ఎస్‌. రామమునిరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎస్‌. రామమునిరెడ్డి

రాజ్యసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009 - 2014
నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1983 - 1985

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2004 - 2014
ముందు ఎస్.ఏ. ఖలీల్ బాషా
తరువాత అంజాద్ భాషా షేక్ బెపారి
నియోజకవర్గం కడప నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1960
కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

సిరిగిరెడ్డి రామమునిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1983లో కడప నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ మంత్రివర్గంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేశాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ఎస్‌. రామమునిరెడ్డి 1982లో ఎన్టీ రామారావు టీడీపీ స్థాపించినప్పుడు ఆ పార్టీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టి 1983లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కడప నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత ఎన్టీఆర్ తొలి కేబినెట్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి, 1984లో జరిగిన రాజకీయ సంక్షోభంలో నాదెండ్ల భాస్కరరావు వర్గంలో చేరి ఆయన మంత్రివర్గంలో ఒక నెల పాటు మంత్రిగా పనిచేశాడు.[2]

ఎస్‌. రామమునిరెడ్డి ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ, తిరిగి 1999లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడిగా నియమిడయ్యాడు. ఆయన 2019 జులై 7న హైదరాబాదులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (15 March 2019). "కడప.. మంత్రుల గడప". Archived from the original on 20 మార్చి 2022. Retrieved 11 June 2022.
  2. Sakshi (23 March 2019). "కడప జిల్లా ముఖచిత్రం". Sakshi. Archived from the original on 6 December 2021. Retrieved 6 December 2021.
  3. Andhra Jyothy (7 July 2019). "బీజేపీలో చేరిన టీడీపీ మాజీ మంత్రి". Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.