Jump to content

ఉమర్ గుల్

వికీపీడియా నుండి
ఉమర్ గుల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఉమర్ గుల్
పుట్టిన తేదీ (1982-10-15) 1982 అక్టోబరు 15 (వయసు 42)
పెషావర్, పాకిస్తాన్
ఎత్తు1.91 మీ. (6 అ. 3 అం.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
పాత్రబౌలర్
బంధువులుఅబ్బాస్ అఫ్రిది (మేనల్లుడు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 175)2003 ఆగస్టు 20 - బంగ్లాదేశ్ తో
చివరి టెస్టు2013 ఫిబ్రవరి 14 - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 145)2003 ఏప్రిల్ 3 - జింబాబ్వే తో
చివరి వన్‌డే2013 మార్చి 15 - దక్షిణాఫ్రికా తో
తొలి T20I (క్యాప్ 21)2007 సెప్టెంబరు 4 - Kenya తో
చివరి T20I2016 జనవరి 17 - న్యూజీలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2001/02–2005/06Pakistan International Airlines
2003/04–2011/12Peshawar
2006/07–2018/19హబీబ్ బ్యాంక్
2008కోల్‌కతా నైట్‌రైడర్స్
2008/09North-West Frontier
2008/09వెస్టర్న్ ఆస్ట్రేలియా
2011ససెక్స్
2012/13–2014/15Islamabad Leopards
2013/14Habib Bank
2014ఖైబర్ పఖ్తూన్వా
2015/16–2018/19ఇస్లామాబాదు
2016–2017క్వెట్టా గ్లేడియేటర్స్
2016–2020/21బలూచిస్తాన్
2017–2018/19Sindh
2018Multan Sultans
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ట్వంటీ20 ఫక్లా
మ్యాచ్‌లు 47 130 60 125
చేసిన పరుగులు 577 457 165 1,748
బ్యాటింగు సగటు 9.94 9.72 9.16 12.05
100లు/50లు 0/1 0/0 0/0 0/3
అత్యుత్తమ స్కోరు 65* 39 32 65*
వేసిన బంతులు 9,599 6,064 1,203 22,134
వికెట్లు 163 179 85 479
బౌలింగు సగటు 34.06 29.34 16.97 25.53
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 4 2 2 27
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 3
అత్యుత్తమ బౌలింగు 6/135 6/42 5/6 8/78
క్యాచ్‌లు/స్టంపింగులు 11/– 17/– 18/– 29/–
మూలం: Cricinfo, 16 October 2020

ఉమర్ గుల్ (జననం 1982, అక్టోబరు 15[1][2]) పాకిస్తానీ క్రికెట్ కోచ్, మాజీ క్రికెటర్. క్వెట్టా గ్లాడియేటర్స్ ప్రస్తుత బౌలింగ్ కోచ్ గా, పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు తాత్కాలిక బౌలింగ్ కోచ్ గా ఉన్నాడు.[3] గుల్ 2009 ఐసీసీ వరల్డ్ ట్వంటీ20ని గెలుచుకున్న పాకిస్తాన్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు, 2007 టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచాడు, అందులో అతను అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు కూడా.

పాకిస్తానీ క్రికెట్ జట్టు కోసం కుడిచేతి ఫాస్ట్ మీడియం బౌలర్‌గా ఆట మూడు ఫార్మాట్‌లను ఆడాడు.[4][5]

ట్వంటీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఉమర్ గుల్ 74 అవుట్‌లతో సయీద్ అజ్మల్ తర్వాతి స్థానంలో ఉన్నాడు.[6][7] 2013 సంవత్సరపు ట్వంటీ20 అంతర్జాతీయ ప్రదర్శనను గెలుచుకున్నాడు.[8]

2020 అక్టోబరు 16న, 2020–21 నేషనల్ టీ20 కప్ చివరి గ్రూప్-స్టేజ్ మ్యాచ్ తర్వాత, గుల్ ఇరవై ఏళ్ళ కెరీర్‌లో అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు.[9][10]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

గుల్ 1982, అక్టోబరు 15న[11] పాకిస్తాన్‌లోని పెషావర్‌లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తరచుగా టేప్ బాల్ క్రికెట్ ఆడేవాడు. అద్భుతమైన బౌలింగ్ చూసి అతని స్నేహితులు అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదగాలని ప్రోత్సహించారు.

2010 అక్టోబరులో, గుల్ దుబాయ్‌కి చెందిన డాక్టర్‌ని వివాహం చేసుకున్నాడు.[12][13][14] పాకిస్తాన్ ఆర్మీ కమాండోలు పెషావర్‌లోని ఉమర్ గుల్ ఇంటిపై పొరపాటున దాడిచేసి, వాంటెడ్ మిలిటెంట్‌ను దాచారనే ఆరోపణలపై ఇతని సోదరుడు మీరజ్ గుల్‌ను అరెస్టు చేశారు. అయితే, ఆ తర్వాత కమాండోలు మీరాజ్‌కు క్షమాపణలు చెప్పారు.[15]

క్రికెటర్ అబ్బాస్ అఫ్రిది ఇతని మేనల్లుడు.[16][17]

కోచింగ్ కెరీర్

[మార్చు]

2022 ఏప్రిల్ లో, 15 రోజులపాటు కొనసాగిన శిక్షణా శిబిరం కోసం ఆఫ్ఘనిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు గుల్‌ను బౌలింగ్ సలహాదారుగా నియమించింది.[18][19][20] 2022 మే లో, ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ కోచ్‌గా శాశ్వత కాంట్రాక్ట్ ఇవ్వబడింది, 2022 కాంట్రాక్ట్ చివరి వరకు కొనసాగింది.[21][22] [23] 2023, మార్చి 15న, గుల్ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కోసం పాకిస్తానీ క్రికెట్ జట్టుకు తాత్కాలిక బౌలింగ్ కోచ్‌గా నియమించబడ్డాడు.[24]

మూలాలు

[మార్చు]
  1. "Umar Gul". ESPNCricInfo.
  2. "Umar Gul on his actual Date of birth". Twitter (in ఇంగ్లీష్). Retrieved 2022-10-15.
  3. "Umar Gul appointed Quetta Gladiators bowling coach".
  4. "Umar Gul", ESPNcricinfo, 5 April 2012, retrieved 5 April 2012
  5. "Profile: Umar Gul", CricketArchive, 5 April 2012, retrieved 5 April 2012
  6. "T20I-Most wickets in career", ESPNcricinfo, 2 October 2012, retrieved 2 October 2012
  7. NDTVSports.com. "Umar Gul needs at least a month to recover after knee surgery – NDTV Sports".
  8. MidDay (13 December 2013). "ICC Annual Awards: Pujara wins 'Emerging Cricketer of the Year, Clarke wins 'Cricketer of the Year'". Retrieved 13 December 2013.
  9. "PCB congratulates Umar Gul on a successful career". Pakistan Cricket Board. Retrieved 16 October 2020.
  10. "Umar Gul retires from all forms of cricket". ESPN Cricinfo. Retrieved 16 October 2020.
  11. "Umar Gul posts epic tweet after fans flood former Pakistan pacer with wishes on his 'wrong' birthday". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-04-15. Retrieved 2022-10-15.
  12. Pakistani pace bowler Umar Gul marries Dubai doctor, Gulf News, 10 October 2010, retrieved 5 April 2012
  13. Pace bowler Umar Gul marries Dubai doctor, PakTribune, 10 October 2010, archived from the original on 5 మార్చి 2016, retrieved 5 April 2012
  14. Pace bowler Umar Gul marries Dubai doctor, Daily Times, 10 October 2010, retrieved 5 April 2012
  15. "Army raids Umar Gul's house; arrests his brother". The Times of India. 30 May 2012. Archived from the original on 26 January 2013.
  16. Shah, Sreshth (3 March 2021). "Babar Azam, Mohammad Nabi and Abbas Afridi make it 13 in 13 for the chasing side". ESPN Cricinfo. Retrieved 5 March 2021.
  17. H. Khan, Khalid (4 March 2021). "Nabi, Babar on song as Kings thump Zalmi by six wickets". Dawn News. Retrieved 5 March 2021.
  18. "Umar Gul appointed Afghanistan bowling coach". Pakistan Cricket Board. Retrieved 2 April 2022.
  19. "Former Pakistan pacer Umar Gul appointed bowling coach of Afghanistan cricket team". Times Now News. Retrieved 2 April 2022.
  20. "Afghanistan sign up Younis Khan and Umar Gul as coaches for Abu Dhabi training camp". ESPNcricinfo. Retrieved 2022-06-20.
  21. "Former Pakistan pacer Umar appointed Afghanistan bowling coach". Daily Times. 2022-05-27. Retrieved 2022-06-20.
  22. "Umar Gul named Afghanistan bowling coach". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2022-06-20.
  23. "Pakistan legend Umar Gul joins Afghanistan as bowling coach". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 2022-06-20.
  24. "Abdur Rehman to be Pakistan's head coach for Afghanistan T20Is; Umar Gul named bowling coach". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-03-16.

బాహ్య లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఉమర్_గుల్&oldid=4230281" నుండి వెలికితీశారు