ఎ.ఎస్.రామన్
ఎ.ఎస్.రామన్ సుప్రసిద్ధ సంపాదకుడు. కాలమిస్ట్.
| ఎ.ఎస్.రామన్ | |
|---|---|
| జననం | అవధానం సీతారాముడు 1919, ఏప్రిల్ 19 కడపజిల్లా, ప్రొద్దుటూరు పట్టణం |
| మరణం | 2001 , జూన్ 24 చెన్నై |
| వృత్తి | ఎడిటర్ |
| ప్రసిద్ధి | పత్రికా సంపాదకుడు, రచయిత |
| మతం | హిందూ |
| తండ్రి | అవధానం కృష్ణముని |
జీవిత విశేషాలు
[మార్చు]
ఎ.ఎస్.రామన్గా ప్రసిద్ధి చెందిన అవధానం సీతారాముడు కడపజిల్లా ప్రొద్దుటూరులో 1909, ఏప్రిల్ 19న జన్మించాడు.ఇతడు ప్రఖ్యాత శాస్తవ్రేత్త సి.వి.రామన్ స్ఫూర్తిగా అవధానం సీతారాముడనే తన పేరును ఎ.ఎస్.రామన్‌గా మార్చుకున్నాడు. దీనికి సి.వి.రామన్ ఆమోదం కూడా ఉంది. ఇతని తండ్రి అవధానం కృష్ణముని బ్రహ్మానందిని అనే పత్రికను నడిపాడు. మదనపల్లిలో ప్రాథమిక విద్య పూర్తిచేసి, వాల్తేరులోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఇతడు అర్థశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందాడు.
రచనా వ్యాసంగం
[మార్చు]1936లో రచనావ్యాసంగాన్ని ప్రారంభించిన ఎ.ఎస్.రామన్ వివిధ తెలుగు, ఇంగ్లీషు పత్రికలకు రచనలు చేశాడు. అవధానం సీతారామమ్మ పేరుతో గృహలక్ష్మి పత్రికలో వ్యాసాలు వ్రాశాడు. ఇతడు 1943లో న్యూఢిల్లీ లోని హిందుస్తాన్ టైమ్స్ పత్రికలో అసిస్టెంట్ ఎడిటర్‌గా తన పాత్రికేయ వృత్తిని ప్రారంభించాడు. ఆ తర్వాత ఇతని పాత్రికేయ జీవితం స్టేట్స్‌మన్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా మొదలైన పత్రికలలో 1960 వరకు సాగింది. 1953లో బొంబాయిలోని ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో సంపాదకునిగా చేరాడు. ఆ పత్రికకు మొట్టమొదటి భారతీయ సంపాదకుడు ఇతడే. లండన్ నుండి వెలువడే ది స్టూడియో మేగజైన్‌కు ప్రత్యేక ఆర్ట్ కన్సల్టెంట్‌గా వ్యవహరించాడు. 1960 నుండి 1970 ల వరకు ఇతడు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా వుండి తర్వాత మద్రాసులో స్వరాజ్య పత్రికకు సంపాదకుడిగా చేరాడు. 2001లో ఇతనికి పద్మ శ్రీ పురస్కారం లభించింది. ఇతడు తంజావూరులోని తమిళ విశ్వవిద్యాలయంలో కొంతకాలం ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్‌కు డీన్‌గా వ్యవహరించాడు. తమిళనాడులోని వంద మంది సమకాలీన చిత్రకారులు, శిల్పులతో తమిళనాడు లలిత కళా అకాడెమి ప్రచురించిన ప్రత్యేక సంపుటాలకు సంపాదక బాధ్యతలు వహించాడు. ఇతడు 2001 , జూన్ 24 తేదీన చెన్నైలో మరణించాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ Special Correspondent (2001-06-28). "A.S. Raman dead". The Hindu. Kasturi Publications. Archived from the original on 2015-01-02. Retrieved 5 March 2015.
{{cite news}}:|last1=has generic name (help)