ఇమేజ్ టవర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇమేజ్ టవర్
ఇమేజ్ టవర్ మోడల్
సాధారణ సమాచారం
స్థితినిర్మాణంలో ఉంది
ప్రదేశంరాయదుర్గం, హైదరాబాదు, తెలంగాణ
దేశంభారతదేశం
నిర్మాణ ప్రారంభం2017 నవంబరు 5
పూర్తిచేయబడినది2023
యజమానితెలంగాణ ప్రభుత్వం
సాంకేతిక విషయములు
పరిమాణం16లక్షల చదరపు అడుగులు

ఇమేజ్‌ టవర్‌ అనేది తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా, రాయదుర్గంలో నిర్మించబడుతున్న అతిపెద్ద టవర్.[1] గేమింగ్ రంగానికి ఉన్న భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 945 కోట్ల రూపాయలతో 16లక్షల చదరపు అడుగుల విస్తీరణంలో నిర్మిస్తున్న ఈ ఇమేజ్ టవర్, గేమింగ్ ఇండస్ట్రీకి చిరునామాగా మారనుంది.[2] ఏవీజీసీ రంగానికి సంబంధించి సకల సదుపాయాలను ఒకే గొడుగు కింద అందించడమనేది ఆసియా, ఫసిపిక్‌ దేశాల్లో ఇదే తొలిసారి కావడం ఇక్కడి విశేషం.[3]

రూపకల్పన

[మార్చు]

ఇంటర్నెట్, డేటా వినియోగం రోజురోజుకి పెరుగుతుడడంతోపాటు ఆన్లైన్ గేమ్స్ ఆడేవారు ఎక్కువ అవుతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునే విధంగా గేమ్స్ అభివృద్ధి చేస్తున్న కొత్త కంపెనీలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం గేమింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, రాష్ట్రంలో యానిమేషన్, విజువల్‌ ఎఫెక్ట్స్, గేమింగ్‌ అండ్‌ కామిక్స్‌ (ఏవీజీసీ) పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు గేమింగ్ పాలసీని తీసుకొచ్చి రాయితీలను ప్రకటించింది.[4]

శంకుస్థాపన

[మార్చు]

2017 నవంబరు 5న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క, పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ ఇమేజ్ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమలో రాష్ట్ర రవాణా శాఖామంత్రిపట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.[5]

నిర్మాణం

[మార్చు]

ఏ వైపు నుండి చూసినా ‘టీ’ (ఆంగ్ల అక్షరం) ఆకారంలో కనిపించే విధంగా నిర్మించిన ఈ భవనంలో మోకాప్‌ స్టూడియోలు, ట్రీన్‌మ్యాట్‌ స్టూడియోలు, సౌండ్స్‌ అండ్‌ అక్విస్టిక్‌ స్టూడియోలు, కలర్‌ కోడింగ్‌ అండ్‌ డీఐ స్టూడియోలు, రెండర్‌ ఫారమ్స్, డాటా సెంటర్, హై డెఫినేషన్‌ బ్యాండ్‌ విడ్త్, షేర్డ్‌ సాఫ్ట్‌వేర్‌ సర్వీసెస్‌ తదితర సదుపాయాలు కల్పించారు.[6]

మూలాలు

[మార్చు]
  1. Chronicle, Deccan (2019-11-21). "Hyderabad: Image tower delayed to 2022". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 2019-11-23. Retrieved 2023-03-17.
  2. Telugu, 10TV; naveen (2022-07-31). "Image Tower : యానిమేషన్ గేమింగ్ హబ్‌గా హైదరాబాద్... రూ.945 కోట్లతో ఇమేజ్ టవర్ నిర్మాణం". 10TV Telugu. Archived from the original on 2023-03-17. Retrieved 2023-03-17.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Correspondent, Special (2022-06-28). "World's largest innovation campus takes shape in Hyderabad city". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 2022-06-29. Retrieved 2023-03-17.
  4. IANS (2017-11-05). "Work begins on Rs 946 cr IMAGE Tower in Hyderabad". Business Standard India. Archived from the original on 2017-11-05. Retrieved 2023-03-17.
  5. "అటు చార్మినార్‌.. ఇటు ఇమేజ్‌ టవర్స్‌". Sakshi. 2017-11-06. Archived from the original on 2017-11-06. Retrieved 2023-03-17.
  6. Today, Telangana (2021-11-21). "Hyderabad: IMAGE Tower to be hub of animation, VFX". Telangana Today. Archived from the original on 2021-11-20. Retrieved 2023-03-17.