ఉప్పాల వెంకటరత్తయ్య
Jump to navigation
Jump to search
ఉప్పాల వెంకటరత్తయ్య ప్రముఖ రంగస్థల నటులు.
రంగస్థల ప్రస్థానం
[మార్చు]1947లో రంగస్థల ప్రవేశం చేశారు. 45 సంవత్సరాల నాటకరంగ జీవితంలో 25 నాటకాల్లో దాదాపుగా 45 పాత్రలు ధరించారు. ప్రముఖ రంగస్థల నటులైన మాధవపెద్ది, పులిపాటి వెంకటేశ్వర్లు, అద్దంకి శ్రీరామమూర్తి, మల్లాది వెంకట కృష్ణమూర్తి, అబ్బూరి వరప్రసాదరావు, పీసపాటి నరసింహమూర్తి, షణ్ముఖి ఆంజనేయ రాజు వంటి వారితో కలిసి నటించారు.
రాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్, గంగావతి, ముంబాయ్, షోలాపూర్, టాటానగర్, మద్రాస్, బెంగళూరు, రామనగరం, జగదల్‌పుర్, మధురై, రాజపాళయం మొదలైన ప్రాంతాలలో ప్రదర్శనలు ఇచ్చారు.
నటించిన నాటకాలు - పాత్రలు
[మార్చు]- నాయకురాలు - బాలచంద్రుడు
- కురుక్షేత్రం - అశ్వత్థామ, అర్జునుడు, కర్ణుడు, ధర్మరాజు
- మాయాబజార్ - అభిమన్యుడు
- వీరాభిమన్యు - అభిమన్యుడు
- ఆనాడు - పృథ్వీరాజు
- గయోపాఖ్యానం - గయుడు, ధర్మరాజు
- రామాంజనేయ యుద్ధం - యయాతి, లక్ష్మణుడు
- భూకైలాస్ - శంకరుడు
- సతీసావిత్రి - సత్యవంతుడు, అశ్వపతి
- హరిశ్చంద్ర - విశ్వమిత్రుడు
- మోహినీభస్మాసుర - శంకరుడు
- మహారధికర్ణ - అర్జునుడు
- సక్కుబాయి - శ్రీకృష్ణుడు
- పాదుక - వశిష్టుడు
- చింతామణి - దామోదరుడు
- బొబ్బిలి - ధర్మరాయుడు
సన్మానాలు
[మార్చు]- వేమూరి గగ్గయ్య జమంతిరోజు కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా సన్మానం
- హైదరాబాద్ త్యాగరాయ గానసభలో సినీనటి జమున చేతుల మీదుగా సన్మానం
- హైదరాబాద్ రవీంద్రభారతిలో సి. నారాయణరెడ్డి చేతుల మీదుగా సన్మానం
- హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో సినీ దర్శకులు ఇ.వి.వి. సత్యనారాయణ చేతుల మీదుగా సన్మానం
- ఢిల్లీలో లక్ష్మిరఘురామ్ చేతుల మీదుగా సన్మానం
అవార్డులు
[మార్చు]- అక్కినేని నాగేశ్వరావు చేతుల మీదుగా 'అద్దంకి' అవార్డు ప్రదానం
మూలాలు
[మార్చు]- ఉప్పాల వెంకటరత్తయ్య, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 263.