Jump to content

ఎరెబుని జిల్లా

అక్షాంశ రేఖాంశాలు: 40°08′23″N 44°31′40″E / 40.13972°N 44.52778°E / 40.13972; 44.52778
వికీపీడియా నుండి

40°08′23″N 44°31′40″E / 40.13972°N 44.52778°E / 40.13972; 44.52778

ఎరెబుని
Էրեբունի
ఎరెబుని కోట పైనుండి జిల్లా చిత్రం
ఎరెబుని కోట పైనుండి జిల్లా చిత్రం
Location of ఎరెబుని
Coordinates: 40°08′23″N 44°31′40″E / 40.13972°N 44.52778°E / 40.13972; 44.52778
దేశంఆర్మేనియా
మార్జ్ (రాజ్యం_యెవెరాన్
Government
 • జిల్లా మేయర్ఆర్మెన్ హరుత్యుయన్
విస్తీర్ణం
 • Total48 కి.మీ2 (19 చ. మై)
జనాభా
 (2011 జనాభా)
 • Total1,23,092
 • జనసాంద్రత2,600/కి.మీ2 (6,600/చ. మై.)
Time zoneUTC+4 (AMT)
నార్ అరేష్ వీధి నుండి ఎరెబుని జిల్లాలోని భవనాలు

ఎరెబుని, ఆర్మేనియా దేశ రాజధానయిన యెరవాన్ లో ఉన్నటువంటి 12 జిల్లాలలో ఒకటి. ఇది నగరమధ్యలోని ఆగ్నేయ భాగంలో ఉంటుంది. దేనిలోనే ఎరెబుని కోట ఉన్నది. ఎరెబునికు సరిహద్దులుగా పడమటన షెంగావిత్ జిల్లా, ఉత్తరాన కెంట్రాన్, నార్క్-మరాష్, నార్ నార్క్ జిల్లాలు, తూర్పున కొటయ్క్ జిల్లాలు, నుబరాషెన్ జిల్లా, కొటయ్క్ ప్రావిన్స్ జిల్లాలు ధక్షిణాన ఉన్నవి.[1]

అవలోకనం

[మార్చు]

ఇది యెవెరన్ నగరంలోని 21.52% భూభాగం అనగా 48 చ.కి. వైశాల్యంలో ఉంది. ఎరెబుని వైశాల్యపరంగా యెరవాన్ లో అతిపెద్ద జిల్లా. అయితే దానిలోని 29 చ.కి. నివాస లేదా వాణిజ్య భవనాలు ఆక్రమించి ఉన్నాయి. ఇది అనధికారికంగా చిన్న విభాగాలుగా విభజింపబడినది అవి ఎరెబుని ప్రాంతం,  నార్ అరేష్,  సరితాగ్, వర్దాషన్,  ముషవన్, వెరిన్ జ్రేషన్,  నార్ బుటానియ. జిల్లా యొక్క ప్రధాన భాగంలో  సాసుంట్సి డావిట్ స్క్వేర్, మెట్రో రైల్వేస్టేషను ఉంటాయి.  ఎరెబుని వీధి, సాసుంట్సి డావిట్ వీధి, లిబరేటర్స్ స్ట్రీట్, ఇవాన్ ఐవజోస్కి వీధి, రోత్సావ్-ఆన్-డాన్ వీధి, డేవిడ్ బెక్ వీధి, అరిన్ బెర్డ్ వీధి, అర్ట్షాక్ అవెన్యూ (గతంలో బాకు అవెన్యూ),, మూవ్సెస్ ఖోరెనట్సి స్ట్రీట్ లోని దక్షిణ సగభాగం ఈ ప్రాంతంలోని ప్రధాన  రహదారులు.

ఎరెబుని పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందిన జిల్లా, ఇక్కడ అనేక పెద్ద కర్మాగారాలు ఉన్నాయి. అయితే, జిల్లా ప్రధానంగా తక్కువ-ఆదాయం కలిగిన నివాసితులను కలిగి ఉంది.

ఇటీవల, వదలివెసిన అనేక పార్కులను అభివృద్ధి చేయడంతో అవి ఎంతో మంది నివాసితులను ఆకట్టుకుంటున్నాయి. వాటి జాబితాలో లియోన్ పార్క్, కృత్రిమంగా తయారు చేసిన వర్దావర్ సరస్సు, లిబరేటర్స్ పార్క్ ముఖ్యమైనవి.[2] నగర కేంద్ర శ్మశానం, సైనిక శ్మశానాలు కూడా ఉన్న ఎరెబుని జిల్లాలోనే ఉన్నాయి.

ససుంట్సి డావిట్ మెట్రో స్టేషన్, సాసుంట్సి డావిట్ స్క్వేర్ లో ఉన్న యెరవాన్ రైల్వే స్టేషన్ లు జిల్లాకు ప్రయాణవశాలను తీర్చుతాయి. ఎరెబునిలో యెరవాన్ సెంట్రల్ జైలు ఉంది. దానిని ఎరెబుని నేర-ఎగ్జిక్యూటివ్ సంస్థ అని కూడా పిలుస్తారు. ఎరెబుని స్టేట్ రిజర్వ్ 1981 లో సుమారు యెరవాన్ సిటీ సెంటర్ 8 కి.మి ఆగ్నేయ దిశలో ఏర్పాటయింది. సముద్ర మట్టానికి 1300 నుండి 1450  మీటర్ల మధ్యలో 120 హెక్టార్లలో పాక్షిక ఎడారి పర్వతాలు కలిగిన గడ్డి మైదానాలలో రిజర్వ్ ఆక్రమించింది ఉన్నాది .[3]

చరిత్ర

[మార్చు]

పూర్వ చరిత్ర

[మార్చు]
ఎరబుని కోట

పురావస్తు ఆధారాల[4] ప్రకారం యురేర్షియన్ సైనిక కోట క్రీ.పూ. 782 లో చక్రవర్తి ఆర్గిష్టి ఆదేశాలనుసారం ఉత్తర కాకసస్ నుండి జరిగే వ్యతిరేక దాడుల నుండి నగరాన్ని కాపాడడానికి స్థాపించబడింది.[5]

యురర్టియన్ అధికారంలో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున నీటిపారుదల కాలువలు, ఒక కృత్రిమ జలాశయాన్ని ఎరబుని, దాని పరిసర ప్రాంతాలలో నిర్మించారు.

ఆధునిక చరిత్ర

[మార్చు]

సోవియంట్ దేశాలలో కలిపిన తరువాత ఎరివన్ పరిపాలనా ప్రాంతాన్ని క్రమంగా విస్తరించింది, పురాతన ప్రాంతాలయిన ఎరెబుని, సాధారణంగా అరిన్-బెర్డ్ అని పిలవబడే ప్రాంతాన్ని కలిపారు. మొదట బుటానియ పట్టణంలో జరిగిన ఆర్మేనియన్ జెనోసైడ్ నుండి తప్పించుకున్న 60 కుటుంబాలు ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. 1925 లో, వారు స్థాపించారు నార్ బుటానియ ప్రాంతాన్ని స్థాపించారు. స్వదేశమయిన ఆర్మేనియన్ కు వలసొచ్చే ప్రక్రియ ఫలితంగా నార్ అరేష్, వర్దాషన్ ప్రాంతాలు ఆర్మేనియన్లతో నిండిపోయాయి. వీరు 1950-1960 మధ్యలో సిరియా, లెబనాన్, గ్రీస్, ఫ్రాన్స్, బల్గేరియా, ఈజిప్ట్ నుండి వచ్చారు .

ముషావన్, వెరిన్ జ్రేషన్, నగర తూర్పు శివార్లలో ఏర్పడ్డ గ్రామాలు, అవి 1965లో క్రమేణా నగరంలోకి శోషించబడ్డాయి. 1991 ఆగస్టు 8న ఆర్మేనియా నేషనల్ అసెంబ్లీ  ఆమోదించిన ఒక నిర్ణయం ద్వారా లెనిన్ రైయాన్ యొక్క  నామకరణం ఎరబునిగా మార్చబడింది. 1996 లో, ఎరెవన్ ను 12 స్థానిక కమ్యూనిటీలగా విభజించారు.

జనాభా వివరాలు

[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం, ఈ జిల్లాలో 123,092 (యెరవాన్ నగరం జనాభాలోని 11.61%) మంది నివసిస్తున్నారు. 2016 అధికారిక అంచనాల ప్రకారం,126,500 తో నగరంలోని నాల్గవ అత్యధిక జనాభా కలిగిన జిల్లా. 1988 వరకు, ఎరెబునిలో అజెరి మైనారిటీ తెగకు చెందిన వారు 3,000 మంది నివసించేవారు. అయితే, అజెరి సంఘానికి చెందిన ఎక్కువ సభ్యులు కరబఖ్ సంఘర్షణ వలన అజర్బేజాన్ కు వలస వెళ్ళిపోయారు. ప్రస్తుతం, ఎరెబుని జనాభాలో ప్రధానంగా అర్మేనియన్ అపోస్టోలిక్ చర్చికు  చెందిన వారు నివసిస్తున్నారు. సర్ప్ మెస్రాప్ మాష్టాట్స్ చర్చి 2004 నుండి ఇప్పటికీ నిర్మాణంలో ఉంది.

సంస్కృతి

[మార్చు]

ఎరెబునిలో అనేక ప్రజా గ్రంథాలయాలతో సహా లైబ్రరీ №3 ను ఒక్రొ ఒకర్యాన్ (1937) కు స్మృతిగా నిర్మించారు, లైబ్రరీ №10 (1951), లైబ్రరీ №10 (1956), లైబ్రరీ №11 (1960),, మ్యూజిక్ లైబ్రరీ (1966) ఉన్నాయి.[6] పిల్లలు, యువతకు ప్రత్యేకంగా సృజనాత్మకత సెంటర్ №3 కూడా ఉంది.

అనేక సాంస్కృతిక వారసత్వ కట్టడాలు ఉన్నవి, అవి
  • ఎరెబుని కోట క్రీ.పూ. 782 కు చెందినది.
  • యురేర్షియన్ లు నిర్మించిన వర్దవార్ సరస్సు లోని నీటి రిజర్వాయర్ లైయన్ పార్క్ లో ఉన్నది. ఇది క్రీ.పూ.8వ శతాబ్దంలోనిది. అక్కడే ఆర్మేనియన్ జెనోసైడ్ కు గుర్తుగా కట్టిన ఒక చిహ్నం కూడా ఉంది.
  •  దేవిడ్ సాసున్ యొక్క విగ్రహం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నది, దీనిని 1959లో ప్రారంభించారు.
  • అర్గిష్టి 1 యొక్క విగ్రహాన్ని ఎరెబుని సంగ్రహాలయాంలో 2002వ సంవత్సరంలో స్థాపించారు.

సంగ్రహాలయాలు

[మార్చు]
  • ఎరెబుని సంగ్రహాలయం ను ఎరెబుని కోట సమీపంలో 1968లో ప్రారంభించారు,
  • అర్మేనియా రైల్వే మ్యూజియాన్ని యెరెవెన్ రైల్వే స్టేషన్ లోపల 2009 ప్రారంభించారు .

రవాణా

[మార్చు]

ఎరెబుని జిల్లాలో ఎన్నో రకాల ప్రజారవాణా ఉన్నది. సాసుంట్సి డావిట్ స్టేషనులో యెరవాన్ భూగర్భ మెట్రో ను  1981 మార్చి 7లో ప్రారంభించారు.[7]

ఎరెబుని జిల్లాలో యెరవాన్ కు చెందిన రెండవ విమానాశ్రయానికి నిలయం. స్వాతంత్ర్యం నుండి, ఎరెబునిను ప్రధానంగా సైనిక లేదా ప్రైవేట్ విమానాల కోసం ఉపయోగిస్తారు.. ఆర్మేనియన్ ఎయిర్ ఫోర్స్ ఇక్కడ ఒక స్థావరాన్ని ఏర్పరుచుకుంది. ఇక్కడ అనేక MiG-29s కూడా ఉన్నాయి.

విద్య

[మార్చు]

విద్యాసంవత్సరం 2016-17 నాటికి, జిల్లాలో 23 ప్రభుత్వ పాఠశాలలు, 3 ప్రైవేటు పాఠశాలలు, అలాగే పిల్లలకు ప్రత్యేక అవసరాలతో కూడిన 2 వృత్తి పాఠశాలలు ఉన్నాయి. అక్కడ ఒక కళా పాఠశాలకు మైఖేల్ మాలున్ట్సాన్, ఒక సంగీత పాఠశాలకు టిగ్రాన్ చుఖజ్యాన్ పేర్లు పెట్టారు.[8]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Erebuni at Yerevan.am
  2. Parks in Erebuni[permanent dead link]
  3. "Erebuni State Reserve". Archived from the original on 2018-06-17. Retrieved 2018-06-15.
  4. "Rediscovering Armenia" (PDF). 2000. Archived from the original (PDF) on 26 జూన్ 2008. Retrieved 27 April 2008.
  5. Views of Asia, Australia, and New Zealand explore some of the world's oldest and most intriguing countries and cities (2nd ed.). Chicago: Encyclopædia Britannica. 2008. p. 43. ISBN 9781593395124.
  6. Libraries of Yerevan
  7. "Station "Sasuntsi David»" (in Russian). metroworld.ruz.net. Retrieved 27 February 2013.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  8. Art schools in Yerevan