ఎల్లోరా (రచయిత)
స్వరూపం
(గొడవర్తి భాస్కరరావు నుండి దారిమార్పు చెందింది)
జానపద గేయసాహిత్య పరిశోధకుడిగా, సంకలనకర్తగా, పత్రికా రచయితగా, సంపాదకుడిగా ఎల్లోరా సుప్రసిద్ధుడు.[1]
ఇతని అసలు పేరు గొడవర్తి భాస్కరరావు. బాలసాహిత్యం నుండి ప్రపంచసాహిత్యం వరకు అన్ని తరహాల రచనలు చేసిన అభ్యుదయవాది ఇతడు.
జీవిత విశేషాలు
[మార్చు]ఇతడు 1929లో గొడవర్తి రామమూర్తి, రమణమ్మ దంపతులకు జన్మించాడు.
మైలురాళ్లు
[మార్చు]- 1951లో యువజన రాజకీయాలలో నాయకత్వం వహించాడు.
- 1951 చివరలో మద్రాసు చేరి 1952వరకు చిన్న చిన్న పత్రికలకు అజ్ఞాతంగా ఎడిట్ చేశాడు.
- 1954లో ట్రిప్లికేన్ సోషియల్ అండ్ కల్చరల్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
- 1951 నుండి 1960 వరకు మద్రాసు ఆలిండియా రేడియోలో ప్రసంగాలు, నాటికలు, బుర్రకథలు, గేయాలు రచించి ప్రసారం చేశాడు.
- 1958లో శోభ చిత్రానికి గేయాలు వ్రాశాడు.
- 1959లో మద్రాసు యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్‌లో ప్రముఖపాత్ర.
- 1959లో సినీప్రభ పత్రిక సంపాదకత్వం.
- 1960లో ఆంధ్ర ఫిలిం జర్నలిస్టుల అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడు.
- ఆంధ్రజ్యోతి పత్రికలో సబ్ ఎడిటర్‌గా, ఆంధ్రప్రభ పత్రికలో సబ్ ఎడిటర్‌గా, ఎడిటర్‌గా పనిచేశాడు.
రచనలు
[మార్చు]- మన ప్రాచీనకళలు - పుట్టుపూర్వోత్తరాలు
- జానపదగేయాలు[2] (రెండు సంపుటాలు)
- గుడిగంటలు (నవల)
- చంద్రవదన చాకచక్యం[3] (పిల్లల నవల)
- కదిలిపోయిన రైలుబండి (కథలసంపుటి)
- పూవులు - మొగ్గలు
- విచిత్ర కథలు
- పాపాయి పాటలు
- డాక్టర్ కోకిల
- పండగల పాటలు
- సరాగాలు
- అరుణకిరణాలు (కవితలు)
- బాలగేయకథలు
- బంతిపూలు
- చంద్రముఖి (నవల)
- చిన్నారికథలు
- దేశిపదాలు
- హృదయవీణ
- మందారాలు (పిల్లల నవల)
- మాయచిలుక (నవల)
- పండితరాయలు (బుఱ్ఱకథ)
- పరిసరాలు - ప్రభావాలు (సాంఘిక నవల)
- ప్రజలపాటలు
- సాహిత్య సమారాధన
- వెన్నెల రాత్రులు (నాటికలు)
- వేసవి సెలవలు (పిల్లల నాటికలు)
- మధుర కవితలు[1] మొదలైనవి.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 ఎల్లోరా (1988). మధురకవితలు. విజయవాడ: విజయ పబ్లిషింగ్ కంపెనీ. pp. 8–11. Retrieved 25 January 2015.
- ↑ ఎల్లోరా (1955). జానపద గేయాలు (1 ed.). విజయవాడ. Retrieved 25 January 2015.
{{cite book}}
: CS1 maint: location missing publisher (link) - ↑ ఎల్లోరా (1957). చంద్రవదన చాకచక్యం (1 ed.). విజయవాడ: శ్రీ రామకృష్ణా అండ్ కో.