ఉప్పల లక్ష్మణరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉప్పల లక్ష్మణరావు నవల రచయితగా, అనువాదకునిగా సుప్రసిద్ధుడు. ఆయన నేటి ఒడిషా రాష్ట్రంలోని బరంపురంలో 1898లో జన్మించారు.

వృత్తి-వ్యక్తిగత జీవితం[మార్చు]

ఉప్పల లక్ష్మణరావు కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని వ్యక్తిగతంగా నమ్మి తదనుగుణమైన కృషి సాగించారు. మాస్కోలో ప్రగతి ప్రచురణాలయంలో రష్యన్ సారస్వాన్ని అనువదించారు. రష్యన్-తెలుగు నిఘంటువు తయారుచేశారు. వీరు స్విట్జర్లాండ్ కు చెందిన మహిళ మెల్లీని వివాహం చేసుకున్నారు. రష్యా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చాకా బరంపురంలో "వికాసం" అనే సాహిత్యసంస్థతో అనుబంధాన్ని కొనసాగిస్తూ 1985లో మరణించారు.

సాహిత్య రంగం[మార్చు]

లక్ష్మణరావు "అతడు-ఆమె" నవల రచన ద్వారా తెలుగు నవల రంగంలో కీర్తిని ఆర్జించారు. మూడు భాగాలుగా ఉండే ఈ నవల భారతస్వాతంత్ర్య పోరాటాన్ని చిత్రీకరించే చారిత్రిక నవల. ఈ నవల పాఠకుల ఆదరణతో పాటుగా విమర్శకుల ప్రశంసలు కూడా పొంది లక్ష్మణరావును రచయితగా సుపరిచితుల్ని చేసింది.

రచనలు[మార్చు]

లక్ష్మణరావు "బతుకు పుస్తకం" పేరిట తన ఆత్మకథను రచించారు. ఉద్యోగబాధ్యతల్లో భాగంగా రష్యాలో దాదాపు 40 రష్యన్ గ్రంథాలను సరళమైన తెలుగులోకి అనువాదం చేశారు.[1]

రచనల విశిష్టత[మార్చు]

ప్రాచుర్యం[మార్చు]

ఉప్పల లక్ష్మణరావు రచించిన "అతడు-ఆమె" నవలను పలు సాహితీసంస్థలు, పత్రికలు విడుదల చేసిన "చదవవలసిన తెలుగు పుస్తకాల జాబితా"ల్లో చోటుచేసుకుంది. మాలతీచందూర్ వంటి సాహితీవేత్తలు వివిధ శీర్షికల్లో ఈ పుస్తకాన్ని పాఠకులకు పరిచయం చేశారు. చారిత్రిక నవలగా, నవలగా తెలుగు నవలా వికాసంలో కీలకమైన రచనగా "అతడు-ఆమె" తద్వారా గ్రంథకర్త ఉప్పల లక్ష్మణరావు సాహిత్యచరిత్రలో స్థానం సంపాదించారు.[2][3]

పురస్కారాలు[మార్చు]

  • 1983 - అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం[4].

మూలాలు[మార్చు]

  1. తెలంగాణా విముక్తి పోరాట కథలు
  2. 100 చదవవలసిన తెలుగు పుస్తకాల జాబితా: సాక్షి ఫన్ డే 100 సంచికల ప్రత్యేక సంచిక
  3. నవలామంజరి:మాలతీచందూర్ నవలా పరిచయ వ్యాసాల సంకలనం
  4. పెనుగొండ లక్ష్మీనారాయణ (1 January 2020). గుంటూరు సీమ సాహిత్య చరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం. pp. 282–283.