ఎల్లోరా (రచయిత)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎల్లోరా
ఎల్లోరా
జననం
గొడవర్తి భాస్కరరావు

1929
వృత్తిరచయిత, సంపాదకుడు
జీవిత భాగస్వామిమాణిక్యాంబ
తల్లిదండ్రులుగొడవర్తి రామమూర్తి, రమణమ్మ
బంధువులుగొడవర్తి విశ్వనాథశాస్త్రి, గొడవర్తి భైరవశాస్త్రి, గొడవర్తి శ్రీరామమూర్తి, మంత్రవాది సుభద్ర

జానపద గేయసాహిత్య పరిశోధకుడిగా, సంకలనకర్తగా, పత్రికా రచయితగా, సంపాదకుడిగా ఎల్లోరా సుప్రసిద్ధుడు.[1]

ఇతని అసలు పేరు గొడవర్తి భాస్కరరావు. బాలసాహిత్యం నుండి ప్రపంచసాహిత్యం వరకు అన్ని తరహాల రచనలు చేసిన అభ్యుదయవాది ఇతడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు 1929లో గొడవర్తి రామమూర్తి, రమణమ్మ దంపతులకు జన్మించాడు.

మైలురాళ్లు

[మార్చు]
 • 1951లో యువజన రాజకీయాలలో నాయకత్వం వహించాడు.
 • 1951 చివరలో మద్రాసు చేరి 1952వరకు చిన్న చిన్న పత్రికలకు అజ్ఞాతంగా ఎడిట్ చేశాడు.
 • 1954లో ట్రిప్లికేన్ సోషియల్ అండ్ కల్చరల్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
 • 1951 నుండి 1960 వరకు మద్రాసు ఆలిండియా రేడియోలో ప్రసంగాలు, నాటికలు, బుర్రకథలు, గేయాలు రచించి ప్రసారం చేశాడు.
 • 1958లో శోభ చిత్రానికి గేయాలు వ్రాశాడు.
 • 1959లో మద్రాసు యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్‌లో ప్రముఖపాత్ర.
 • 1959లో సినీప్రభ పత్రిక సంపాదకత్వం.
 • 1960లో ఆంధ్ర ఫిలిం జర్నలిస్టుల అసోసియేషన్‌ కార్యవర్గ సభ్యుడు.
 • ఆంధ్రజ్యోతి పత్రికలో సబ్ ఎడిటర్‌గా, ఆంధ్రప్రభ పత్రికలో సబ్ ఎడిటర్‌గా, ఎడిటర్‌గా పనిచేశాడు.

రచనలు

[మార్చు]
 1. మన ప్రాచీనకళలు - పుట్టుపూర్వోత్తరాలు
 2. జానపదగేయాలు[2] (రెండు సంపుటాలు)
 3. గుడిగంటలు (నవల)
 4. చంద్రవదన చాకచక్యం[3] (పిల్లల నవల)
 5. కదిలిపోయిన రైలుబండి (కథలసంపుటి)
 6. పూవులు - మొగ్గలు
 7. విచిత్ర కథలు
 8. పాపాయి పాటలు
 9. డాక్టర్ కోకిల
 10. పండగల పాటలు
 11. సరాగాలు
 12. అరుణకిరణాలు (కవితలు)
 13. బాలగేయకథలు
 14. బంతిపూలు
 15. చంద్రముఖి (నవల)
 16. చిన్నారికథలు
 17. దేశిపదాలు
 18. హృదయవీణ
 19. మందారాలు (పిల్లల నవల)
 20. మాయచిలుక (నవల)
 21. పండితరాయలు (బుఱ్ఱకథ)
 22. పరిసరాలు - ప్రభావాలు (సాంఘిక నవల)
 23. ప్రజలపాటలు
 24. సాహిత్య సమారాధన
 25. వెన్నెల రాత్రులు (నాటికలు)
 26. వేసవి సెలవలు (పిల్లల నాటికలు)
 27. మధుర కవితలు[1] మొదలైనవి.

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 ఎల్లోరా (1988). మధురకవితలు. విజయవాడ: విజయ పబ్లిషింగ్ కంపెనీ. pp. 8–11. Retrieved 25 January 2015.
 2. ఎల్లోరా (1955). జానపద గేయాలు (1 ed.). విజయవాడ. Retrieved 25 January 2015.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
 3. ఎల్లోరా (1957). చంద్రవదన చాకచక్యం (1 ed.). విజయవాడ: శ్రీ రామకృష్ణా అండ్ కో.

బయటి లింకులు

[మార్చు]