ఎ.ఎస్. పాటిల్ (నడహళ్లి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎ.ఎస్. పాటిల్

పదవీ కాలం
2018 – 2023
తరువాత సి.ఎస్. నాదగౌడ
నియోజకవర్గం ముద్దేబిహాల్
పదవీ కాలం
2004 – 2013
తరువాత సోమనగౌడ పాటిల్
నియోజకవర్గం దేవర్ హిప్పర్గి

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్
జేడీఎస్

అమీనప్పగౌడ సంగనగౌడ పాటిల్‌ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన దేవర్ హిప్పర్గి, ముద్దేబిహాల్ నియోజకవర్గాల నుండి కర్ణాటక శాసనసభకు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

ఎ.ఎస్. పాటిల్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2008 శాసనసభ ఎన్నికలలో దేవర్ హిప్పర్గి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బసనగౌడ ఆర్. పాటిల్‌పై 30893 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2013 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సోమనగౌడ పాటిల్‌పై చేతిలో 8096 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

ఎ.ఎస్. పాటిల్ ఆ తరువాత 2018 మార్చి 22న భారతీయ జనతా పార్టీలో చేరి,[3] 2018 శాసనసభ ఎన్నికలలో ముద్దేబిహాల్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సి.ఎస్. నాదగౌడపై 8,633 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4] ఆయన 2013 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సి.ఎస్. నాదగౌడ చేతిలో 7,637 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (21 March 2018). "Rebel Congress MLA and JD(S) nominee A S Patil Nadahalli joins BJP". Archived from the original on 23 November 2024. Retrieved 23 November 2024.
  2. The Hindu (22 March 2018). "Nadahalli hopped two parties in five years" (in Indian English). Archived from the original on 23 November 2024. Retrieved 23 November 2024.
  3. The Hindu (21 March 2018). "JD(S) candidate joins BJP" (in Indian English). Archived from the original on 23 November 2024. Retrieved 23 November 2024.
  4. The Indian Express (14 May 2018). "Karnataka assembly election results: List of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  5. Election Commision of India (13 May 2023). "Karnataka Assembly Elections 2023: Muddebihal". Archived from the original on 23 November 2024. Retrieved 23 November 2024.