ఉగ్రరూపం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉగ్రరూపం
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.రోసిరాజు
తారాగణం శారద,
శివకృష్ణ,
విజ్జి
నిర్మాణ సంస్థ జయభారతీ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఉగ్రరూపం 1984లో విడుదలైన ఒక తెలుగు సినిమా.

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకుడు: ఎం.రోసిరాజు
  • మాటలు: పైడిపల్లి రవీంద్రబాబు
  • సంగీతం: సత్యం
  • ఛాయాగ్రహణం: వి.లక్ష్మణ్
  • నిర్మాత: ఎస్.ఆర్.హనుమంతరావు

కథ[మార్చు]

ఎస్.ఐ. అర్జునరావు నిజాయితీ గల ఒక పోలీస్ ఉద్యోగి. అతని భార్య సుభద్ర దైవభక్తి పరాయణురాలు. వారి కొడుకు విజయ్ అభ్యుదయ భావాలు కల యువకుడు. అయితే అంధుడు. రౌడీ పిల్ల రేఖ ఒకసారి ఎస్.ఐ.కి తారసపడి సుభద్ర అభిమానాన్ని చూరగొని వాళ్ళింట్లోకి ప్రవేశిస్తుంది. విజయ్, రేఖలు ప్రేమించుకుంటారు. విజయ్‌కు చూపు రావడానికి ఆపరేషన్ చేయాలంటే 25 వేల రూపాయలు ఖర్చు అవుతుందని డాక్టర్ చెబుతాడు. ఇంతలో కిల్లర్ కింగ్స్‌ను పట్టుకున్నవారికి ప్రభుత్వం 25 వేల రూపాయల బహుమతి ప్రకటిస్తుంది. అర్జునరావు శాయశక్తులా కష్టపడి కిల్లర్ కింగ్స్‌ను పట్టుకుని బహుమతి సంపాదిస్తాడు. విజయ్‌కు విజయవంతంగా శస్త్రచికిత్స జరిగి ఇంటికి తిరిగి వచ్చేసరికి కిల్లర్ కింగ్స్ ముఠా వాళ్ళు అర్జునరావును దారుణంగా హత్యచేస్తారు. "నా కుంకుమ చెరిగి నీళ్ళలో కలిసేలోగా హంతకులను తెచ్చి నా కాళ్ళముందు పడేయాలి" అని సుభద్ర విజయ్‌ను ఆదేశిస్తుంది. విజయ్ రేఖ సహాయంతో హంతకులను వేటాడతాడు.[1]

మూలాలు[మార్చు]

  1. వి (7 September 1984). "చిత్రసమీక్ష: ఉగ్రరూపం". ఆంధ్రపత్రిక దినపత్రిక. Retrieved 7 November 2018.[permanent dead link]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఉగ్రరూపం&oldid=3902174" నుండి వెలికితీశారు