ఎఱ్ఱగుడిపాడు శాసనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎఱ్ఱగుడిపాడు శాసనం కడప జిల్లా యర్రగుంట్ల మండలం ఎర్రగుడిపాడు గ్రామం లోని చెన్నకేశవస్వామి ఆలయంలో ఉంది. దీన్ని సా.శ. 575 లో రేనాటి చోళరాజు ధనంజయ ఎరికళ్ ముత్తురాజు వేయించాడు. భాషాశాస్త్రవేత్తల దృష్టిలో ఇది తొలి తెలుగు శాసనం., తొలి తెలుగు గద్య (వచన) శాసనం కూడా. ఇది తెలుగువాడు తెలుగు మాటల్లో రాసుకొన్న మొదటి శాసనం. ఇది తెలుగు వాక్య రచన కనిపించే మొదటి శాసనం. ఈ శాసనంతోనే తెలుగు శాసనభాషా యుగం ప్రారంభమైంది.[1]

శాసన విశేషాలు

[మార్చు]
  • ఇందులో మొత్తం 3 తెలుగు వాక్యాలు ఉన్నాయి. ఏ వాక్యంలోనూ సమాపక క్రియ లేదు.
  • 'పాఱ' (శకట రేఫం) అనే పదం మొదట ప్రయోగించిన శాసనం. (పాఱ = బ్రాహ్మణుడు)
  • శకట రేఫం కనిపిస్తున్న మొదటి తెలుగు శాసనం.
  • సంఖ్యావాచకం (24 - ఇరువది యాది నాల్కు) కనిపిస్తున్న మొదటి తెలుగు శాసనం.
  • ఇందులో పన్నస, కాలు అనే పదాలు ప్రయోగించబడ్డాయి.
  • పన్నస = పన్ను లేని భూమి.
  • కాలు = గౌరవ బహువచనం.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలుగు శాసనాలు (1975);రచించినవారు జి. పరబ్రహ్మశాస్త్రి

ఇతర లింకులు

[మార్చు]
Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: