ఈదీ ఫౌండేషన్
స్థాపన | 1951[1] |
---|---|
వ్యవస్థాపకులు | అబ్దుల్ సత్తార్ ఈది |
కేంద్రీకరణ | అత్యవసర సర్వీసులు, అనాధలు, వికలాంగులు, పునరావాస కేంద్రాలు, విద్య, ఆరోగ్యం, అంతర్జాతీయ సేవా సంస్థలు, బ్లడ్ , రక్త బ్యాంకులు, ఎయిర్ అంబులెన్స్ సర్వీసు, మెరైన్ , కోస్టర్ సర్వీసు. |
కార్యస్థానం | |
సేవా ప్రాంతాలు | Social Welfare, Humanitarianism |
పద్ధతి | విరాళాలు , గ్రాంటులు |
ముఖ్యమైన వ్యక్తులు | అబ్దుల్ సత్తార్ ఈది, co-founder and co-chair Bilquis Edhi |
నినాదం | "Live and help live" [2][3] |
జాలగూడు | edhi.org |
ఈదీ ఫౌండేషన్ పాకిస్తాన్ లోని ఫలాపేక్ష లేని సామాజిక సంక్షేమ సంస్థ. దీనిని అబ్దుల్ సత్తార్ ఈది.[4] 1951 లో స్థాపించాడు. ఆయన 2016 జూలై 8న తన మరణం వరకూ ఆ సంస్థకు అధిపతిగా యున్నాడు,. అతని భార్య, విల్‌క్విస్, ఒక నర్సు పిల్లల దత్తత సర్వీసులను పర్యవేక్షిస్తుంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం పాకిస్తాన్ లోని కరాచీ నగరం.
ఈ సంస్థ పాకిస్తాన్ దేశ వ్యాప్తంగా 24 గంతలు అత్యవసర సేవలనను అందిస్తుంది. ఈ సంస్థ పునరావాస కేంద్రాలు, ఉచిత వైద్యశాలలు, వైద్య సహాయం, డ్రగ్ రీహాబిటేషన్ సర్వీసులు, జాతీయ, అంతర్జాతీయ అత్యవసర సేవలను అందిస్తుంది. ఈ సంస్థ ప్రధానంగా అత్యవసర సేవలు, అనాథలు, వికలాంగులైన వారు, పునరావాసం, విద్య, వైద్యం, అంతర్జాతీయ సేవా సంస్థలు, బ్లడ్, డ్రగ్ బ్యాంకులు, ఎయిర్ అంబులెన్స్ సర్వీసులు, మరైన్ అండ్ కోస్టల్ సర్వీసులపై ప్రధాన దృష్టి పెడుతుంది.
చరిత్ర
[మార్చు]ఈదీ 1957లో తన మొదటి సంక్షేమ కేంద్రాన్ని స్థాపించాడు. అది ఈదీ ట్రస్టుగా అప్పటికి ఉండేది.[5] అది ఒక వ్యక్తితో నిర్వహించబడుతూ ఒక గదిలో ప్రారంభించబడి ప్రస్తుతం ఈదీ ఫౌండేషనుగా మారింది. ఈ సంస్థ దేశ వ్యాప్తంగా 300 కేంద్రాలను స్థాపించింది. ఈ కేంద్రాలు పెద్ద నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో కూడా ఉన్నాయి. ఈ కేంద్రాలు వైద్య సహాయం, కుటుంబ నియంత్రణ, అత్యవసర వైద్య సేవలను అందిస్తుంది. వారికి దూర ప్రాంతాలవారికి సేవలందించడానికి స్వంత అంబులెన్సులు, ఉన్నాయి.
కరాచీలో ఈదీ ఫౌండేషన్ 8 ఆసుపత్రులను నెలకొల్పి ఉచిత వైద్య సేవలనందిస్తుంది. వీటిలో ఉచిత వైద్యశాలలు, కంటి ఆసుపత్రులు, డయాబెటిక్ సెంటర్లు, సర్జికల్ యూనిట్లు, నాలుగు పడకల కేన్సర్ ఆసుపత్రి, మొబైల్ వైద్యశాలలు ఉన్నాయి. అదనంగా ఈ సంస్థ బ్లడ్ బ్యాంకులు కరాచీలో నెలకొల్పింది. ఇతర ఈదీ సర్వీసులకు ఉద్యోగులు, వాలంటిర్లు నడుపుతున్నారు. ఈ ఫౌండేషన్ న్యాయ సేవా విభాగాన్ని కలిగి ఉండి ఉచిత సేవలనందిస్తుంది. ఈ విభాగం జైళ్లలో ఉన్న అమాయక పౌరులకు విడుదల చేసేందుకు కృషి చేస్తుంది. జైళ్లలో ఉన్న వారికి కమిషన్ డాక్టర్లు సందర్శించి ఆహారాన్ని యితర సహాయాన్ని అందిస్తుంటారు. ఆ సంస్థకు 15 "అప్నా ఘర్" (మన యిల్లు) గృహాలు మానసిక వికలాంగులకు, తప్పిపోయిన పిల్లలకు సేవలందించడానికి ఉన్నాయి.
ఈ సంస్థ విద్యా పథకాలను, బోధన, పఠనం మరియూ లేఖనం కార్యక్రమాలు, ఒకేషనల్ కార్యక్రామలైన డ్రైవింగ్, ఫార్మసీ అంరియు పారా-మెడికల్ శిక్షణను అందిస్తుంది. ఈదీ ఫౌండేషన్ వివిధ దేశాలలో శాఖలను కలిగియుంది. ఈ సంస్థ యు.ఎస్.ఎ., యు.కె, కెనడా, జపాన్, బంగ్లా దేశ్ లలో ప్రజలకు సహాయాన్నందిస్తుంది. 1991లో గల్ఫ్ యుద్ధం బాదితులకు సహాయాన్నందిస్తుంది. ఇరాన్, ఈజిప్టు దేశాలలో భూకంప బాధితులకు సహాన్నందించింది. ఈ సంస్థ 1997 నుండి " అతి పెద్ద లాలంటీర్ అంబులెన్స్ ఆర్గనైజేషన్"గా గిన్నిస్ రికార్డు పొందింది.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Edhi". Archived from the original on 24 ఫిబ్రవరి 2015. Retrieved 24 February 2015.
- ↑ "About Edhi Foundation". edhi.org. Archived from the original on 25 జూన్ 2014. Retrieved 10 జూలై 2016.
- ↑ "Major Features of Edhi Foundation". Retrieved 24 February 2015. [start quote] Edhi Foundation ... modifies the catchphrase “Live and Let Live” by “Live and Help Live”, which means Edhi guides others ... [stop quote]
- ↑ Julie McCarthy (July 28, 2009). "Pakistan Philanthropist Cares For Karachi's Forgotten". NPR. Retrieved 21 August 2014.
- ↑ Boone, Jon (2015-04-01). "'They call him an infidel': Pakistan's humble founder of a charity empire". The Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0261-3077. Retrieved 2016-03-28.
- ↑ Craig Glenday, ed. (2010). Guinness World Records 2010. Bantam Books. p. 237. ISBN 9780553593372.