ఎన్. తుకారాంజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎన్. తుకారాంజీ

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
13 అక్టోబర్ 2021 - ప్రస్తుతం
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

వ్యక్తిగత వివరాలు

జననం (1973-02-24) 1973 ఫిబ్రవరి 24 (వయసు 50)
హైదరాబాద్ , తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
పూర్వ విద్యార్థి ఉస్మానియా విశ్వవిద్యాలయం

నూన్‌సావత్‌ తుకారాంజీ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 2021 అక్టోబరు 13న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు.[1][2]ఆయన అక్టోబరు 15న హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[3]

జననం, విద్యాభాస్యం[మార్చు]

ఎన్.తుకారాంజీ 1973 ఫిబ్రవరి 24లో హైదరాబాద్ లో జన్మించాడు. ఆయన ఎల్.ఎల్.బి పూర్తి చేశాడు.[4][5]

వృత్తి జీవితం[మార్చు]

ఎన్.తుకారాంజీ ఎల్.ఎల్.బి పూర్తి చేసి 1996లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు. ఆయన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కోర్టులతో పాటు పలు ట్రైబ్యునళ్లలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి 2007 జిల్లా జడ్జిగా ఎంపికై విశాఖపట్నంలో అదనపు జిల్లా జడ్జిగా, ఏలూరు, కాకినాడలో అదనపు జిల్లా జడ్జిగా, ఏలూరు ప్రిన్సిపల్‌ డ్రిస్ట్రిక్ట్‌ జడ్జిగా, రాజమహేంద్రవరంలలో పనిచేశాడు.[6]

ఎన్.తుకారాంజీ నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తూ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2021 సెప్టెంబరు 16న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సభ్యులు ఉదయ్‌ యూ లలిత్‌, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు వారి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడంతో దానికి రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో అక్టోబరు 13న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు.[7][8]

మూలాలు[మార్చు]

  1. Sakshi (13 October 2021). "తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు". Sakshi. Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
  2. Namasthe Telangana (13 October 2021). "ఏడుగురు కొత్త జడ్జీలకు రాష్ట్రపతి ఆమోదం". Archived from the original on 14 October 2021. Retrieved 15 October 2021.
  3. ETV Bharat News (15 October 2021). "హైకోర్టు నూతన న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం". Archived from the original on 15 October 2021. Retrieved 15 October 2021.
  4. Eenadu (14 October 2021). "తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జిల నియామకం". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
  5. Eenadu (14 October 2021). "హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
  6. Eenadu (14 October 2021). "తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జిల నియామకం". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
  7. V6 Velugu (13 October 2021). "తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీలు" (in ఇంగ్లీష్). Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  8. Andrajyothy (19 August 2021). "సైన్యంలో..న్యాయంలో మహిళలకు జస్టిస్‌". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.