ఉండవల్లి శ్రీదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉండవల్లి శ్రీదేవి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - 2024 ఫిబ్రవరి 26
ముందు తెనాలి శ్రావణ్ కుమార్
నియోజకవర్గం తాడికొండ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1969
తాడికొండ, గుంటూరు జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం
ఇతర రాజకీయ పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు ఉండవల్లి సుబ్బారావు , వరలక్ష్మి
జీవిత భాగస్వామి డా.కమ్మెల శ్రీధర్
నివాసం తాడికొండ, గుంటూరు జిల్లా
వృత్తి రాజకీయ నాయకురాలు

ఉండవల్లి శ్రీదేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

ఉండవల్లి శ్రీదేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, తాడికొండ లో 1969లో జన్మించింది. ఆమె 1993లో బెంగళూరు ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆమె తండ్రి ఉండవల్లి సుబ్బారావు 1978లో తాడికొండ నుంచి రెడ్డి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా పోటీ గెలుపొందాడు, తల్లి వరలక్ష్మి ఉపాధ్యాయురాలు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి 2017లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, తాడికొండ నియోజకవర్గం వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్తగా పని చేసి, నియోజకవర్గంలో వైద్య శిబిరాలు, రాజన్న క్యాంటీన్‌ లాంటి కార్యక్రమాలతో ప్రజకు చేరువైంది..డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తెనాలి శ్రావణ్‌కుమార్ పై 4433ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టింది.[2] 23 మార్చి 2023న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాసింగ్ ఓటింగ్‌కు పాల్పడ్డందనే ఆరోపణలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 24 మార్చి 2023న పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.[3][4] ఆమె డిసెంబర్ 15న తెలుగుదేశం పార్టీలో చేరింది.[5]

ఉండవల్లి శ్రీదేవి వైసీపీని వీడి టీడిపికి మద్దతుగా ఉండడంతో వైఎస్సార్సీపీ వేసిన పిటిషన్‌తో ఆ పార్టీని వీడిన ఆమెపై అనర్హత వేటు వేస్తూ 2024 ఫిబ్రవరి 26న స్పీకర్‌ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నాడు.[6][7]

ఉండవల్లి శ్రీదేవి ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి బాపట్ల లో‍క్‍సభ టికెట్ ఆశించగా దక్కలేదు. ఆమె ఆ తరువాత  2024 ఏప్రిల్ లో తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధిగా,  2024 నవంబర్ 9న ఆంధ్ర ప్రదేశ్ మాదిగ వెల్ఫేర్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా నియమితురాలైంది.[8][9]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (5 April 2019). "తాడికొండతో...తరాల అనుబంధం". Archived from the original on 4 జనవరి 2022. Retrieved 4 January 2022.
  2. Sakshi (29 March 2019). "జనం నాడి తెలిసింది". Sakshi. Archived from the original on 11 July 2021. Retrieved 11 July 2021.
  3. Sakshi (2019). "Tadikonda Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 11 July 2021. Retrieved 11 July 2021.
  4. Andhra Jyothy (24 March 2023). "ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్". Archived from the original on 24 March 2023. Retrieved 24 March 2023.
  5. Andhrajyothy (15 December 2023). "టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి". Archived from the original on 1 July 2024. Retrieved 1 July 2024.
  6. NT News (27 February 2024). "ఏపీలో 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
  7. Eenadu (27 February 2024). "8 మంది ఏపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
  8. Eenadu (10 November 2024). "ఏపీలో పదవుల పండగ". Archived from the original on 10 November 2024. Retrieved 10 November 2024.
  9. Eenadu (10 November 2024). "సేవకు సలాం". Archived from the original on 10 November 2024. Retrieved 10 November 2024.

వెలుపలి లంకెలు

[మార్చు]