Jump to content

ఎం. సత్యనారాయణరావు

వికీపీడియా నుండి
మేనేని సత్యనారాయణరావు
ఎం. సత్యనారాయణరావు


ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మాజీ మంత్రి
పదవీ కాలం
2004 – 2007

వ్యక్తిగత వివరాలు

జననం 1934
వెదిర గ్రామం, రామడుగు మండలం, కరీంనగర్ జిల్లా
మరణం 26 ఏప్రిల్, 2021
హైదరాబాదు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
సంతానం 4, ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు
నివాసం హైదరాబాదు, తెలంగాణ
వృత్తి రాజకీయ నాయకుడు

ఎం. సత్యనారాయణరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ చైర్మన్‌గా, దేవాదాయశాఖ మంత్రిగా పనిచేశాడు.[1][2]

జననం

[మార్చు]

మేచినేని సత్యనారాయణరావు 1934లో కరీంనగర్ జిల్లా, రామడుగు మండలం, వెదిర గ్రామంలో జన్మించాడు.​

రాజకీయ జీవితం

[మార్చు]

1969 ప్రత్యేక తెలంగాణ పోరాటంలో అతను కీలక పాత్ర పోషించాడు. చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి తరఫున 1971లో కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యాడు. 1977లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో, 1980లో జ‌రిగిన మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల్లో క‌రీంన‌గ‌ర్ లోక్‌స‌భ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసి ఎంపీగా గెలిచాడు.[3] అతను వరుసగా 3 పర్యాయాలు ఎంపీగా గెలిచాడు. 1980-83 వరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. 1985-88 వరకు సుప్రీం కోర్టులో సీనియర్‌ కౌన్సిల్‌గా పనిచేశాడు. 1990-1994 వరకు ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. 2000-2004 మధ్య పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఉమ్మడి రాష్ట్రంలో 2004లో కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి, వైఎస్ఆర్ మంత్రివర్గంలో 2004 నుంచి 2007 వరకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. 2006లో కెసిఆర్‌ను సవాల్‌ చేసి కరీంనగర్‌ పార్లమెంట్ ఉప ఎన్నికకు కారణమయ్యాడు. ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీతో కెసిఆర్‌ గెలవడంతో ఆ తర్వాత మంత్రి పదవికి అతను రాజీనామా చేశాడు. 2007-2014 వరకు ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌గా రెండవసారి బాధ్యతలు నిర్వహించాడు.[4][5]

మరణం

[మార్చు]

అతను కోవిడ్ లక్షణాలతో నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2021, ఏప్రిల్ 26న మరణించాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (27 April 2021). "Rip MSR: మాజీ మంత్రి ఎమ్మెస్సార్‌ కన్నుమూత". www.eenadu.net. Archived from the original on 27 ఏప్రిల్ 2021. Retrieved 27 April 2021.
  2. Sakshi (27 April 2021). "కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎం. సత్యనారాయణరావు అరుదైన ఫోటోలు". Sakshi. Archived from the original on 27 ఏప్రిల్ 2021. Retrieved 27 April 2021.
  3. "ఎమ్మెస్సార్ తొలి నుంచి తెలంగాణ పిపాసే!". Namasthe Telangana. 27 April 2021. Archived from the original on 27 ఏప్రిల్ 2021. Retrieved 27 April 2021.
  4. The Hans India (27 April 2021). "Senior Congress Leader Satyanarayana Rao Passes Away". Archived from the original on 27 April 2021. Retrieved 27 April 2021.
  5. Sakshi (27 April 2021). "కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు కన్నుమూత". Archived from the original on 27 April 2021. Retrieved 27 April 2021.
  6. Prajasakthi (27 April 2021). "మాజీ మంత్రి ఎం.సత్యనారాయణరావు కన్నుమూత | Prajasakti". Archived from the original on 27 ఏప్రిల్ 2021. Retrieved 27 April 2021.