.[21]

2019 ఏప్రిల్ లో, 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు.[22][23] 2019 మే 5న ఇంగ్లాండ్‌పై పాకిస్తాన్ తరపున తన ట్వంటీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు.[24] క్రికెట్ ప్రపంచ కప్‌కు ముందు, ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో, మూడో వన్డే మ్యాచ్‌లో ఇమామ్ 151 పరుగులు చేశాడు. వన్డే ఇంటర్నేషనల్‌లో ఇంగ్లండ్‌పై పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్‌కు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు.[25]

2020 జూన్ లో, కరోనా-19 మహమ్మారి సమయంలో ఇంగ్లాండ్‌లో పాకిస్తాన్ పర్యటన కోసం 29 మంది సభ్యుల జట్టులో ఎంపికయ్యాడు.[26][27] జులైలో, ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ల కోసం పాకిస్థాన్ 20 మంది సభ్యుల జట్టులో అతను షార్ట్‌లిస్ట్ చేయబడ్డాడు.[28][29] 2021 జూలైలో, ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో, వన్డే క్రికెట్‌లో తన 2,000వ పరుగును సాధించాడు.[30]

2022 మార్చిలో, ఆస్ట్రేలియాతో సిరీస్ ప్రారంభ మ్యాచ్‌లో, ఇమామ్ టెస్ట్ క్రికెట్‌లో తన మొదటి సెంచరీని సాధించాడు.[31] రెండో ఇన్నింగ్స్‌లో, మరో సెంచరీని సాధించాడు, టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేసిన పాకిస్థాన్ తరఫున పదో బ్యాటర్ అయ్యాడు.[32]

2023 ఆగస్టు 22న, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన 3 వన్డేల సిరీస్‌లో ప్రారంభ మ్యాచ్‌లో, ఇమామ్ 61 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు, శ్రీలంకలోని హంబన్‌తోటలోని మహీంద రాజపక్స ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, సోరియవేవాలో పాకిస్తాన్ బ్యాటింగ్ లైన్ అంతా కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 142 పరుగుల తేడాతో విజయం సాధించగా, ఇమామ్ అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.[33]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఇతను 1995, డిసెంబరు 22న ముల్తాన్‌లో జన్మించాడు. ఇతను పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ మేనల్లుడు.[34][35] ఇతని పూర్వీకులు[36] 1947లో ప్రస్తుత భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలోని హన్సి నగరం నుండి పాకిస్తాన్‌కు వలస వచ్చారు.

మూలాలు[మార్చు]

  1. "Imam-ul-Haq". Pakistan Cricket Board. Retrieved 22 December 2020.
  2. "Imam-ul-Haq reveals special connection with Multan ahead of West Indies ODIs". Samaa. Retrieved 11 June 2022.
  3. Imam-ul-Haq's profile on Sportskeeda
  4. "Meet the new faces in the Pakistan Test squad". International Cricket Council. Retrieved 22 May 2018.
  5. "Records / One-Day Internationals / Batting records / Hundred on debut". ESPN Cricinfo. Retrieved 19 October 2017.
  6. "Hasan five-for, he debut ton sink Sri Lanka". ESPN Cricinfo. Retrieved 18 October 2017.
  7. "PCB Central Contracts 2018–19". Pakistan Cricket Board. Retrieved 6 August 2018.
  8. "New central contracts guarantee earnings boost for Pakistan players". ESPN Cricinfo. Retrieved 6 August 2018.
  9. "Quaid-e-Azam Trophy, Final: Habib Bank Limited v Water and Power Development Authority at Karachi, Dec 10–15, 2016". ESPN Cricinfo. Retrieved 14 December 2016.
  10. "Final (D/N), National T20 Cup at Rawalpindi, Nov 30 2017". ESPN Cricinfo. Retrieved 30 November 2017.
  11. "Imam-ul-Haq roped in by Somerset County Cricket club". Geo News. Retrieved 4 July 2022.
  12. "Imam-ul-Haq called up to Pakistan's ODI squad". ESPN Cricinfo. Retrieved 6 October 2017.
  13. "3rd ODI (D/N), Sri Lanka tour of United Arab Emirates and Pakistan at Abu Dhabi, Oct 18 2017". ESPN Cricinfo. Retrieved 18 October 2017.
  14. "Imam-ul-Haq becomes 2nd Pakistani to score century on debut". www.geo.tv (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 19 October 2017.
  15. "Only Test, Pakistan tour of Ireland, England and Scotland at Dublin, May 11-15 2018". ESPN Cricinfo. Retrieved 12 May 2018.
  16. "Ireland win toss, opt to bowl in historic Test against Pakistan". Geo TV. Retrieved 12 May 2018.
  17. "Fakhar, Imam receive maiden call-ups to Ireland, England Tests". ESPN Cricinfo. Retrieved 15 April 2018.
  18. "Fakhar Zaman, Imam-Ul-Haq Break All-Time Opening Partnership Record In ODIs". NDTV. Retrieved 20 July 2018.
  19. "Records galore as Pakistan rewrite history in Bulawayo". The Express Tribune. Retrieved 20 July 2018.
  20. "Fakhar Zaman, Imam-ul-Haq march into the record books". International Cricket Council. Retrieved 22 July 2018.
  21. "Imam outpaces Kohli and Azam, reaches 1000 ODI runs". Business Recorder. Retrieved 25 January 2019.
  22. "Mohammad Amir left out of Pakistan's World Cup squad". ESPN Cricinfo. Retrieved 18 April 2019.
  23. "Amir left out of Pakistan's World Cup squad". International Cricket Council. Retrieved 18 April 2019.
  24. "Only T20I, Pakistan tour of England at Cardiff, May 5 2019". ESPN Cricinfo. Retrieved 5 May 2019.
  25. "Imam century powers Pakistan to 358-9 in third ODI against England". Yahoo! Sports. Archived from the original on 14 మే 2019. Retrieved 14 May 2019.
  26. "Haider Ali the new face as Pakistan name 29-man touring party for England". ESPN Cricinfo. Retrieved 12 June 2020.
  27. "Haider Ali named in 29-player squad for England tour". Pakistan Cricket Board. Retrieved 12 June 2020.
  28. "Pakistan shortlist players for England Tests". Pakistan Cricket Board. Retrieved 27 July 2020.
  29. "Wahab Riaz, Sarfaraz Ahmed in 20-man Pakistan squad for England Tests". ESPN Cricinfo. Retrieved 27 July 2020.
  30. "James Vince trumps Babar Azam's 158 as England seal stunning 332 chase". ESPN Cricinfo. Retrieved 13 July 2021.
  31. "Imam-ul-Haq seizes second Australia chance". Shepparton News. Retrieved 4 March 2022.
  32. "Imam, Shafique hit tons as Test ends in tame draw". ESPN Cricinfo. Retrieved 9 March 2022.
  33. "afghanistan-v-pakistan-2023-1392508/afghanistan-vs-pakistan-1st-odi". ESPN Cricinfo. Retrieved 22 August 2023.
  34. "Imam-ul-Haq: Pakistan great Inzamam's nephew hits debut 100 against Sri Lanka". BBC Sport. Retrieved 18 October 2017.
  35. "Imam-ul-Haq set for 'dream' Pakistan Test debut". ESPN Cricinfo. Retrieved 9 May 2018.
  36. "Inzamam-ul-Haq, 28 May 1997". Outlook India. Retrieved 4 February 2020.

బాహ్య లింకులు[మార్చు]